Saturday, May 4, 2024

గీతాసారం… (ఆడియోతో…)


అధ్యాయం 10, శ్లోకం 35
35.
బృహత్సామ తథా సామ్నాం
గాయత్రీ ఛందసామహమ్‌ |
మాసానాం మార్గశీర్షోహమ్‌
ఋతూనాం కుసుమాకర: ||

తాత్పర్యము : నేను సామవేద మంత్రములలో బృహత్సామమును, ఛందస్సులలో గాయత్రిని, మాసములలో మార్గశీర్షమును, ఋతువులలో వసంతఋతువును అయి యున్నాను.

భాష్యము : వేదాలలో సామవేదము ఉత్తమమైనది, ఎందువలననగా సామవేదము నందు ఉన్న మధురమైన గీతాలను దేవతలు సైతమూ, మంచి సంగీత వాయిద్యాలతో గానము చేస్తూ ఉందురు. అటువంటి గీతాలలో ‘బృహత్సామము ‘ మహత్తరమైనది. సుందరమైన రాగముతో, అర్ధరాత్రి యందు పాడబడుతుంది. కవిత్వములో అర్హత గల బ్రాహ్మణులచే జపింపబడు గాయత్రీ మంత్రము ఉత్తమమైనది. ఇది శ్రీమద్భాగవతము నందున పేర్కొనబడినది. ప్రత్యేకించి భగవంతుణ్ని సాక్షాత్కరించుకొనుటకు ఉద్దేశించబడిన దగుటచే ఇది కృష్ణున్ని సూచిస్తుంది. మాసాలలో మార్గశీర్షమాసము అనగా నవంబరు – డిసెంబరు నెల ఉత్తమమైనది. ఆ మాసములో పంటలు, ధాన్యాలు అందుటచే అందరూ ఎంతో ఉల్లాసముగా నుందురు. అయితే ఋతువులలో వసంత ఋతువు చాలా అహ్లాదకరమైనది. ఎక్కువ చలి, ఎక్కువ ఎండ లేకుండా ఆకులు చిగురించి, ఫల పుష్పాలు నిండుగా ఉండు ఈ ఋతువులో కృష్ణుడు అనేక లీలలను గావించెను. కాబట్టి వసంత ఋతువు కృష్ణునికి ప్రాతినిధ్యము వహిస్తుంది.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement