Tuesday, April 30, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 12, శ్లోకం 16

16.
అనపేక్ష: శుచిర్దక్ష:
ఉదాసీనో గతవ్యథ: |
సర్వారంభపరిత్యాగీ
యో మద్భక్తస్స మే ప్రియ: ||

తాత్పర్యము : సాధారణ కార్యకలాపముల నాశ్రయింపనివాడును, పవిత్రుడును, సమర్దుడును, ఉదాసీనుడును, సర్వవ్యథల నుంచి ముక్తుడైనవాడున, ఏదేని ఫలము కొరకు తీవ్రకృషి చేయనివాడును అగు నా భక్తుడు నాకు మిక్కిలి ప్రియుడు.

భాష్యము : శుద్ధ భక్తుడు ఎవరైనా దానము ఇస్తే తీసుకుంటాడే గాని ధనము కోసము ప్రాకులాడడు. రోజుకు కనీసము రెండుసార్లు స్నానము చేయుటే కాక భగవత్‌ కార్యములకు ఉదయాన్నే మేలుకుంటాడు. కాబట్టి అతడు బాహ్యాంతరములందు పవిత్రముగా నుండును. శాస్త్రముపై పూర్తి విశ్వాసము ఉండుటచే అన్ని కార్యాలలోనూ జీవిత లక్ష్యమును ఎరిగి ఉండుటచే అతడు దక్షుడు అనబడతాడు. అతడు ఏ పక్షమున చేరడు కాబట్టి ఉదాసీనతను కలిగి ఉంటాడు. అతడు శరీరముతో సహా దేనికీ సంబంధించిన వానిగా భావింపడు. కనుక చీకూ చింత లేకుండా ఉంటాడు. అంతేకాక భక్తుడు భగవద్భక్తికి విరుద్ధమైన కార్యాలను ఎన్నడునూ ప్రయత్నించడు.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement