Thursday, May 16, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 15, శ్లోకం 11
11.
యతంతో యోగినశ్చైనం
పశ్యంత్యాత్మన్యవస్థితమ్‌ |
యతంతో ప్యకృతాత్మానో
నైనం పశ్యంత్యచేతస: ||

తాత్పర్యము : ఆత్మానుభవమునందు స్థితిని పొందిన యత్నశీలురైన యోగులు దీనినంతటిని స్పష్టముగా చూడగలుగుదురు. కాని అచేతసులు మరియు ఆత్మానుభవమునందు స్థితిని పొందనివారు ప్రయత్నించినను ఏమి జరుగుచున్నదో చూడలేరు.

భాష్యము : నేడు అనేక యోగ ఆశ్రమాలు, యోగులూ ఉన్నప్పటికీ వారందరూ యోగము పేరుతో రకరకాల శరీర విన్యాసాలను చేస్తూ శరీర బలిష్టతను లేదా ఆరోగ్యమును లక్ష్యమని చెప్పుచుందురు. వారు ఈ శ్లోకములో చెప్పిన ‘యతంతోపి అకృతాత్మన:’ కోవకు చెందుదురు. వారు యోగమును అభ్యసించుచున్నట్లు అనిపించినా ఆత్మ సాక్షాత్కారము పట్ల ఆసక్తి లేకపోవుట వలన పునర్జన్మ సిద్ధాంతాన్ని అర్థము చేసుకొనలేరు. కాబట్టి నిజమైన యోగ పద్ధతిలో ఉండి ఆత్మను, ఈ ప్రపంచమును భగవంతున్ని అర్థము చేసుకున్నవారు, అనగా భగవత్సేవలో ఉన్న శుద్ధ భక్తి యోగులు మాత్రమే ఈ మార్పుల నన్నింటినీ అర్థము చేసుకోగలుగుతారు.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement