Monday, April 29, 2024

గీతాసారం… (ఆడియోతో…)


అధ్యాయం 10, శ్లోకం 24
24.
పురోధసాం చ ముఖ్యం మాం
విద్ది పార్థ బృహస్పతిమ్‌ |
సేనానీనామహం స్కంద:
సరసామస్మి సాగర: ||

తాత్పర్యము : ఓ అర్జునా! పురోహితులలో ముఖ్యుడైన బృహస్పతిగా నన్నెరుగుము. నేను సేనానాయకులలో కార్తికేయుడను, జలనిధులలో సముద్రమునై ఉన్నాను.

భాష్యము : ఇంద్రుడు దేవతల రాజు. అతడి పురోహితుడు బృహస్పతి, పురోహితులలోకే గొప్పవాడు. అలాగే అతడి సేనాధిపతియైన కార్తికేయుడు, సేనాధిపతులలోకే గొప్పవాడు. అలాగే జలాశయాలలో సముద్రానికి మించినది మరేదియును లేదు. ఇవన్నీ భగవంతుని గొప్పతనానికి చిన్న పాటి మచ్చు తునకలు మాత్రమే.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement