Saturday, May 4, 2024

గీతాసారం(ఆడియోతో …)

అధ్యాయం 7, శ్లోకం 9

పుణ్యోగంధ: పృథివ్యాం చ
తేజశ్చాస్మి విభావసౌ |
జీవనం సర్వభూతేషు
తపశ్చాస్మి తపస్విషు ||

తాత్పర్యము : భూమి యొక్క ఆద్యమైన సుగంధమును, అగ్నియందు ఉష్ణమును, జీవుల యంద లి ప్రాణమును, తపస్వులయందు తపస్సును
నేనైయున్నాను.

భాష్యము : ‘పుణ్యం’ అనగా మలినము కానిది, లేదా సహజ సిద్ధమైనది అని అర్థం. అలా అమలమైన వాసన శ్రీకృష్ణుడే. అయితే అటువంటి వాసన, రుచి వేర్వేరు పదార్థాలను కలుపుటచే మార్పు చెందుతుంది. ప్రతి వస్తువుకు సహజ సిద్ధముగా ఒక వాసన, రుచి ఉంటాయి. అవి కృష్ణున్ని సూచిస్తాయి. అలాగే అగ్నిలోని ఉష్ణము శ్రీకృష్ణుడు. మనము అనుదినమూ ఉష్ణముపై ఎంతో ఆధారపడి ఉన్నాము. వంట దగ్గర నుండి కర్మాగారాల వరకు. అంతెందుకు మన ఉదరములో జఠరాగ్ని లేనిదే తిన్నదేదీ అరిగించుకోలేము. భూమి, నీరు, అగ్ని, వాయువు, ప్రతి ఉపయోగకర అంశము, రసాయనాలు, భౌతిక మూలకాలన్నీ శ్రీకృష్ణుని కృప మాత్రమే. అలాగే శ్రీకృష్ణుని కృప ద్వారా మన జీవితాన్ని పొడగించుకోవచ్చు లేదా తగ్గించుకోవచ్చు. ఈవిధముగా కృష్ణచైతన్యము సర్వత్రా విస్తరించి యున్నది.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement