Sunday, May 5, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 12, శ్లోకం 1

1.
అర్జున ఉవాచ
ఏవం సతతయుక్తా యే
భక్తాస్త్వాం పర్యుపాసతే |
యే చాప్యక్షరమవ్యక్తం
తేషాం కే యోగవిత్తమా: ||

తాత్పర్యము : అర్జునుడు ప్రశ్నించెను : నీ భక్తియుత సేవలో సదా యుక్తముగా నియుక్తులైనవారు మరియు అవ్యక్త నిరాకారబ్రహ్మమును ధ్యానించువారు అను ఇరువురులో ఎవరు మిక్కిలి పరిపూర్ణులని భావింపబడుదురు?

భాష్యము : రెండు రకాల ఆధ్యాత్మిక వాదులు ఉందురు. ఒకరు ప్రత్యక్షముగా భగవంతుణ్ని భక్తియోగము ద్వారా పూజించి ఆయన సాన్నిధ్యానికి చేరుకునే వారయితే మరొకరు నిరాకార బ్రహ్మమును ధ్యానించువారు. అయితే ఇక్కడ అర్జునుడు వారిరువురిలో ఎవరి పద్ధతి ఉత్తమము అని ప్రశ్నించుచున్నాడు. గత అధ్యాయములో భగవంతుని కృప ద్వారా విశ్వరూపాన్ని, చతుర్భుజ రూపాన్ని చూసి చివరకు తనకు ఇష్టమయిన మానవ రూపమును దర్శింపచేయమని కోరెను. తద్వారా అర్జునుడు భక్తియోగము ద్వారా భగవంతుని అన్ని రూపాలను చూడగలిగెను. ఇప్పుడు తన పద్ధతి ఉత్తమమైనదా లేదా నిరాకారవాదము ఉత్తమమైనదా అని తెలుసుకొనగోరుచున్నాడు. ఈ అధ్యాయములో భక్తియోగమే ఉన్నతమైనదని కృష్ణుడు నిరూపించబోవుచున్నాడు.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement