Sunday, May 19, 2024

విఘ్నాధిప‌తికి తొలిపూజ‌

భారతీయుల ఆరాధ్య దైవం గణపతి. విశిష్ట స్వరూపుడు వినాయకుడు. విఘ్నాతిపతిగా, సర్వ శుభంకరునిగా వినాయకుడు నిత్య పూజితుడు. బ్రహ్మ వైవర్త పురాణం గణపతి పేరును నిర్వచిస్తూ ‘గ’మేధకు, ‘ణ’ మోక్షానికి సమానార్థకాలంటూ ఆ రెండింటికీ ‘పతి’ (అధిదేవుడని) ఆయనను కొనియాడింది. ఇటువంటి దేవదేవుని పూజిం చే చవితి నేడు. హిందువులందరికీ పెద్దపండుగ…

వేదాలలో అతి ప్రాచీనమైన ఋగ్వేదంలో గణపతి శబ్దం ప్రస్తావన కనిపిస్తుంది. బృహస్పతికి పర్యాయపదంగా గణపతిని ఉదహరించారు. దేవగురువైన బృహస్పతి అపార విజ్ఞాన సంప న్నుడు. ఆయనే కాలక్రమంలో గణపతిగా పరిణమించాడనే ఓ వాదన అక్కడక్కడా వినిపిస్తుంది. ఈ వాదన సంగతెలా ఉన్నా, బొజ్జ గణపతి మాత్రం బృహస్పతి సమానుడైన బుద్ధి సంపన్నుడే.
గణపతి కాలచక్ర పరిభ్రమణంలో రానురానూ ఔన్నత్యాన్ని సంతరించుకుంటూ పురాణయుగం నాటికి ప్రసిద్ధ దైవంగా గుర్తిం పు పొందాడు. ఇందుకు పురాణాలు ఎంతో దోహదపడ్డాయి. గణ పతి సిద్ధి వినాయకుడైపోయాడు. త్రిమూర్తులలో ఒకరైన పరమే శ్వరుడి పుత్రుడిగా ప్రసిద్ధి చెందాడు. విఘ్నాధిపతియై ముక్కోటి దేవతలకే కాక ముల్లోకవాసులందరికీ ముఖ్యదైవమై తొలి పూజ లు అందుకోవడానికి అర్హుడయ్యాడు.

”వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ:
నిర్విఘ్నం కురు మే దేవ సర్వ కార్యేషు సర్వదా!!”
సకలదోష నివారకుడు ”వినాయకుడు”. ”విఘ్నం” ‘వి’ అంటే విధి అనగా ప్రతిజీవి ధర్మాచరణం చేయమని ”ఘ్నము” అంటే భగ్నం చేయునది దేవ దానవులెవరైనా మానవులె వరైనా సర్వ విద్యుక్త ధర్మాచారణాన్నీ పాటించు వారికి.. ఎట్టి విఘ్నాలు కలగకుండా కాపాడే విధి ఆ విఘ్నేశ్వరునిది. ధర్మాచరణను విస్మ రించిన వారిని దండించి దారిలో పెట్టడ మే ఆ స్వామి అవతార రహస్యం ఇది గ్రహించి ఆ స్వామిని స్మరించిన వారికి సర్వ ఐశ్వర్య భోగాలు లభిస్తాయని పురా ణాలు పేర్కొంటున్నాయి.
విష్ణువు అతడే శివుడు అతడే శక్తి అతడే ప్ర కృతి పురుషులుగా అవతరించిన ప్రణవ రూ పుడైన ఓంకార స్వరూపుడు అతడే ఈ జగత్తుకు కారకడైన పర బ్రహ్మ అవతారమే ఈ విఘ్నేశ్వరుడు సర్వసిద్ధి ప్రదాత సంకటహరుడు
సర్వగృహ గ్రహదోష నివారకుడు ఆ స్వామినే. ప్రసన్న వదనంతో విష్ణుస్వ రూపంగా జపించి వినాయకుని ధ్యానిస్తే దరిచేరని శుభం లేదంటే అతిశయోక్తి లేదు. స్వామికి గల అనేకానేక నామాలలో మనకు సుపరిచితమైనది ‘గణపతి’ ‘గణం’
అంటే సమూహం అని అర్థం ‘పతి’ అంటే భర్త అని మనకు తెలిసిన అర్థం కానీ భరించువాడు అని విశేషార్థం. జీవన సమూహాలను భరిం చువాడూ జగద్భారకుడూ అయినందున ఆ స్వామికి గణపతి అని పేరు వచ్చింది ‘గణ’ అంటే జ్ఞానం నిర్వాణం అని అర్థం రెండూ కలిస్తే పర బ్రహ్మం.
గణపతి పూర్యష్టకానికి అధిపతి అని తెలుస్తోంది. పూర్యష్టకం అంటే ఎనిమిది రకాల ప్రత్యేకతలున్న పట్ట ణం అని అర్థం. ఇక్కడ పూర్యష్టకం అని చెప్పుకోతగిన ఆ పట్టణం మరేదో కాదు- అది మన దేహిమే. జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, పంచభూతాలు, పంచ ప్రాణాలు, కామం, కర్మ, అవిద్య, మనస్సు అనే ఈ ఎనిమిది ప్రత్యేకతలతో రూపొందినదే మానవ దేహం. దేహానికి గల ప్రత్యేకతలను గ్రహించి తదనుగుణంగా దానికి అధిపతియైన వినాయకుణ్ణి సేవిస్తే అహం నశించి, మోక్షప్రాప్తి కల్గుతుందని భారతీయ రుషిగణం, ఆధ్యాత్మిక వేత్తలూ వివరించి చెప్పారు. వినాయకుని సర్వాంగాల విశి ష్టతను తెలుసుకుందాం.

”ఏకదంతం శూర్పకర్ణం గజవక్త్రం చతుర్భుజం
పాశాంకుశ ధరం దేవం ధ్యయేత్‌ సిద్ధి వినాయకమ్‌”
అని వర్ణించారు.
ఏకదంతం ద్వంద్వాతీత ప్రవృత్తికి, అద్వైత భావనకు ప్రతీక. ఒకసారి పరశురాముడు శివుడి దర్శనానికి వచ్చాడు. శివపార్వతు లు ఏకాంతంగా ఉన్నారనీ, వారి ఏకాంతానికి భంగం కల్గించవద్ద ని ద్వారం దగ్గరే నుంచున్న గణశుడు అడ్డగించాడు. అందుకు పరశురామునికి కోపం వచ్చి చేతనున్న గండ్రగొడ్డ లిని అలా ఝుళిపించగా ఒక దంతం సగానికి విరిగి పోయింది. అలా విరిగిన దంతాన్ని వినాయకు డు దుష్ట సంహార సమయంలో ఆయుధం గానూ, వ్యాస మహర్షి భారతం చెబుతూం డగా రాసేందుకు గంటంగాను ఉపయోగిం చాడు. శూర్పకర్ణుడైనందున భక్తుల మొరలను సులభంగా వింటారని అంతరార్థం. ఆయనది ఏనుగు తల. పెద్దదైన ఆ తల అపార జ్ఞాన భాండా గారానికి గుర్తు. ఎంతటి మహోన్నతుడైనా అణ గిఉన్నంత మాత్రాన గొప్పతనం ఏవిధంగానూ తగ్గదని తెలియచెబుతుంది- ఆ రూపం.
గణశుడు చతుర్భుజుడు. నాల్గు చేతులూ నాల్గు పురుషార్థాలకు సంకేతం. ఒక చేత గండ్రగొడ్డలి లేదా అంకుశం, మరో చేతిలో పాశం, ఇంకో చేతిలో కమలం, నాల్గవచేయి అభయ ముద్ర చూపుతూ ఉంటుంది. చెడును, అజ్ఞానాన్ని నరికివేసేది గొడ్డలి. మందకొడితనా న్ని పోగొట్టి మోక్షమార్గం వైపు నడిపేది అంకుశం. భగ వంతుడిపై భక్తిని పెంపొందించేది పాశము. ఇక కమలం నిర్మల హృదయానికి గుర్తు. సకల కార్యాలను సాధిం చడానికి, భక్తుల బాధలు నివారించడానికి తానున్నా నని భరోసా ఇస్తుంది ఆ అభయ హస్తం. ఐతే, ఆ లంబోదరం సకల జగత్తూ తనలోనే ఉన్నదని గ్రహించమని సూచిస్తుంది. నడిపే వారి సామర్థ్యా న్ని బట్టి వాహనం నడుస్తుంది. ఈ ప్రపంచంలో ఏదీ నీచమైనది కాదనే బోధతోపాటు, చిక్కకుండా పరుగెత్తే ఏ విషయమైనా మన అదుపులోకి రాక తప్పదనేది మూషికం ద్వారా తెలుసు కోమంటుంది వినాయకుని తత్త్వం.

వినాయకుని ఆకారం- తత్వార్థం
వినాయకుని ఆకారంపై ఎన్నో చర్చలు, తత్వార్ధ వివర ణలు, కథలు ఉన్నాయి. ఏనుగు తొండం, పెద్ద బొజ్జ, ఎలుక వాహనం- ఇవి ప్రధానంగా కనిపించే స్వరూప విశేషాలు. సామాన్యులకు అర్ధమయ్యేందుకు ఆ యన విశిష్ట రూపాన్ని ఇలా వర్ణిస్తారు. వినాయకు ని తొండం ”ఓం”కారానికి సంకేతమని చెబుతా రు. ఏనుగు తల జ్ఞానానికీ, యోగానికీ చిహ్నం. మనిషి శరీరం- మాయకూ, ప్రకృతికీ చిహ్నం.. చేతిలో పరశువు- అజ్ఞానాన్ని ఖండించడానికి సంకేతం. చేతిలో పా శం- విఘ్నాలు కట్టిపడేసే సాధనం. విరిగిన దంతం- త్యాగానికి చిహ్నం. మాల జ్ఞాన సముపార్జన, పెద్ద చెవులు- మ్రొక్కులు వినే సంకేతం, పొట్టపై నాగ బంధము- శక్తికి, కుండలినికి ప్రతీక, ఎలు క- జ్ఞానానికి అన్ని జీవుల పట్ల సమభావం ఉండాలని సలహా… వినాయకుని ఆకారం దేవనాగరి లిపిలో ‘ఓం’ (ప్రణవం)ను పోలి ఉన్నదని చెబుతారు.

  • నందిరాజు రాధాకృష్ణ
    98481 28215
Advertisement

తాజా వార్తలు

Advertisement