Friday, May 17, 2024

శ్రీ శుభకృత్‌ నామ సంవత్సర రాశి ఫలాలు

‘శ్రీ శుభకృత్‌ ‘ నామ సంవత్సరంలోకి అడుగుపెట్టాం. శుభకృత్‌ అంటే సంవత్సరం అంతా శుభఫలితాలు సంభవిస్తాయని ఆశించవచ్చు. జీవితంలో ఎదురయ్యే కష్ట సుఖాల సమ్మేళనం ఉగాది పండుగ. ఈ సందర్భంగా చాంద్రమానం ప్రకారం రూపొందించిన పంచాంగం ద్వారా ఈ కొత్త తెలుగు సంవత్సరంలో ప్రతీవారు తమతమ గ్రహానుకూలతను తెలుసుకోవాలనుకుంటారు. ఈ శుభకృత్‌ నామసంవత్సరంలో ఏ రాశి వారికి ఏయే గ్రహాల వల్ల ఎలాంటి ఫలితాలు చేకూరతాయో తెలుసుకుందాం.

శ్రీ గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి
9866418082

మేషరాశి (అశ్విని -1,2,3,4, భరణి -1,2,3,4, కృత్తిక-1)
(ఆదాయం -14, వ్యయం -14 రాజ్య పూజ్యం 03, అవమానం 06)
గురువు 2.4.2022 నుండి 13.4.2022 వరకు కుంభరాశి 11వ స్థానమై శుభుడైనందున అన్ని కార్యములందు విజయాన్ని సాధిస్తారు. శత్రు బాధలుండవు. శుభవార్తలు వింటారు. గౌరవ, మర్యాదలు అధికమవుతాయి. కుటుంబంలో అభివృద్ధితోపాటు ఆకస్మిక ధన లాభముంటుంది. 14.4.2022 నుండి వత్స రాంతం వరకు మీనరాశి 12వ స్థానమై అశుభుడైనందున స్థాన చలన సూచనలుంటాయి. శుభకార్యాలకు ధన వ్యయం అధికమవుతుంది. ప్రయాణాలెక్కువ చేస్తారు. అనారోగ్యాలు ఏర్పడకుండా జాగ్రత్త అవసరం.
శని 2.4.2022 నుండి 29.4.2022 మరల 13.7.2022 నుండి 17.1.2023 వరకు మకరరాశి 10వ స్థానమై సాధారణ శుభుడైనందున ఇతరుల ఇబ్బందిని కలుగ జేసే పనులను మానుకోవాల్సి వస్తుంది. వృత్తిలో ఇబ్బందులు అధిగమిస్తారు నూతన కార్యాలు ప్రారంభించకుండా ఉంటే మంచిది. 30.4.2022 నుండి 12.7.2022 మరల 18.1.2023 నుండి వత్సరాంతం వరకు కుంభరాశి 11వ స్థానమై శుభుడైనందున ప్రయత్న కార్యాలందు దిగ్విజయాన్ని పొందుతారు. ఆకస్మిక ధన లాభముంటుంది. కుటుంబంతో సంతోషం గా వుంటారు. ముఖ్యమైన పని పూర్తి కావడంతో ఆనందిస్తారు. కీర్తి ప్రతిష్టలు పొందుతారు.
రాహువు 2.4.2022 నుండి 12.4.2022 వరకు వృషభరాశి 2వ స్థానమై సాధారణ శుభుడైనందున ఆకస్మిక ధన లాభ యోగముంటుంది. కుటుంబంలో సంతృప్తికరంగా ఉంటారు. పేరు, ప్రతిష్టలు లభిస్తాయి. సంఘంలో గౌరవ మర్యాదలుంటాయి. అంతటా అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. స్త్రీలు సౌభాగ్యా న్ని పొందుతారు. బంధుమిత్రులు కలుస్తారు. 13.4.2022 నుండి వత్సరాంతం వరకు మేషరాశి 1వ స్థానమై సాధారణ శుభుడైనందున విదేశయాన ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబంలో అనుకోకుండా లాభమేర్పడే అవకాశముంటుంది. అనారోగ్య బాధలు అధికమవుతాయి. ఆకస్మిక ధన నష్టాన్ని అధిగమిస్తారు.
కేతువు 2.4.2022 నుండి 12.4.2022 వరకు వృశ్చిక రాశి 8వ స్థానమై అశుభుడైనందున అనవసరమైన భయాందోళనలు తొలగిపోతాయి. వృత్తి, ఉద్యోగ రంగాల్లో స్థాన చలన సూచనలున్నవి. ఆర్థిక పరిస్థితుల్లో మార్పులుంటాయి. 13.4.2022 నుండి వత్సరాంతం వరకు తులారాశి 7వ స్థాన మై సాధారణ శుభుడైనందున అనారోగ్య బాధలను అధిగమిస్తారు. నూతన కార్యాలకు ఆటంకాలున్నా సత్ఫలితాలు పొందుతారు. వృత్తి, వ్యాపార రంగాల్లో ధన నష్టమేర్పడకుండా జాగ్రత్త వహించాలి. దైవదర్శనం లభిస్తుంది.

కర్కాటక రాశి (పునర్వసు-4; పుష్యమి- 1,2,3,4; ఆశ్లేష 1,2,3,4)
(ఆదాయం- 05, వ్యయం-05 రాజ్యపూజ్యం- 05, అవమానం- 02)
గురువు 2.4.2022 నుండి 13.4.2022 వరకు కుంభరాశి 8వ స్థానమై అశుభుడైనందున మనో ధైర్యాన్ని కోల్పోకుండా జాగ్రత్త వహించుట అవసరం. నూతన కార్యాలకు ఆటంకాలేర్పడతాయి. కోపాన్ని తగ్గించుకుంటే మంచిది. ఇతరులకు హాని తలపెట్ట కుండా కార్యాలకు దూరంగా ఉంటారు. 14.4.2022 నుండి వత్సరాంతం వరకు మీనరాశి 9వ స్థానమై శుభుడైనందున స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు పరిష్కరింప బడతాయి. నూతన గృహకార్యాలపై శ్రద్ధ వహిస్తారు. ఆకస్మిక ధన లాభం. దైవ దర్శనం చేసుకుంటారు.
శని 2.4.2022 నుండి 29.4.2022 మరల 13.7.2022 నుండి 17.1.2023 వరకు మకరరాశి 7 వస్థానమై శుభుడైనందున విదేశయాన ప్రయత్నం సులభంగా నెరవేరుతుంది. మనో విచారాన్ని పొందుతారు కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఆకస్మిక ధన నష్టం పట్ల జాగ్రత్త వహించుట మంచి ది. నూతన కార్యాలు వాయిదా వేసుకుంటారు. ప్రయాణాలెక్కువ చేస్తారు. 30.4.2022 నుండి 12.7.2022 మరల 18.1.2023 నుండి వత్సరాంతం వరకు కుంభరాశి 8వ స్థానమై సాధారణ శుభుడైనందున ప్రయత్న కార్యాలకు ఆటంకా లెదురౌతాయి. బంధుమిత్రులతో జాగ్రత్తగా మెలగుట మంచిది. ఆకస్మిక కలహాలకు అవకాశముంటుంది.
రాహువు 2.4.2022 నుండి 12.4.2022 వరకు వృషభరాశి 11వ స్థానమై శుభుడైనందున నూతన వస్తు, వాహన, ఆభరణ, లాభాలను పొందుతారు. ఆకస్మిక ధన లాభయోగముంటుంది. శుభవార్తలు వింటారు. ఒక ముఖ్యమైన కార్యక్రమం పూర్తి అవుతుంది. 13.4.2022 నుండి వత్సరాంతం వరకు మేషరాశి 10వ స్థానమై సాధారణ శుభుడైనందున మానసికానందం లభిస్తుంది. గతంలో వాయిదా వేయబడిన పనులు పూర్తవుతాయి. వృత్తిరీత్యా అభివృద్ధి సాధిస్తారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తినిస్తాయి. సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.
కేతువు 2.4.2022 వరకు వృశ్చికరాశి 5వ స్థానమై సాధారణ శుభుడైనందున పట్టుదలతో కొన్ని కార్యా లు పూర్తి చేసుకోగలుగుతారు. పిల్లల పట్ల జాగ్రత్తగా నుండుట మంచిది. వృత్తిరీత్యా గౌరవ, మర్యాదలు పొందు తారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. మనోల్లాసాన్ని పొందుతారు. స్వల్ప అనా రోగ్య బాధ లుంటాయి. 13.4.2022 నుండి వత్సరాంతం వరకు తులారాశి 4వ స్థానమై అశుభుడైనందున కుటుంబ విష యాలపై అనాసక్తితో ఉంటారు. గృహంలో మార్పులు జరిగే అవకాశాలున్నాయి. తలచిన కార్యాలు ఆలస్యంగా నెరవేరుతాయి. కొన్ని కార్యాలు విధిగా రేపటికి వాయిదా వేసుకుంటారు. జాగ్రత్తగా నుండుట మంచిది.

తులారాశి (చిత్త 3,4; స్వాతి 1,2,3,4; విశాఖ 1,2,3)
(ఆదాయం- 08, వ్యయం- 08; రాజ్యపూజ్యం- 07, అవమానం- 01)
గురువు 2.4.2022 నుండి 13.4.2022 వరకు కుంభరాశి 5వ స్థానమై శుభుడైనందున వృత్తి, ఉద్యోగ రం గాల్లో కోరుకున్న అభివృద్ధి ఉంటుంది. ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా లభి స్తుంది. గౌరవ, మర్యాదలు పెరుగుతాయి. పిల్లలకు సంతోషం కలిగించే కార్యాలు చేస్తారు. శుభ కార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. 14.42022 నుండి వత్సరాంతం వరకు మీనరాశి తన స్థానమై సాధారణ శుభుడై నందున ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. ఆకకస్మిక భయాందోళనలు దూరమవు తాయి. ఋణ ప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి. కుటుంబంలో మనశ్శాంతి లోపిస్తుంది. రహస్య శతృబాధలుండే అవకాశం వుంది.
శని 2.4.2022 నుండి 29.4.2022 వరకు, మరల 13.7.2022 నుండి 17.1.2022 వరకు మకరరాశి 4వ స్థానమై అశుభుడైనందున అనారోగ్య బాధలతో సతమతమవుతారు. స్థానచలన సూచనలుంటాయి. నూతన వ్యక్తులు కలుస్తారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తినివ్వవు. గృహంలో మార్పులు కోరుకుంటారు. ఆర్థిక ఇబ్బం దులు దూరమవుతాయి. 30.4.2022 నుండి 12.7.2022 వరకు మరల 18.1.2023 నుండి వత్సరాంతం వరకు కుంభరాశి 5వ స్థానమై అశుభుడైనందున ప్రయత్న కార్యాలకు ఆటంకాలెదురవుతాయి. బంధుమిత్రులతో విరోధ మేర్పడే అవకాశాలుంటాయి. పిల్లల పట్ల పట్టుదల పనికిరాదు. పగ సాధించు ప్రయత్నాన్ని వదిలివేయండి.
రాహువు 2.4.2022 నుండి 12.4.2022 వరకు వృషభరాశి 8వ స్థానమై అశుభుడైనందున మానసిక ఆందో ళన తొలగుతుంది. ఆరోగ్యం గూర్చి జాగ్రత్త వహించాలి. ఆకస్మిక భయం దూరమవుతుంది. ప్రయాణాల్లో మెల కువ అవసరం. ప్రయత్న కార్యాల్లో ఇబ్బందులెదురవుతాయి. విదేశయాన ప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి. 133.4.2022 నుండి వత్సరాంతం వరకు మేషరాశి 7వ స్థానమై సాధారణ శుభుడైనందున ప్రయత్నం మేరకు స్వల్పలాభముంటుంది. వృథా ప్రయాణాలెక్కువ చేస్తారు. వ్యాపార రంగంలో లాభాలుంటాయి. ఋణ ప్రయత్నాలు చేయవలసి వస్తుంది. నూతన కార్యాలకు శ్రీకారం చుడతారు.
కేతువు 2.4.2022 నుండి 12.4.2022 వరకు వృశ్చికరాశి 2వ స్థానమై సాధారణ శుభుడైనందున కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా వుంటాయి. ఆకస్మిక ధనలాభంతో ఋణబాధలు తొలగిపోతాయి. సమాజంలో మంచి పేరు సంపాదిస్తారు. ఇతరులు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటారు. 13.4.2022 నుండి వత్సరాంతం వరకు తులారాశి 1వ స్థానమై సాధారణ శుభుడైనందున ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం. ఆధ్యాత్మిక కార్య క్రమాల్లో పాల్గొంటారు. విదేశయాన ప్రయత్నాలకు మార్గం సుగమమవుతుంది. డబ్బు పొదుపుగా వాడతారు.

- Advertisement -

మకరరాశి (ఉ.షా 2,3,4; శ్రవణం 1,2,3,4, ధనిష్ట 1,2)
(ఆదాయం- 05, వ్యయం – 02, రాజ్యపూజ్యం- 08, అవమానం- 04)
గురువు 2.4.2022 నుండి 13.4.2022 వరకు కుంభరాశి 2వ స్థానమై శుభుడైనందున ధర్మకార్యాలు చేయుటయందు ఆసక్తి పెరుగుతుంది. దైవదర్శనం చేసుకుంటారు. కుటుంబ సౌఖ్యముంటుంది. మానసికానం దాన్ని అనుభవిస్తారు. పేరుప్రతిష్టలు లభిస్తాయి. ఆకస్మిక ధనలాభముంటుంది. శుభవార్తలు వింటారు. 14.4.2022 నుండి వత్సరాంతం వరకు మీనరాశి 3వ స్థానమై సాధారణ శుభుడైనందున బంధుమిత్రులతో విరోధమేర్పడకుండా జాగ్రత్తపడుట మంచిది. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు. వృత్తి, ఉద్యోగ రంగాల్లో అభివృద్ధి ఉంటుంది. మానసికాందోళనతో కాలం గడుస్తుంది.
శని 2.4.2022 నుండి 29.4.2002 మరల 13.7.2022 నుండి 17.1.2023 వరకు మకరరాశి 1వ స్థానమై అశుభుడైనందున బంధుమిత్ర విరోధమేర్పడకుండా జాగ్రత్త వహించుట మంచిది. మానసికాందోళన అధికమవుతుంది. అనారోగ్య బాధలను అధిగమిస్తారు. అనవసర నిందలతో అపకీర్తి వస్తుంది. స్థిరమైన నిర్ణ యాలు తీసుకోలేరు. నూతన కార్యాలకు ప్రణాళికలు చేస్తారు. 30.4.2022 నుండి 12.7.2022 మరల 18.1. 2023 నుండి వత్సరాంతం వరకు కుంభరాశి 2వ స్థానమై శుభుడైనందున కుటుంబ కలహాలు దూరమవుతాయి. వృథా ప్రయాణాలవల్ల అలసట చెందుతారు. చెడు పనులకు దూరంగా వుండుట మంచిది. అందరితో స్నేహంగా వుండటానికి ప్రయత్నించాలి. ఆర్థిక ఇబ్బందులు స్వల్పంగా వుంటాయి.
రాహువు 2.4.2022 నుండి 12.4.2022 వరకు వృషభరాశి 5వ స్థానమై సాధారణ శుభుడైనందున పిల్లల పట్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. అధికారులతో గౌరవింపబడతారు. పట్టుదలతో కొన్ని కార్యాలు పూర్తిచేసుకుంటారు. అనారోగ్య బాధలు తొలగిపోతాయి. ప్రయాణాలు జాగ్రత్తగా చేయుట మంచిది. నూతన వ్యక్తులు పరిచయమవుతారు. 15.4.2022 నుండి వత్సరాంతం వరకు మేషరాశి 4వ స్థానమై అశుభుడైనందున చంచలం అధికమవుతుంది. గృహాలలో మార్పులు కోరుకుంటారు. స్వల్ప అనారోగ్య కారణంతో నరుత్సాహంగా ఉంటారు. ప్రయత్న కార్యాలు ఫలిస్తాయి. కొన్ని పనులు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. ప్రయాణాలుంటాయి.
కేతువు 2.4.2022 నుండి 12.4.2022 వరకు వృశ్చికరాశి 11వ స్థానమై శుభుడైనందున శుభకార్య ప్రయ త్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. శుభవార్తలు వింటారు. బంధుమిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు. నూతన వస్తు, ఆభరణాలను ఖరీదు చేస్తారు. ముఖ్యమైన కార్యాలు పూర్తి అవుతాయి. 13.4.2022 నుండి వత్సరాంతం వరకు తులారాశి 10వ స్థానమై సాధారణ శుభుడై నందున కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా వుండుటచే మానసికానందాన్ని పొందుతారు. వృత్తి, ఉద్యో గాల్లో గుర్తింపు లభిస్తుంది. నిన్నటివరకు వాయిదా వేయబడిన కొన్ని పనులు ఈరోజు పూర్తి చేసుకోగలుగుతారు.

వృషభరాశి (కృత్తిక – 2,3,4, రోహిణి- 1,2,3,4, మృగశిర- 1,2)
(ఆదాయం- 08, వ్యయం -08 రాజ్య పూజ్యం- 0-06 అవమానం-06)
గురువు 2.4.2022 నుండి 13.4.2022 వరకు కుంభరాశి 10వ స్థానమై సాధారణ శుభుడైనందున కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఆకస్మిక ధన నష్టం కలిగే అవకాశం ఉంటుంది. వృత్తి, ఉద్యోగ రంగాల్లో సహనం అవసరం. 14.4.2022 నుండి వత్సరాంతం వరకు మీనరాశి 11వ స్థానమై శుభుడైనందున అన్నిటా విజయాన్ని సాధిస్తారు. శత్రు బాధలుండవు. శుభవార్తలు వింటారు. గౌరవ మర్యాదలు అధికమవు తాయి. అద్భుత శక్తి సామర్ధ్యాలను పొందుతారు. కుటుంబంలో అభివృద్ధి, ఆకస్మిక ధన లాభం ఉంటుంది.
శని 2.4.2022 నుండి 29.4.2022 మరల 13.7.2023 వరకు మకర రాశి 9వ స్థానమై అశుభుడైనందున మానసికాందోళనతో కాలం గడుస్తుంది. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించక తప్పదు. వృత్తి ఉద్యో గ రంగాల్లో అభివృద్ధి ఉంటుంది. స్థిరాస్థులకు సంబంధించిన విషయాల్లో జాగ్రత్త అవసరం. 30.4.2022 నుండి 12.7.2022 మరల 18.1.2023 నుండి వత్సరాంతం వరకు కుంభరాశి 10వ స్థానమై సాధారణ శుభుడైనందున ఇతరులకు ఇబ్బంది కలుగజేసే పనులను మానుకోవాల్సి వస్తుంది. మీరు చేసే ప్రతి పనిలో వ్యతిరేక ఫలితాలు వస్తాయి.
రాహువు 2.4.2022 నుండి 12.4.2022 వరకు వృషభరాశి 1వ స్థానమై సాధారణ శుభుడైనందున విదేశయాన ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబంలో అనుకోకుండా లాభమేర్పడే అవకాశ ముంటుంది. ఆకస్మిక ధన నష్టాన్ని అధిగమిస్తారు.13.4.2022 నుండి వత్సరాంతం వరకు మేషరాశి 12వ స్థానమై అశుభుడైనందున ఆకస్మిక ధన నష్టం పట్ల జాగ్రత్త అవసరం.స్వల్ప అనారోగ్య బాధలుంటాయి. వృధా ప్రయాణాలు చేస్తారు.
కేతువు 2.4.2022 నుండి 12.4.2022 వరకు వృశ్చిక రాశి 7వ స్థానమై సాధారణ శుభుడైనందున అనా రోగ్య బాధలను అధిగమిస్తారు. నూతన కార్యాలకు ఆటంకాలున్నా సత్ఫలితాలు పొందుతారు. ధన నష్టమేర్పడ కుండా జాగ్రత్త వహించాలి. 13.4.2022 నుండి వత్సరాంతం వరకు తులారాశి 6వ స్థానమై శుభుడైనందున శుభకార్య ప్రయత్నాలు నెరవేరుతాయి.ఆకస్మిక ధన లాభయోగముంటుంది. అన్నిటా విజయాన్ని సాధిస్తారు.

వృశ్చికరాశి (విశాఖ- 4; అనూరాధ- 1,2,3,4; జ్యేష్ఠ- 1,2,3,4)
(ఆదాయం- 14, వ్యయం- 14; రాజ్యపూజ్యం- 3, అవమానం- 1)
గురువు 2.4.2022 నుండి 13.4.2022 వరకు కుంభరాశి 4వ స్థానమై అశుభుడైనందున అనుకూల స్థానచలనం కలిగే అవకాశాలున్నాయి. గృహంలో మార్పును కోరుకుంటారు. ఇతరుల విమర్శలకు లోనవుతారు. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేరు. ఆక స్మిక ధనవ్యయం అయ్యే అవకాశం. బంధుమిత్రు లతో జాగ్రత్తగా నుండుట మంచిది. ఋణ ప్రయత్నా లు చేస్తారు. 14.4.2022 నుండి వత్సరాం తం వరకు మీనరాశి 5వ స్థానమై శుభుడైనందున వృత్తి, ఉద్యోగ రంగాల్లో కోరుకున్న అభివృద్ధి ఉంటుంది. ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు. కుటుంబ సౌఖ్యం సంపూ ర్ణంగా లభిస్తుంది. గౌరవ, మర్యాదలు పెరుగుతాయి. పిల్లలకు సంతోషం కలిగించే కార్యాలు చేస్తారు. శుభ కార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి.
శని 2.4.2022 నుండి 29.4.2022 మరల 13.7.2022 నుండి 17.1.2023 వరకు మకరరాశి 3వ స్థానమై శుభుడైనందున కుటుంబమంతా సంతో షంగా ఉంటారు. గతంలో వాయిదా వేసిన పను లన్నీ పూర్తిచేసుకుంటారు. సంపూర్ణ ఆరోగ్యమేర్ప డుతుంది. స్థిర నివాసముంటుంది. కార్యాలన్నీ ఫలి స్తాయి. సూక్ష్మ విషయాలను గ్రహిస్తారు. 30.4.2022 నుండి 12.7.2022 వరకు మరల 18.1.2023 నుండి వత్సరాంతం వరకు కుంభరాశి 4వ స్థానమై అశుభుడై నందున అనారోగ్య బాధలతో సతమతమవుతారు. స్థానచలన సూచనలుంటాయి. నూతన వ్యక్తులు కలు స్తారు. కుటుంబ పరిస్థితులవల్ల మానసికాందోళన చెందుతారు. గృహలో మార్పులు కోరుకుంటారు. ఆర్థిక ఇబ్బందులు దూరమవుతాయి.
రాహువు 2.4.2022 నుండి 12.4.2022 వరకు వృషభరాశి 7వ స్థానమై సాధారణ శుభుడైనందున ప్రయత్నం మేరకు స్వల్ప లాభముంటుంది. వృథా ప్రయాణాలు చేస్తారు. వ్యాపార రంగంలో లాభాలుం టాయి. ఋణ ప్రయత్నాలు చేయవలసి వస్తుంది. నూతన కార్యాలకు శ్రీకారం చుడతారు. బంధుమిత్రు ల సహకారం ఆలస్యంగా లభిస్తుంది. 13.4.2022 నుండి వత్సరాంతం వరకు మేషరాశి 6వ స్థానమై శుభుడైనందున మిక్కిలి ధైర్యసాహసాలు కలిగివుం టారు. సూక్ష్మబుద్ధితో విజయాన్ని సాధిస్తారు. మీ పరాక్రమాన్ని ఇతరులు గుర్తిస్తారు. శుభకార్య ప్రయ త్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. ముఖ్యమైన వ్యక్తుల్ని కలుస్తారు. ఆకస్మిక లాభాలుంటాయి.
కేతువు 2.4.2022 నుండి 12.4.2022 వరకు వృశ్చికరాశి 1వ స్థానమై సాధారణ శుభుడైనందున ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం. ఆధ్యాత్మిక కార్యక్ర మాల్లో పాల్గొంటారు. విదేశయాన ప్రయత్నాలకు మార్గం సుగమమవుతుంది. కుటుంబ కలహాలకు దూరంగా వుంటే మేలు. సహనం అన్నివిధాలా శ్రేయ స్కరం. డబ్బును పొదుపుగా వాడతారు. 13.4.2022 నుండి వత్సరాంతం వరకు తులారాశి 12వ స్థానమై శుభుడైనందున ప్రయాణాల్లో వ్యయప్రయాసలు అధికమవుతాయి. ఆకస్మిక ధననష్టమేర్పడకుండా జాగ్రత్త వహించుట మంచిది. అనారోగ్య బాధలు తొలగుటకు డబ్బు ఎక్కువ ఖర్చుచేస్తారు. తీర్థయాత్ర లు చేస్తారు. దైవదర్శనం ఉంటుంది.

కుంభరాశి (ధనిష్ట- 3,4; శతబిషం- ,2,3,4; పూ.భా. 1,2,3)
(ఆదాయం- 05, వ్యయం- 02 రాజ్యపూజ్యం- 05, అవమానం- 04)
గురువు 2.4.2022 నుండి 13.4.2022 వరకు కుంభరాశి 1వ స్థానమై సాధారణ శుభుడైనందున వృత్తి, ఉద్యోగరంగాల్లో ఆలస్యంగా అభివృద్ధి వుం టుంది. ఆకస్మిక ధననష్టం కలిగే అవకాశాలుంటాయి. ఏ విషయంలోను స్థిర నిర్ణయాలు తీసుకోలేకపో తారు. అనుకోని ఆపదల్లో చిక్కుకోకుండా గౌరవ, మర్యాదలకు భంగం వాటిల్లకుండా జాగ్రత్తపడుట మంచిది. 14.4.2022 నుండి వత్సరాంతం వరకు మీనరాశి 2వ స్థానమై శుభుడైనందున ధర్మకార్యాలు చేయుటయందు ఆసక్తి పెరుగుతుంది. దైవదర్శనం చేసుకుంటారు. కుటుంబ సౌఖ్యముంటుంది. మానసి కానందాన్ని అనుభవిస్తారు. పేరుప్రతిష్టలు లభిస్తా యి. ఆకస్మిక ధనలాభముంటుంది. శుభవార్తలు విం టారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెర వేర్చుకుంటారు.
శని 2.4.2022 నుండి 29.4.2022 మరల 13.7.2022 నుండి 17.1.2022 వరకు మకరరాశి 12వ స్థానమై అశుభుడైనందున అపకీర్తి రాకుండా జాగ్రత్తపడుట మంచిది. స్వల్ప అనారోగ్య బాధలుం టాయి. ప్రయాణాల్లో వ్యయప్రయాసలు తప్పవు. కలహాలకు దూరంగా ఉండుటకు ప్రయత్నించాలి. దూర వ్యక్తుల పరిచయం ఏర్పడుతుంది. 30.4.2022 నుండి 12.7.2022 మరల 18.1.2023 నుండి వత్సరాంతం వరకు కుంభరాశి 1వ స్థానమై అశుభుడై నందున బంధుమిత్ర విరోధమేర్పడకుండా జాగ్రత్త వహించుట మంచిది. మానసికాందోళన అధికమవు తుంది. అనారోగ్య బాధలను అధిగమిస్తారు. అనవ సర నిందలతో అపకీర్తి వస్తుంది. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేరు. నూతన కార్యాలకు ప్రణాళికలు చేస్తారు.
రాహువు 2.3.2022 నుండి 12.4 2022 వరకు వృషభరాశి 4వ స్థానమై అశుభుడైనందున చంచలం అధికమవుతుంది. గృహంలో మార్పులు కోరుకుం టారు. స్వల్ప అనారోగ్య కారణంతో నిరుత్సాహంగా ఉంటారు. స్త్రీలతో తగాదాలేర్పడే అవకాశాలుంటా యి. ప్రయత్న కార్యాలు ఫలిస్తాయి. కొన్ని పనులు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. ప్రయాణాలుం టాయి. 13.4.2022 నుండి వత్సరాంతం వరకు మేష రాశి 3వ స్థానమై శుభుడైనందున అపకీర్తి రాకుండా జాగ్రత్తపడుట మంచిది. మనోల్లాసాన్ని పొందుతారు. సోదరులతో వైరమేర్పడకుండా మెలగాలి. తలచిన కార్యాలకు ఆటంకాలెదురవుతాయి. ఆర్థిక ఇబ్బందు లు ఆలస్యంగా తొలగిపోతాయి.
కేతువు 2.4.2022 నుండి 12.4.2022 వరకు వృశ్చికరాశి 10వ స్థానమై సాధారణ శుభుడైనందున కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా నుండుటచే మానసికానందాన్ని పొందుతారు. వృత్తి, ఉద్యోగ రం గాల్లో మంచి గుర్తింపు లభిస్తుంది. నిన్నటివరకు వాయిదా వేయబడిన కొన్ని పనులు ఈరోజు పూర్తి చేసుకోగలుగుతారు. ముఖ్యమైన వ్యక్తుల్ని కలుస్తారు. 13.4.2022 నుండి వత్సరాంతం వరకు తులారాశి 9వ స్థానమై సాధారణ శుభుడైనందున స్థిరాస్తుల విష యంలో జాగ్రత్త అవసరం. ఒక అద్భుత అవకాశాన్ని కోల్పోతారు. ప్రయాణాలవల్ల లాభాన్ని పొందుతా రు. నూతన కార్యాలు వాయిదా వేసుకోక తప్పదు.

మిథునరాశి (మృగశిర- 3.4; ఆరుద్ర- 1,2,3,4; పునర్వసు-1.2,3)
(ఆదాయం- 11, వ్యయం- 05 రాజ్య పూజ్యం- 02, అవమానం -02)
గురువు 2.4.2022 నుండి 13.4.2022 వరకు కుంభరాశి 9వ స్థానమై శుభుడైనందున స్థిరాస్తులకు సంబం ధించిన సమస్యలు పరిష్కరింపబడతాయి. ఆకస్మిక ధనలాభంతో ఆనందిస్తారు. బంధుమిత్రులతో విందులు, వినోదాల్లో పాల్గొంటారు. భక్తి శ్రద్ధలధికమవుతాయి. 14.4.2022 నుండి వత్సరాంతం వరకు మీనరాశి 10వ స్థాన మై సాధారణ శుభుడైనందున కుటుంబ పరిస్థితులు సంతృప్తినిస్తాయి. వృత్తి, ఉద్యోగ రంగాల్లో సహనం తప్పదు.
శని 2.4.2022 నుండి 29.4.2022 మరల 17.1.2023 వరకు మకరరాశి 8వ స్థానమై సాధారణ శుభుడై నందున ప్రయత్న కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. బంధుమిత్రులతో జాగ్రత్తగా మెలగుట మంచిది. కుటుంబ విషయాల్లో మార్పులుంటాయి. 30.4.2022 నుండి 12.7.2022 మరల 18.1.2023 నుండి వత్సరాం తం వరకు కుంభరాశి 9వ స్థానమై అశుభుడైనందున మానసిక ఆందోళనతో కాలం గడుస్తుంది. వృత్తి ఉద్యో గ రంగాల్లో అభివృద్ధి ఉంటుంది. స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో జాగ్రత్త అవసరం.
రాహువు 2.4.2022 నుండి 12.4.2022 వరకు వృషభరాశి 12వ స్థానమై అశుభుడైనందున ఆకస్మిక ధన నష్టం పట్ల జాగ్రత్త అవసరం. కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. స్వల్ప అనారోగ్య బాధలుంటాయి. స్థాన చలన సూచనలున్నాయి. 13.4.2022 నుండి వత్సరాంతం వరకు మేషరాశి 11వ స్థానమై శుభుడైనందున నూతన వస్తు, వస్త్ర, వాహన, ఆభరణ, లాభాలను పొందుతారు. ఆకస్మిక ధన లాభం. బంధు, మిత్రులతో విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ఒక ముఖ్యమైన కార్యక్రమం పూర్తి అవుతుంది.
కేతువు 2.4.2022 నుండి 12.4.2022 వరకు వృశ్చికరాశి 6వ స్థానమై శుభుడైనందున శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరతాయి. దూర బంధువులతో కలుస్తారు. తద్వారా లాభాలుంటాయి. విదేశ యాన ప్రయత్నాలు సంపూర్ణంగా నేర్చుకుంటారు. ఆకస్మిక ధన లాభం. అన్నిటా విజయాన్ని సాధిస్తారు. తులారాశి 5వ స్థానమై సాధారణ శుభుడైనందున పట్టుదలతో కార్యాలు పూర్తి చేసుకోగలుగుతారు. అనారోగ్య బాధలుంటాయి.

సింహ రాశి (మఖ- 1,2,3,4; పుబ్బ- 1,2,3,4; ఉత్తర -1)
(ఆదాయం- 08, వ్యయం – 14 రాజ్య పూజ్యం- 01, అవమానం- 05)
గురువు 2.4.2022 నుండి 13.4.2022 వరకు కుంభరాశి 7వ స్థానమై శుభుడైనందున రాజకీయ వ్యవహా రాల్లో దిగ్విజయాన్ని పొందుతారు. కార్యాలన్నీ సంపూర్ణంగా ఫలిస్తాయి. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటా రు. గౌరవ మర్యాదలు లభిస్తాయి. శుభవార్తలు వింటారు. 14.4.2022 నుండి వత్సరాంతం వరకు మీనరాశి 8వ స్థానమై అశుభుడైనందున మనో ధైర్యాన్ని కోల్పోకుండా జాగ్రత్త వహించుట అవసరం.
శని 2.4.2022 నుండి 29.4.2022 మరల 13.7.2022 మరల 13.7.2022 నుండి 17.1.2023 వరకు మకరరాశి 6వ స్థానమై శుభుడైనందున బంధుమిత్రులతో కలుస్తారు. నూతన గృహ నిర్మాణ ప్రయత్నం చేస్తారు. ధన లాభంతో రుణ బాధలు తొలగిపోతాయి. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. 30.4.2022 నుండి 12.7.2022 మరల 18.1.2023 నుండి వత్సరాంతం వరకు కుంభరాశి ఏడో స్థానమై శభుడైనందున విదేశయాన ప్రయత్నం సులభంగా నెరవేరుతుంది. ఆకస్మిక ధన నష్టం జాగ్రత్త వహించుట మంచిది.
రాహువు 2.4.2022 నుండి 12.4.2022 వరకు వృషభరాశి రాహువు 10వ స్థానమై సాధారణ శుభుడై నందున మానసికానందం లభిస్తుంది. గతంలో వాయిదా వేసిన పనులు పూర్తవుతాయి. విందు, వినోదాల్లో పాల్గొంటారు. వృత్తి రీత్యా అభివృద్ధి సాధిస్తారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా వుంటాయి. 13.4.2022 నుండి వత్సరాంతం వరకు మేషరాశి 9వ స్థానమై సాధారణ శుభుడైనందున తలచిన కార్యాలకు ఆటంకాలెదుర వుతాయి. స్థిరాస్తులకు సంబంధించి మోసపోయే అవకాశాలుంటాయి. ఆర్థిక పరిస్థితి ఆందోళనకరం.
కేతువు 2.4.2022 నుండి 12.4.2022 వరకు వృశ్చికరాశి 4వ స్థానమై అశుభుడైనందున కుటుంబ విష యాలపై అనాసక్తితో ఉంటారు. తలచిన కార్యాలు ఆలస్యంగా నెరవేరుతాయి. 13.4.2022 నుండి వత్సరాంతం వరకు తులారాశి మూడోస్థానమై శంభుడైనందున నూతన వ్యక్తు లను నమ్మి మోసపోరాదు. సంఘంలో అప్రతిష్ట రాకుండా జాగ్రత్త పడుట మంచిది. ప్రయత్న కార్యాలకు ఆటంకాలెదురవడంతో ఇబ్బందిపడతారు.

కన్యారాశి (ఉత్తర 2,3,4; హస్త 1,2,3,4; చిత్త 1,2)
(ఆదాయం- 11, వ్యయం-05; రాజ్యపూజ్యం-04, అవమానం- 05)
గురువు 2.4.2022 నుండి 13.4.2022 వరకు కుంభరాశి 6వ స్థానమై సాధారణ శుభుడైనందున ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. ఆకస్మిక భయాందోళనలు దూరమవుతాయి. ఋణప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి. కుటుంబంలో మనశ్శాంతి లోపిస్తుంది. బంధుమిత్రులతో వైరమేర్పడకుండా జాగ్రత్త వహించడం మంచిది. రహస్య శతృబాధలుండే అవకాశం వుంది. 14.4.2022 నుండి వత్సరాంతం వరకు మీనరాశి 7వ స్థాన మై శుభుడైనందున రాజకీయ వ్యవహారాల్లో దిగ్విజయాన్ని పొందుతారు. కార్యాలన్నీ సంపూర్ణంగా ఫలిస్తాయి. శుభకార్య ప్రయత్నాలు నెరవేరతాయి. సంపూర్ణ ఆరోగ్యం. గౌరవమర్యాదలు లభిస్తాయి. శుభవార్తలు వింటారు.
శని 2.4.2022 నుండి 29.4.2022 మరల 13.7.2022 నుండి 17.1.2023 వరకు మకరరాశి 5వ స్థానమై అశుభుడైనందున కార్యాలకు ఆటంకాలెదురవుతాయి. ఏదో ఒక విషయం మనస్తాపానికి గురిచేస్తుంది. పగ సాధించు ప్రయత్నాన్ని వదిలివేయడం మంచిది. 30.4.2022 నుండి 12.7.2022 మరల 18.1.2023 నుండి వత్సరాంతం వరకు కుంభరాశి 6వ స్థానమై శుభుడైనందున బంధుమిత్రులతో కలుస్తారు. నూతన గృహ నిర్మాణ ప్రయత్నం చేస్తారు. ఆకస్మిక ధనలాభంతో, ఋణబాధలు తొలగిపోతాయి. కుటుంబ సౌఖ్యముంటుంది. శతృబాధలు దూరం. దీర్ఘకాలిక సమస్యలు తొలగిపోతాయి. ఆరోగ్యం బాగుంటుంది.
రాహువు 2.4.2022 నుండి 12.4.2022 వరకు వృషభరాశి 9వ స్థానమై సాధారణ శుభుడైనందున తల చిన కార్యాలకు ఆటంకాలెదురవుతాయి. స్థిరాస్తులకు సంబంధించిన సమస్యల్లో జాగ్రత్తగా వుండుట మంచిది. మోసపోయే అవకాశాలుంటాయి. ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా మారుతుంది. నూతన కార్యాలు ప్రారంభిం చరాదు. ప్రయాణాలెక్కువ చేస్తారు. 13.4.2022 నుండి వత్సరాంతం వరకు మేషరాశి 8వ స్థానమైనందున మానసిక ఆందోళన తొలగుతుంది. ఆరోగ్యం గూర్చి జాగ్రత్త వహించాలి. ప్రయాణాల్లో మెలకువ అవసరం.
కేతువు 2.4.2022 నుండి 12.4.2022 వరకు వృశ్చికరాశి 3వ స్థానమై శుభుడైనందున నూతన వ్యక్తులను నమ్మి మోసపోరాదు. సంఘంలో అప్రతిష్ఠ రాకుండా జాగ్రత్తపడుట మంచిది. దైవదర్శనానికి ప్రయత్నిస్తారు. ఋణప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి. సోదర వైరం కలిగే అవకాశముంటుంది. 13.4.2022 నుండి వత్సరాంతం వరకు తులారాశి 2వ స్థానమై సాధారణ శుభుడైనందున కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా వుంటాయి. ఆకస్మిక ధనలాభంతో ఋణబాధలు తొలగిపోతాయి. సమాజంలో మంచి పేరు సంపాదిస్తారు. ఇతరులు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొనుటకు కృషి చేస్తారు. స్త్రీలు, బంధుమిత్రులను కలుస్తారు.

ధనూరాశి (మూల 1,2,3,4; పూ.షా 1,2,3,4; ఉ.షా 1)
(ఆదాయం- 02, వ్యయం- 08 రాజ్యపూజ్యం- 06, అవమానం- 01)
గురువు 2.4.2022 నుండి 13.4.2022 వరకు కుంభరాశి 3వ స్థానమై సాధారణ శుభుడైనందున బంధుమిత్రులతో విరోధమేర్పడకుండా జాగ్రత్తపడాలి. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు. వృత్తి, ఉద్యోగ రంగంలో అభివృద్ధి ఉంటుంది. 14.4.2022 నుండి వత్సరాంతం వరకు మీనరాశి 4వ స్థానమై అశుభుడైనం దున అనుకూల స్థాన చలనం కలిగే అవకాశాలున్నాయి. గృహంలో మార్పును కోరుకుంటారు. ఇతరుల విమర్శలకు లోనవుతారు. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేరు. ఆకస్మిక ధనవ్యయం అయ్యే అవకాశం. బంధు మిత్రులతో జాగ్రత్తగా వుండుట మంచిది. ఋణప్రయత్నాలు చేస్తారు.
శని 2.4.2022 నుండి 29.4.2022 మరల 13.7.2022 నుండి 17.1.2023 వరకు మకరరాశి 2వ స్థానమై శుభుడైనందున కుటుంబ కలహాలు దూరమవుతాయి. ప్రయత్న కార్యాలకు ఆటంకాలెదురవుతాయి. వృథా ప్రయాణాలవల్ల అలసట చెందుతారు. చెడు పనులకు దూరంగా వుండటం మంచిది. ఆర్థిక ఇబ్బందులు స్వల్పంగా వుంటాయి. 30.4.2022 నుండి 12.7.2022 మరల 18.1.2023 నుండి వత్సరాంతం వరకు కుంభరాశి 3వ స్థానమై శుభుడైనందున కుటుంబంతో సంతోషంగా వుంటారు. సంపూర్ణ ఆరోగ్యమేర్పడుతుంది.
రాహువు 2.4.2022 నుండి 12.4.2022 వరకు వృషభరాశి 6వ స్థానమై శుభుడైనందున మిక్కిలి ధైర్య, సాహసాలు కలిగియుంటారు. సూక్ష్మబుద్ధితో విజయాన్ని సాధిస్తారు. మీ పరాక్రమాన్ని ఇతరులు గుర్తిస్తారు. శతృబాధలు తొలగిపోతాయి. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. ముఖ్యమైన వ్యక్తుల్ని కలుస్తారు. ఆకస్మిక లాభాలుంటాయి. 13.4.2022 నుండి వత్సరాంతం వరకు మేషరాశి 5వ స్థానమై సాధా రణ శుభుడైనందున పిల్లల వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. అధికారులతో గౌరవింపబడతారు.
కేతువు 2.4.2022 నుండి 12.4.2022 వరకు వృశ్చికరాశి 12వ స్థానమై శుభుడైనందున ప్రయాణాల్లో వ్యయప్రయాసలు అధికమవుతాయి. ఆకస్మిక ధన నష్టమేర్పడకుండా జాగ్రత్త వహించడం మంచిది. అనా రోగ్య బాధలు తొలగుటకు డబ్బు ఎక్కువ ఖర్చు చేస్తారు. దైవదర్శనం ఉంటుంది. 13.4.2022 నుండి వత్స రాంతం వరకు తులారాశి 11వ స్థానమై శుభుడైనందున శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుం టారు. శుభవార్తలు వింటారు. బంధుమిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ఆకస్మిక ధన లాభాన్ని పొందుతారు. నూతన వస్తు, ఆభరణాలను ఖరీదు చేస్తారు. ముఖ్యమైన కార్యాలు పూర్తి అవుతాయి.

మీనరాశి (పూ.భా- 4; ఉ.భా- 1,2,3,4; రేవతి- 1,2,3,4)
(ఆదాయం- 02, వ్యయం- 08; రాజ్యపూజ్యం- 01, అవమానం- 07)
గురువు 2.4.2022 నుండి 13.4.2022 వరకు కుంభరాశి 12వ స్థానమై అశుభుడైనందున ఋణప్రయ త్నాలు తొందరగా ఫలిస్తాయి. స్థానచలన సూచనలుంటాయి. శుభకార్యాల మూలకంగా ధనవ్యయం అధికమ వుతుంది. ప్రయాణాలెక్కువ చేస్తారు. అనారోగ్యమేర్పడకుండా జాగ్రత్త అవసరం. 14.4.2022 నుండి వత్సరాం తం వరకు మీనరాశి 1వ స్థానమై సాధారణ శుభుడైనందున వృత్తి, ఉద్యోగ రంగాల్లో ఆలస్యంగా అభివృద్ధి వుంటుంది. ఆకస్మిక ధననష్టం కలిగే అవకాశాలుంటాయి. ఏ విషయంలోను స్థిర నిర్ణయాలు తీసుకోలేకపోతారు.
శని 2.4.2022 నుండి 29.4.2022 మరల 13.7.2022 నుండి 17.1.2022 వరకు మకరరాశి 11వ స్థానమై శుభుడైనందున ప్రయత్న కార్యాలందు దిగ్విజయాన్ని పొందుతారు. ఆకస్మిక ధనలాభముంటుంది. కుటుంబం అంతా సంతోషంగా కాలక్షేపం చేస్తారు. కీర్తిప్రతిష్టలు పొందుతారు. 30.4.2022 నుండి 12.7.2022 మరల 18.1.2023 నుండి వత్సరాంతం వరకు కుంభరాశి 12వ స్థానమై అశుభుడైనందున అపకీర్తి రాకుండా జాగ్రత్త పడుట మంచిది. స్వల్ప అనారోగ్య బాధలుంటాయి. ప్రయాణాల్లో వ్యయ ప్రయాసలు తప్పవు.
రాహువు 2.4.2022 నుండి 12.4.2022 వరకు వృషభరాశి 3వ స్థానమై శుభుడైనందున అపకీర్తి రాకుండా జాగ్రత్తపడుట మంచిది. మనోల్లాసాన్ని పొందుతారు. సోదరులతో వైరమేర్పడకుండా మెలగాలి. తలచిన కార్యా లకు ఆటంకాలెదురవుతాయి. ఆర్థిక ఇబ్బందులు ఆలస్యంగా తొలగిపోతాయి. 13.4.2022 నుండి వత్సరాంతం వరకు మేషరాశి 2వ స్థానమై సాధారణ శుభుడైనందున ఆకస్మిక ధనలాభ యోగముంటుంది. కుటుంబంలో సం తోషం. పేరుప్రతిష్టలు లభిస్తాయి. సంఘంలో గౌరవ మర్యాదలుంటాయి. అంతటా అనుకూల వాతావరణం.
కేతువు 2.4.2022 నుండి 12.4.2022 వరకు వృశ్చికరాశి 9వ స్థానమై సాధారణ శుభుడైనందున స్థిరాస్తుల విషయంలో జాగ్రత్తగా నుండుట మంచిది. ఒక అద్భుత అవకాశాన్ని కోల్పోతారు. నూతన వ్యక్తుల పరిచయమే ర్పడుతుంది. ప్రయాణాలవల్ల లాభాన్ని పొందుతారు. 13.4.2022 నుండి వత్సరాంతం వరకు తులారాశి 8వ స్థానమై అశుభుడైనందున అనవసరమైన భయాందోళనలు తొలగిపోతాయి. ఆర్థిక పరిస్థితిలో మార్పులుం టాయి. ఋణప్రయత్నాలు చేస్తారు. ఆత్మీయుల సహకారం ఆలస్యంగా లభిస్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement