Sunday, April 28, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 2, శ్లోకం 48
48
యోగస్థ: కురు కర్మాణి
సంగం త్యక్త్వా ధన ంజయ |
సిద్ధ్యసిద్ధ్యో: సమో భూత్వా
సమత్వం యోగ ఉచ్యతే ||

తాత్పర్యము : ఓ అర్జునా ! జాయపజయములందు ఆసక్తిని విడనాడి సమబుద్ధితో నీ విద్యుక్తధర్మమును నిర్వహింపుము. అట్టి సమభావమే యోగమనబడును.

భాష్యము : కృష్ణుడు అర్జునున్ని యోగముతో కార్యములను చేయమని ఇక్కడ సూచించుచున్నాడు. యోగమనగా ఇంద్రియ వాంఛలను పట్టించుకోకుండా భగవంతునిపై మనస్సుని ఆపుట. కృష్ణుడే అర్జునున్ని యుద్ధము చేయమనుచున్నాడు కాబట్టి ఆ విధముగా మనస్సును నిలిపి లాభాలాభాలను పట్టించుకోకూడదు. అది కృష్ణుని బాధ్యత. అలా కృష్ణుని ఉపదేశములను దాసుని భావముతో చేసినప్పుడు, నేనే కర్తను, భోక్తను అను భావమును విడనాడవచ్చును. అప్పుడు అది యోగమనబడుతుంది.

అర్జునుడు క్షత్రియునిగా వర్ణాశ్రమ ధర్మము ప్రకారము యుద్ధము చేయవలెను. అయితే విష్ణు పురాణములో తెలిపినట్లు అన్ని ధర్మాలు కూడా భగవంతుని ప్రసన్నార్థమే చేయవలెనని అర్థము చేసుకోవాలి. భౌతిక ప్రపంచములో చాలా వరకూ తమ సంతృప్తి కొరకే కార్యాలను చేస్తుంటారు. కానీ భగవంతుని కోసము కార్యములను చేయవలెనని అనగా అర్జునుడు కృష్ణుని కోసము యుద్ధము చేయవలెనని ఇక్కడ పరోక్షముగా చెప్పబడినాడు.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement