Saturday, May 18, 2024

గీతాసారం(ఆడియోతో…)

అధ్యాయం 9, శ్లోకం 22

22.
అనన్యాశ్చింతయంతో మాం
యే జనా: పర్యుపాసతే |
తేషాం నిత్యాభియుక్తానాం
యోగక్షేమం వహామ్యహమ్‌ ||

తాత్పర్యము : నా దివ్యరూపమును ధ్యానించుచు అనన్యభక్తిచే నన్ను సదా అర్చించువారి యోగక్షమములను నేనే వహింతును అనగా (వారికి లేనివి సమకూర్చి, ఉన్నవి సంరక్షింతును)

భాష్యము : నవ విధ భక్తి మార్గములైన శ్రవణము, కీర్తనము, స్మరణము, వందనము, పూజనము, ద్యానము, పాదసేవనము, సఖ్యము, ఆత్మనివేదనము, అన్ని చాలా మంగళదాయకమైనవి. ఇవి ఆధ్యాత్మిక జీవితాన్ని వృద్ధి చేస్తాయి. 24గంటలూ ఇటువంటి కార్యాలలో నిమగ్నమైన ఆత్మ సాక్షాత్కారాన్ని, అనగా భగవంతుని సాన్నిధ్యాన్ని చేరాలనే ఏకైక కోరికను కలిగి ఉండుటను ‘యోగము’ అందురు. భగవంతుడు ఎంతో దయతో అటువంటి భ క్తునికి ప్రత్యేక రక్షణను ఇస్తూ ఉంటాడు. అంతేకాక మరలా తిరిగి భౌతిక బంధనాలలో చిక్కుకోకుండా తానే స్వయముగా కాపాడుతూ ఉంటాడు. దీనినే ‘క్షేమము’ అందురు.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement