Saturday, October 12, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 18, శ్లోకం 75
75.
వ్యాసప్రసాదాచ్ఛ్రుతవాన్‌
ఏతద్గుహ్యమహం పరమ్‌ |
యోగం యోగేశ్వరాత్‌ కృష్ణాత్‌
సాక్షాత్‌ కథయత: స్వయమ్‌ ||

తాత్పర్యము : అర్జునునితో స్వయముగా సంభాషించుచున్న యోగేశ్వరుడైన శ్రీకృష్ణుని నుండి ఈ పరమగుహ్య వచనములను వ్యాసదేవుని కరుణచే నేను ప్రత్యక్షముగా వినగలిగితిని.

భాష్యము : సంజయుడు తన గురువైన వేదవ్యాసుని కృప ద్వారా దేవాదిదేవుడైన శ్రీకృష్ణున్ని అర్థము చేసుకొనగలిగినాడు. అలాగే ప్రతి ఒక్కరూ గురువు ద్వారా కృష్ణున్ని అర్థము చేసుకొనగలరే గాని స్వంత ప్రయత్నముతో కాదు. అర్జునుడు కృష్ణుని నుండి వినుట, సంజయుడు వ్యాసుని ద్వారా ఆ సంవాదమును వినుటలో తేడా ఏమీ లేదు. అనగా గురుపరంపరలో ఉన్న ఏ గురువు నుండీ విన్నా సరే అర్జునుని వలే ఫలితమును పొందవచ్చును. వ్యాసుడు నారదముని శిష్యుడు. సంజయుడు వ్యాసుని శిస్యుడు. ఈ విధముగా పరంపరలోని ప్రతి గురువు వ్యాసుని వంటి వాడే. కాబట్టి గురువు యొక్క జన్మదినమును వ్యాసపూజగా శిష్యులు జరుపుకుందురు. సరైన గురు శిష్య పరంపరలో విననట్లయితే సరైన జ్ఞానమును పొందలేరు.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement