Saturday, May 4, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 11, శ్లోకం 7
7.
ఇహైకస్థం జగత్‌ కృత్స్నం
పశ్యాద్య సచరాచరమ్‌ |
మమ దేహే గుడాకేశ
యచ్చాన్యద్ద్రష్టుమిచ్ఛసి ||

తాత్పర్యము : ఓ అర్జునా! నీవు చూడగోరు సమస్తమును నా దేహమున ఒక్క మారుగా గాంచుము. నీవు ప్రస్తుతము ఏది చూడగోరినను మరియు భవిష్యత్తున ఏది వీక్షింపదలచినను ఈ విశ్వరూపము నీకు చూపగలదు. స్థావర, జంగమాది సర్వము ఏక స్థానమున దీని యందే సంపూర్ణముగా కలవు.

భాష్యము : మనము ఒక్కచోట కూర్చుని ఉండి విశ్వాన్నంతటినీ చూడలేవము. ఎంత గొప్ప శాస్త్రవేత్తలయినా ఒక చోట కూర్చుని విశ్వములోని ఇతర భాగాలను చూచుట సాధ్యపడదు. అయితే అర్జునుని వంటి భక్తునికి మాత్రము అది సాధ్యమవుతుంది. కృష్ణుడు భూత భవిష్యత్‌ వర్తమానాలలో తాను కోరుకున్నదేనినైనా చూసే దృష్టిని భక్తులకు ప్రసాదించగలడు. ఆ విధముగా కృష్ణుని కృపచే అర్జునుడు అన్నింటినీ చూడగలుగుచున్నాడు.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement