Friday, May 17, 2024

మాతాపితరులు

తల్లినీ, తండ్రినీ గురువునూ మించిన దైవం లేదని ఉపనిషత్తులు చెబుతున్నాయి. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అని గౌరవించింది.

”మాతా పితసమం దైవం
న దైవం పిత మర్చయేత్‌
సర్వతీర్థ ఫలం జ్ఞేయం
మాతా వందనతాం సదా”
తల్లి ఈ సమస్త భూమితో సమానమైనదని, తండ్రి ఆకాశము అంతటి ఔన్నత్యం కలవాడని చెప్పాయి శాస్త్రాలు.
తండ్రి కంటే జన్మ నిచ్చిన తల్లి ఉన్నత మౖనది అని చెబుతారు. సన్యాసి తండ్రికి కూడా నమస్కరించకూడదు కానీ కన్న తల్లికి నమస్కరించవచ్చు అంటుంది శాస్త్రం. ఇలా చెప్పడమే తండ్రి కన్నా తల్లి ఉన్నతమైనదనే విషయాన్ని చెప్పకనే చెబుతుంది. సర్వ సంగ పరిత్యాగి అయిన సన్యాసం స్వీకరించడానికి కూడా కన్నతల్లి అనుమతి తీసుకోవడం అవసరం అని శాస్త్రాలు చెబుతున్నాయి.
మాతా పితరుల చుట్టూ ప్రదక్షిణం చేయటమనేది, ఈ భూమి చుట్టూ ప్రదక్షిణం చేసిన దానితో సమానమైనది అనే విషయం, కుమారస్వామి వినాయకుడి గణాధిపత్యం కథ మనకు తెలియ చేస్తుంది.
తల్లి సత్య స్వరూపం. తండ్రి జ్ఞాన స్వరూపం. తల్లికీ, తండ్రికీ ఒక్కసారి నమస్కరిస్తే, పదివేల గోదానాలు చేసిన పుణ్యం వస్తుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి.
తల్లితండ్రులకు సేవ చేసిన్లటతే, భూ ప్రదక్షిణ ఆరుసార్లు చేసినంత ఫలమూ, సముద్ర స్నానము వందసార్లు చేసినంత ఫలమూ, వేయిసార్లు కాశీయాత్ర చేసిన ఫలమూ దక్కుతాయని పెద్దలు చెబుతారు.
పితృవాక్య పరిపాలకుడిగా, మాతా పితరులను గౌరవించిన శ్రీ రాముడు అవతార పురుషుడు అయ్యాడు. అంధులైన తల్లితండ్రులను సేవించిన శ్రావణ కుమారుడు చరిత్రలో నిలిచిపోయాడు. తల్లి చెరను విడిపించిన గరుడుడు మ#హనీయుడు అయ్యాడు. ఎవరైతే కన్నతల్లిని గౌరవంగా మంచిగా చూడరో, చూసుకోరో, అభి మానం, ఆప్యాయతలతో సాకరో, సేవలు చేసి ఆమె బాగోగులు చూడరో, వారి పాపానికి నిష్కృతి లేదు. తల్లి ఆశీస్సులు ఎవరైతే పొందలేరో, వారి శరీర మాంసం శునక మాంస ము కన్నా #హనమైనదనే విషయాన్ని శాస్త్రాలు చెబుతున్నాయి.
మాతాపితరులను నిరాదరణ చేసి అవమానపరిస్తే, పర్యవసానం ఎలా ఉంటుందో, జీవితం ఎలా నరక ప్రాయమవుతుందో, పాండురంగడి కథ మనకి తెలియ చేస్తుంది.
చెడు నడవడిక ఉన్న తల్లిని కూడా నిరాదరించినా , నిందించినా తప్పేనని ధర్మ శాస్త్రం చెబుతోంది. తాను చెడిపోయిన, తన బిడ్డలను కూడా చెడగొట్టిన తండ్రిని కూడా అస#హ్యంచుకున్నా , అవమాన పరిచినా, ఆ పుత్రుడికి మహా పాపాలు సంక్రమిస్తాయని అంటారు పెద్దలు. ఎంతటి శాపానికైనా నిష్కృతి ఉంటుంది కానీ, కన్నతల్లి కంట కన్నీరు తెప్పించిన పాపానికి నిష్కృతి లేదు. ఆ పాపం ఏం చేసినా పోదు. లక్ష గోవులను దాన మిచ్చినా, వెయ్యి అశ్వమేధ యాగాలు చేసినా, కన్నతల్లి కంట కన్నీరు తెప్పించిన పాపం పోదని శాస్త్రాలు చెబుతున్నాయి. మాతా పితరులు ప్రత్యక్ష దైవాలు. వారిని కాదని ఎన్ని పూజలు చేసినా, గుళ్ళు గోపురాలు ఎన్ని తిరిగినా, ఏ దేవుడూ కరుణించడు.
– రమాప్రసాద్‌ ఆదిభట్ల 93480 06669

Advertisement

తాజా వార్తలు

Advertisement