Sunday, April 28, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 2, శ్లోకం 46
46
యావానర్థ ఉదపానే
సర్వత: సంప్లుతోదకే |
తావాన్‌ సర్వేషు వేదేషు
బ్రాహ్మణస్య విజానత : ||

తాత్పర్యము : చిన్న నూతినే ఒనగూడు ప్రయోజనములన్నియును శీఘ్రమే పెద్ద జలాశయము నందలి జలముచే సిద్ధించు రీతి, వేదముల సమస్త ప్రయోజనములు వాని అంతరార్దమును గ్రహించిన వానికి సిద్ధించుచున్నవి.

భాష్యము : వేదాలలో ‘కర్మకాండ’ ద్వారా క్రమేణ ఆత్మసాక్షాత్కారానికి ప్రయత్నించుట బహుకష్టమైన పని. దీనిని తెలియజేయుటకై శ్రీ చైతన్య మహాప్రభువు ప్రకాశానంద సరస్వతి అను సన్యాసి ”నీవెందుకు ఎల్లప్పుడూ నామ సంకీర్తన చేస్తున్నావని” ప్రశ్నించగా, ” నా గురువు గారు నేను మూర్ఖుడనని తెలిపి, వేదాంతాన్ని అర్థము చేసుకొనుటకు తగినవాడిని కాదని, భగవంతుని నామాన్ని ఉచ్చరించిన చాలు, జీవితము సార్థకమవుతుందని చెప్పారని” ప్రత్యుత్తరమిచ్చెను. కాబట్టి ప్రస్తుత కలియుగమున భగవంతుని నామమును కీర్తన చేయుట తప్ప ఎక్కువమంది చేయగలిగినదేదియును లేదు. అయితే వేదాంత సారము కూడా భగవంతునితో సంబంధాన్ని ఏర్పాటు చేసుకొనుటే కనుక, కేవలము నామజపముతో దాన్ని సాధించవచ్చును. ఇదే వేదాలయొక్క అంతిమ లక్ష్యము.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement