Sunday, April 28, 2024

దైవలీలలను ఛేదించతరమా

భారతదేశం అంటేనే అంతుచిక్కని మిస్టరీలకు పెట్టింది పేరు. భారతదేశం ఆధ్యాత్మికానికి నిలయం. దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా అద్భుతమైన దేవాలయాలు దర్శనమిస్తూనే వుంటాయి. అయితే వీటిలో కొన్ని మిస్టరీతో మిళితమై ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. అలాంటి మిస్టరీలు ఇప్పటివరకూ వీడనే లేదు. పరిశోధకుల కన్నుకు కూడా వాటి అంతుచిక్కలేదు. మన దేశంలో ఎన్నెన్నో మిస్టరీలున్న దేవాలయాలు అనేకం వున్నాయి. వాటన్నిటికీ ఒక్కొక్క దేవాలయానికి ఒక్కొక్క ప్రత్యేకత కలిగివుంది. వాటి అద్భుతాలను తెలుసుకుందాం-

దొంగతనం అంటే ఎరుగని శని శింగనాపూర్‌

మహారాష్ట్రలో వున్న ఒక చిన్న గ్రామం. ఈ వూరిలోని ఏ ఒక్క ఇంటికి కూడా తలుపులుండవు. అయితే ఇక్కడ దొంగ తనాలు జరిగిన సంఘటన ఒకటి కూడా లేవు. ఒకవేళ దొంగత నం చేస్తే అక్కడ వుండే శనిదేవుడు.. శని రూపంలో శిక్షిస్తాడని భక్తుల నమ్మకం. మరో విశేషం ఏంటంటే డబ్బులు దాచిపెట్టే బ్యాంకులకు కూడా ఇక్కడ వారు తాళాలు వేయరు.

యాగంటి నందీశ్వరుడు

ఆంధ్రప్రదేశ్‌లో ఇది ప్రసిద్ధిచెందిన క్షేత్రం. ఇక్కడ వున్న నంది విగ్ర#హం మిస్టరీ ఇప్పటివరకూ వీడనేలేదు. మొదట్లో చిన్నగావున్న నంది విగ్ర#హం రాను రాను పెరుగుతూ వచ్చి ఆలయప్రాంగణాన్ని ఆక్రమించుకుందని స్థానికులు చెబు తూంటారు. దీనికి సైంటిస్టులు చెప్పే మాట ఏమిటంటే.. ఆ రాయి పెరిగే స్వభావ గుణాన్ని కలిగివుందని, అందుకే ప్రతి 20 ఏళ్ళకు ఒక ఇంచి చొప్పున పెరుగుతూ ఉంటుందని అంటుం టారు. అయితే భక్తుల నమ్మకం మాత్రం అది కాదు. యుగాంతంలో ఆ నంది పైకి లేచి రంకె వేస్తుందని అక్కడి భక్తులందరూ నమ్ముతూవుంటారు..

- Advertisement -

గాలిలో తేలే లేపాక్షిలో స్థంభం

ఆంధ్రప్రదేశ్‌లోని ఆనంతపురం జిల్లాలో లేపాక్షి వుంది. ఇక్కడవున్న స్థం భాలు చాలా మిస్టరీగా మిగిలిపోయాయి. ఈ ఆలయాన్ని 16వ శతాబ్దంలో నిర్మించారు. ఈ స్థంభం క్రింద పేపర్‌కానీ, క్లాత్‌కానీ ఈజీగా పట్టించేయొచ్చు. అంటే స్థంభానికి ప్లnోర్‌కి మధ్య గ్యాప్‌ ఉంటుందన్నమాట. స్థంభం క్రింద ప్లnోర్‌ ఏ సపోర్ట్‌ లేకుండా ఆలయాన్ని మోస్తుందని అర్థం. స్థంభం నేలని తాకకుండా ఆలయాన్ని ఎలా మోస్తుందో, ఇంతవరకు ఎవ్వరూ చెప్పలేకపోయారు..

తంజావూరులో మిస్టరీ

తంజావూరులోని బృ#హదీశ్వరాలయం ఇప్పటికి ఒక మిస్టరీగానే వుంది. దీనిని రాజరాజచోళుడు 11వ శతాబ్దంలో నిర్మించాడు. ఈ ఆలయంలో ర#హ స్యం దాగి వుంది. ఈ ఆలయంలో దాగిన ర#హస్యం నీడ. ఈ ఆలయపు నీడలు ఎవరికి కనిపించవు. సంవత్సరం పొడుగునా ఏ రోజు చూసినా.. సాయంత్రంవేళ ఆ దేవాలయం నీడలు భూమి మీద పడకపోవడంతో ఇది ఎవరికీ అంతుచిక్కని ర#హస్యంగా మిగిలిపోయింది. అలాగే ఆ ఆలయానికి ఉపయోగించిన గ్రానైట్‌ను కూడా ఎక్కడ నుండి తీసుకోచ్చారనేది కూడా తెలియదు.

పూరీజగన్నాథ్‌ ఆలయం

పూరీజగన్నాథ్‌ ఆలయంలో నీడ ఎలాంటి సమయంలో కూడా కనిపించ దు. అంతేకాదు పూరీక్షేత్రానికి సమీపంలో బంగాళాఖాతం సముద్రం వుంది. ఆ సముద్రపు శబ్దం కూడా ఈ ఆలయంలోకి వినిపించదు. ఆలయ సిం#హద్వారం వరకూ సముద్రఘోష వినిపిస్తుంది. అది దాటి లోపలికి వెళ్తే శబ్దం అనేదే వుండ దు. మరి ఆ టెక్నాలజీ ఏంటో కూడా అంతుచిక్కలేదు…

ప్రతీ ఇంట్లో పాములకు
ఓ గది

మహారాష్ట్రలోని షోలాపూర్‌ మ నం రోజూ ఉపయోగించే బెడ్‌ షీట్‌ల కు పెట్టిందిపేరు. ఇక్కడ ఒక వింత గ్రామం వుంది పేరు షెత్పల్‌.. ఈ గ్రామంలో పాములకు పూజ చేయ టం ఆనవాయితీ. ఈ గ్రామంలో ప్ర తి ఇంట్లో పాములకు కూడా ఒక గది వుంటుంది. ప్రతి ఇంట్లో మనుష్యు లు తిరిగినట్టే పాములు కూడా తిరు గుతూవుంటాయి. కాని ఇంతవరకూ ఆ గ్రామంలో ఏ పాము ఎవరినీ కరి చినట్టు కంప్లైంట్స్‌ కూడా లేవు. ఏమై నా పాము తిరుగుతోంది.. అంటేనే భయమేస్తోంది కదూ!

తేళ్ళే కాపలా కాసే అమ్రోహా

ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహా అనే పుణ్యక్షేత్రం చుట్టూ కాపలాగా ఎవరుంటా రో తెలుసా, తేళ్ళు!! అవును.. ఇక్కడ ఆలయం లోపల.. చుట్టూ తేళ్ళు తిరుగుతూ నే వుంటాయి. ఒకటి కాదు, రెండు కాదు వేల సంఖ్యలో. అయితే ఇవి అక్కడకు వచ్చే భక్తులను కుట్టవు. వారు వాటిని పట్టుకుంటారు కూడా.
తూర్పు గోదావరి జిల్లాలోని దివిలి గ్రామంలో తిరుపతి అనే ఊరు ఉంది అక్కడ వేంకటేశ్వర ఆలయం ఉంది అది ఎవరు ఎంత ఎత్తులో ఉంటే అంతే ఎత్తు లో కనిపిస్తుంది. ఇలాంటి ఎన్నో మిస్టరీలు మనదేశంలో ఉన్నాయి. వీటి ర#హస్యా లు ఏంటి అన్నది మన శాస్త్రవేత్తలకు ఇంతవరకు అర్ధం కాలేదు. ఇప్పటికి అవి మిస్టరీగానే ఉండిపోయాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement