Sunday, April 28, 2024

దివ్యారాధన కార్తిక దీపారాధన

కార్తిక మాసం… పౌర్ణమినాడు చం ద్రుడు కృత్తికా నక్షత్రంలో సంచరి స్తాడు. కృత్తిక నుంచి కార్తికం అనే పేరు వచ్చి ఈ మాసం కార్తిక మాసంగా పవిత్ర మయింది. ఆదిదేవునికి ఎంతో ప్రీతికరం. శివుడు… గంగాదేవి… పార్వతిదేవికి ఇష్ట మెన మాసం. ఈ మాసంలో వ్రతాలు… నో ములు… ఉపవాసాలతోపాటు దీపారాధనకు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. దీపం పర బ్రహ్మ స్వరూపం. ఈశ్వరుడు తేజోమయ మూర్తి. ఆయన కాంతి సోకినప్పుడు మన లోని అజ్ఞానాంధకారాలు తొలగిపోతాయి. ‘పరం జ్యోతి’ని ఆరాధన చేస్తున్నామనే అం తర సంస్కారాన్ని కార్తిక దీపం ఉద్దీపనం చేస్తుంది. దీపానికి అంతటి శక్తి ఉంటుంది. ప్రత్యేకించి కార్తిక మాసంలో ఆవునేతితో దీపారాధన అత్యంత పుణ్యదాయకం.
కార్తికమాసం మొదటిరోజున దేవాల యాల్లో ఆకాశదీపం వెలిగిస్తారు. ధ్వజస్తం భానికి తాడుకట్టి, చిన్న పాత్రలో దీపం వెలి గించి పైకెత్తుతారు. ఆ దీపం ధ్వజస్తంభంపై వెలుగుతూ ఈశ్వరునికి ఉత్సవం నిర్వహి స్తుందనే భావనతో ఇలా చేయడం ఆచారం.
పరమ పవిత్రమైన కార్తిక మాసంలో సూర్యోదయానికి ముందే స్నానం చేసి ఆల యాలలో, ఇంట్లో తులసికోట దగ్గర ఆవునే యితో దీపాలు వెలిగించడం, సాయం సం ధ్యలో కూడా దీపాలు వెలిగించి శివుడిని పూజిస్తే పుణ్య ఫలం లభిస్తుంది.
చైతన్యానికి ప్రతీక అయిన దీపానికి ఈ మాసంలో ఆధ్యాత్మిక తత్వంలో విశిష్ట స్థా నం వుంది. ప్రతిరోజు ఉదయం, సాయం త్రం దీపాలు పెట్టమేకాకుండా క్షీరాబ్ది ద్వా దశి,కార్తీక పౌర్ణమి రోజులలో దీపాలను వెలి గిస్తే సర్వపాపహరణం, సర్వదోష నివార ణం అయి పరమేశ్వరుని కృపకు పాత్రుల వుతారని కార్తిక పురాణం చెబుతుంది.
అంత విశిష్టమై దీపం పరబ్రహ్మ స్వరూ పం. పరమేశ్వర అనుగ్రహాన్ని ప్రసాదించే మహమాన్వితమైన దివ్యారాధన దీపారా ధన. త్రికరణశుద్ధిగా భక్తిభావంతో చేసే దీపా రాధన పాపాలను హరించి సకల సౌభా గ్యాలను కలిగిస్తుంది. భగవంతుని అనుగ్ర హాన్ని పొందడానికి, దివ్య జ్ఞానాన్ని సము పార్జించడానికి ఆత్మజ్ఞానాన్ని అర్థం చేసుకో వడానికి దీపారాధన ఒక పవిత్ర సోపానం.
చంచలమైన మన మనస్సును పరమా త్ముని ముందుంచి నిశ్చలమైన ధ్యానదీపం వైపు మళ్లిస్తే.. మన మనస్సు కూడా నిశ్చల మై.. భగవధ్యానంలో నిమగ్నమవుతుంది.
దీపారాధన చేయడం అంటే… ఆ భగ వంతుని ఆరాధించడమే. ఈ నెల రోజులు దీపాన్ని వెలిగిస్తే తెలిసీ తెలీక చేసే పాపాలన్నీ హరించు కుపోయి మహాశివుని అనుగ్ర హం లభిస్తుంది. ఈ మాసంలో శివాలయంలో దీపాలు వెలిగించి నా, ఇంట్లోనే దేవుని ముందు లేదా తులసికోట ఎదుటదీపం వెలిగించినా మంచి ఫలితం ఉం టుంది. శివాలయంలో దీపారాధ న చేయడమంటే ముక్కోటి దేవ తలను పూజించడమే అంటారు. సకలపు ణ్య నదులలో స్నానంచేసిన ఫలం వస్తుంది.
ఈ మాసంలో గృహిణులు, యువతులు వేకువనే స్నానం చేసి తులసికోట ముందు దీపారాధన చేసి గౌరీదేవిని పూజిస్తే ఈశ్వరా నుగ్రహంతోపాటు సౌభాగ్యాన్ని, సకల శుభా లను పొందుతారు. మాసమంతా స్నాన విధిని పాటించలేనివారు పుణ్యతిథులలో నైనా స్నానం ఆచరించాలి.
ఉపాసనా శక్తిని పెంచుకోవడానికి కార్తిక మాసం అనుకూలమైన సమయం. అలాగే శివకేశవుల ప్రీతికి దీపదానం చేస్తారు.
దీప జ్యోతులు

గృ#హంలో వెలిగించే దీపం దృష్టి దీపం.
తులసికోట వద్ద ఉంచే దీపం బృందా వన దీపం. పూజా సమయంలో దేవతల ముందుంచే దీపం అర్చనా దీపం.
అనునిత్యం పూజలో వెలిగించే దీపం నిరంజన దీపం. దేవాలయ గర్భగుడిలో వెలిగించే దీపం నందా దీపం.
లక్ష్మీదేవి ఆరాధనలో వెలిగించే దీపం లక్ష్మీదీపం. దేవాలయ ఆవరణలో గల బలి పీఠంపై వెలిగించే దీపం బలి దీపం.
దేవాలయాల్లో ఎత్తైన స్తంభంపై వెలిగించే దీపం ఆకాశ దీపం.
తేజోమయమూర్తి జ్యోతిర్లింగ శివజ్యో తి. కార్తీక పౌర్ణమినాడు కోట్లాది భక్తులకు దర్శనం ఇచ్చే (తిరువన్నామలై) అరుణాచల జ్యోతి. జ్ఞాన దీపమే మన ఆత్మసందర్శన జ్యోతి. మన ఆత్మ రూపమే దీపజ్యోతి.

Advertisement

తాజా వార్తలు

Advertisement