Monday, April 29, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 11, శ్లోకం 45

45.
అదృష్టపూర్వం హృషితోస్మి దృష్ట్వా
భయేన చ ప్రవ్యథితం మనో మే |
తదేవ మే దర్శయ దేవరూపం
ప్రసీద దేవేశ జగన్నివాస ||

తాత్పర్యము : ఇదివరకెన్నడును చూడనటువంటి ఈ విశ్వరూపమును గాంచి నేను మిగుల సంతోషించితిని. కాని అదే సమయమున మనస్సు భయముతో కలత చెందినది. కనుక ఓ దేవదేవా! జగన్నివాసా! నా యెడ కరుణను జూపి నీ దేవదేవుని రూపమును తిరిగి నాకు చూపుము.

భాష్యము : తన స్నేహితుని వైభవానలు చూసి ఎవరైనా ఆనందపడతారు. అలాగే కృష్ణుని వైభవాలను చూసి, అతడు దేవదేవుడని ఆయన వి శ్వరూపాన్ని చూపగలడుని అర్జునుడు ఆనందించెను. అయితే దానిని చూసినపుడు తాను మిత్రుడుగా భావించి అపరాధాలను చేశాననే భయము కలిగెను. అందువలన కృష్ణున్ని తన నారాయణ రూపాన్ని చూపమని అర్థించెను. కృష్ణుడు ఏ రూపాన్నైనా చూపగలడు కాబట్టి ఆ విధమైన విజ్ఞ ప్తిని చేసెను. కృష్ణుడు ఏ రూపాన్నైనా చూపగలడు కాబట్టి ఆ విధమైన విజ్ఞప్తిని చేసెను. కృష్ణుడు తన విస్తార రూపాలలో అనేక వైకుంఠలోకాలలో విస్తరించియుండెను. అర్జునుడు అటువంటి వైకుంఠ రూపాన్ని చూడదలచెను.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement