Tuesday, May 14, 2024

గురువును మించిన శిష్యులు

గురువులు శిష్యులను జ్ఞానవంతులుగా తీర్చిది ద్దుతారు. జ్ఞానవంతులుగా మారిన శిష్యులు జ్ఞానంలో గురువులను మించి వారితోనే శహ బాష్‌ అనిపించుకొన్న సంఘటనలు చరిత్రలో ఎన్నో ఉ న్నాయి. రామకృష్ణ పరమహంస శిష్యుడు వివేకానం దుడు అమెరికాలో ప్రపంచ అధ్యాత్మిక మహాసభలో హందూమత విశిష్టతపై ప్రసంగించి ప్రసిద్దుడైనాడు. నరేంద్రుడు భగవంతుని చూసారా అని పలువురు మహాపురుషులను అడుగుతుండేవాడు. రామకృష్ణ ప రమహంసను కూడా అలాగే అడగ్గా నువ్వు ఎలా ఉన్నావో అలా చూసాను అని సమాధానం చెప్పాడు. నిజంగా చూసారా అని పదేపదే ప్రశ్నించారు. ప్రతి వస్తువు, మనిషిలోనూ ఆత్మ అనే భగవంతుడు ఉం టాడని, అన్నింటిలోనూ ఆత్మరూపంలో ఉన్న భగ వంతుని చూడాలని చెప్పాడు. భగవంతుడిని చూడగ లిగిన గురువే శిష్యుడికి జ్ఞానం ఇవ్వగలరని నరేంద్రు డు రామకృష్ణ పరమహంస శిష్యుడిగా మారారు.
జ్ఞానపీఠ్‌ అవార్డ్‌ గ్రహత కవిసామ్రాట్‌ విశ్వనాథ సత్యనారాయణ తన గురువులు చెళ్లపిళ్ల వెంకట కవు ల గౌరవం తనవల్లే పెరిగిందని ఒకసారి వ్యాఖ్యానిం చారు. గురువు చెళ్లపిళ్ల వెంకట శాస్త్రి సన్మానసభలో ఇలా అన్నారు.
”అల నన్నయ్యకు లేదు తిక్కనకు లేదా
భోగమస్మాదృశుం….
శల చాంద్రమాన మృదు కీర్తి
చెళ్లపిళ్లవంశ స్వామి కున్నట్లుగన్‌”
తనంతటి వాడు శిష్యుడైనాడని చెప్పుకునే భా గ్యం నన్నయ తిక్కనాదులకు లభించలేదని, చెళ్లపిళ్ల వారికి దక్కిందని వ్యాఖ్యానించారు.
గురువుల పట్ల ఎనలేని గౌరవం ఉన్న విశ్వనాథ వారు తన ప్రతిభపైన కూడా అపారమైన విశ్వాసం కన పరిచేవారు. అందుకు తార్కాణం ఆయన నోటివెంట వచ్చిన ఈ మాటలే. ఇవి ఆయన అతిశయంతో చెప్పి న మాటలు కావు. ఆత్మవిశ్వాసంతో అన్న మాటలు. విశ్వనాథ అన్నమాటలో నిజం ఉంది కదా!
పాండవులు, కౌరవుల గురువు ద్రోణాచార్యుడి ప్రియ శిష్యుడు అర్జునుడు. విలువిద్య పరీక్షలో పక్షిని గురి చూడమనగా శిష్యులు తలోరకంగా చెప్పారు. అర్జునుడు మాత్రం పక్షి కనుగుడ్డు కనపడుతున్నదని చెప్పడం లక్ష్యంపట్ల శ్రద్ధ ద్రోణునికి ప్రియశిష్యుడిగా చేసింది. అర్జునుడు చీకటిలో శబ్దానికి అనుగుణంగా బాణాలు వేయడం అనే శబ్దబేధి విద్యను స్వయంగా నేర్చుకున్నాడు. తను నేర్పక పోయినా స్వంతంగా విద్యను నేర్వడం ద్రోణుడు గర్వించాడు. తనను మిం చినవాడుగా కీర్తించాడు. పరశురాముడి శిష్యరికంలో నేర్చుకున్న అస్త్ర శస్త్ర ర#హస్యాలను పూర్తిగా అర్జునుడి కి బోధించాడు. తన కుమారుడు అశ్వత్థామకు సైతం చెప్పలేదు. కురుక్షేత్ర యుద్ధంలో పద్మవ్యూ#హం ఛేదిం చడం ద్రోణుడు, అర్జునునికి మాత్రమే బోధించాడు. పద్మవ్యూహం ఛేదించలేక అభిమన్యుడు మృతి చెంది న విషయం తెలిసిందే. అర్జునుడు గురువును మించిన శిష్యుడిగా ఉత్తర గోగ్రహణంలో నిరూపించాడు.
కంసవధ అనంతరం తాత ఉగ్రసేనుడికి పట్టం కట్టిన అనంతరం శ్రీకృష్ణుడు అన్న బలరాముడితో కల సి సాందీపుని గురుకులంలో విద్యను అభ్యసించాడు. విద్య పూర్తి అయిన తరువాత గురువుకు కృష్ణుని శక్తి సా మర్థ్యాలు తెలుసు కనుక గురుదక్షిణగా నీటిలో అదృ శ్యమైన తన కుమారుడిని తెచ్చి ఇమ్మన్నారు. సాందీ పుని కుమారుడు ప్రభాస సముద్రంలో స్నానానికి దిగి అదృశ్యుడైనాడు. కృష్ణుడు అన్న బలరాముడితో అక్క డికి వెళ్లి వెతకగా సముద్రుడు ప్రత్యక్షమై గురు పుత్రుని ఒక రాక్షసుడు మింగివేసాడని తెలిపాడు. అంతట వా రు ఆ రాక్షసుని చంపివేసారు. సాందీపుని కుమారుడి కోసం యమలోకం వెళ్లారు. యముడు గురుపుత్రుని వారికి అప్పగించాడు. సాందీప ముని గురుదక్షిణ కృష్ణుడు ఆ రూపంలో తీర్చుకున్నాడు.
గురుకులంలో కుచేలుడు వీరి సహచరుడు. ఒక సారి రామకృష్ణులకు సాందీపుని భార్య ఇచ్చిన శనగ లు వారికి ఇవ్వకుండా కుచేలుడు తినడం వల్ల భవిష్య త్‌లో గర్భదారిద్య్రం అనుభవించాడు. కృష్ణుడికి భూ త భవిష్యత్‌లు తెలుసన్న విషయం కుచేలుడికి తెలియ కపోవడంవల్ల ఫలితం అనుభవించాడు. ఆ తర్వాత కృష్ణుడు కుచేలుడు ఇచ్చిన అటుకులతో తృప్తి పడి బం గారు పట్టణం ఇచ్చాడు. కృష్ణుడు పుట్టుకతోనే భగవం తుని అవతారమని ఆయన లీలలు నిరూపించాయి.
శ్రీరాముడు ఆది నుంచి మనుష్యుడిగానే ఉండి వారు పాటించవలసిన ధర్మాలను ఆచరించి చూపా డు. తన గురువులు వశిష్టుడు, విశ్వామిత్రుల శిష్యరి కంలో సమస్త అస్త్ర శస్త్ర విద్యలు సంపాదించి లోకక ల్యాణం కోసం రాక్షసులను దునుమాడాడు. దండకా రణ్యానికి విముక్తి కలిగించారు. విశ్వామిత్రుడు వెంట యాగ రక్షణ నుంచి సీతాకళ్యాణం వరకూ ఉన్న శ్రీ రాముడికి అనేక విద్యలను బోధించారు. భవిష్యత్‌లో రాముడిని యోధుడిగా నిలబెట్టాయి. ధర్మం తప్పని వాడుగా నిలబెట్టాయి. అస్త్రశస్త్రాలతో పాటు రాముడి కి సమస్త ధర్మాలు విశ్వామిత్రుల వారు బోధించారు. యాగ రక్షణలో భాగంగా తాటకిని చంపుతున్నప్పు డు స్త్రీని చంపడం ధర్మమా అనే సందేహం రాముడికి వచ్చింది. విశ్వామిత్రుడు మునులను, బ్రాహ్మణులను చంపే దుష్టురాలును సం#హరించుట అధర్మం కాదని నచ్చచెప్పడంతో రాముడు తాటకిని కడతేర్చాడు. రా ముడు తాటకితోనే రాక్షస సంసారానికి శ్రీకారం చుట్టా రు. భవిష్యత్‌లో రావణ వధతో పాటు అనేక మంది రాక్షసులను సంహరించాడు.
వశిష్టుడు నామకరణం చేస్తే విశ్వామిత్రుడు అన్నప్రాసన చేసాడన్నట్లు వీరిద్దరి ప్రభావం రాముడు ధీరోదాత్తగుణ సంపత్తికి దో#హదపడింది. గురువుల గౌరవాన్ని పెంచి రాముడి పేరుతో పాటు వారిద్దరి పేర్లు గుర్తుకు వచ్చేలా సత్‌ శిష్యుడిగా నిలిచాడు.
ఒకేసారి గురువు, భగవంతుడు వస్తే నీవు ఎవరికి నమస్కారం పెడతామని కబీర్‌ ను అడిగితే తాను గురు వుకు మొదట వందనం చేస్తానని తెలిపాడు. అందుకే తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నారు మన పెద్దలు.
అపర గాన గాంధర్వుడు బాలమురళీకృష్ణ గురు వు పారుపల్లి రామకృష్ణ పంతులు. 11 ఏళ్ల ప్రాయం నుంచే బాలమురళీ చక్కని కీర్తనలు పాడేవారు. తిరు వాయూరులో జరిగే గాన సభలకు బాలమురళీని రామకృష్ణ పంతులు తీసుకువెళ్లారు. అక్కడ బాలము రళీ గానం విన్న శ్రోతలు మంత్రముగ్ధులయ్యారు. మరిన్ని పాటలు పాడమని కోరగా చిన్నపిల్లవాడు అలసిపోయాడని వారించి దిష్టితీసారట గురువు రామకృష్ణ పంతులు. అలా చరిత్రలో ఎందరో శిష్యు లు గురువుల అభిమానం సాధించి చరితార్థులైనారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement