Monday, May 20, 2024

ధీరోదాత్తుడు…పురుషోత్తముడు…శ్రీరాముడు!

శ్రీరామచంద్రమూర్తి మర్యాద పురుషోత్తముడు, ధీరోదాత్త లక్షణాలు ఉన్న నరోత్తముడు. సాక్షాత్‌ నారద మహర్షి వాల్మీకి మహర్షికి ఈ విషయం వివ రించాడు. వాల్మీకి ఆశ్రమాన్ని ఒకసారి నారద మహర్షి సందర్శించారు. అప్పుడు వాల్మీకి ఆయనను 16 ధీరోదాత్త గుణాలు సంపూర్ణంగా… నా సమకాలీను డిగా జీవించి ఉన్న వ్యక్తి ఉన్నాడా అని ప్రశ్నించాడు. అందుకు నారదుడు ఉన్నాడు అతనే కోసల దేశ రాజు దశరథ పుత్రుడు శ్రీరాముడు అని చెప్పారు. ఆయన భార్య సీతాదేవి అప్పటికే వాల్మీకి ఆశ్రమంలో ఉన్న విషయం ఆయనకు తెలియదు. నార దుడి సమాచారంతో సీతా సాధ్వి తన ఆశ్రమంలోనే వుంటున్న విషయం గ్ర#హంచా డు. ఆమె ఇక్కడే ఇద్దరు బిడ్డలను ప్రసవించిన విషయం విదితమే. ధర్మం తూచ తప్పక పాటించే మర్యాద రాముడికి ఉన్న ధీరోదాత్త లక్షణాలు గుణవంతుడు, వీరు డు, ధర్మమూర్తి, కృతజ్ఞుడు, సత్య వాక్పాలకుడు, దృఢవ్రతుడు, ప్రవర్తనలో సజ్జను డు, సర్వభూతాలపై కరుణాసముద్రుడు, విద్వాన్‌ (జ్ఞాని), సర్వ సమర్ధుడు, ప్రియద ర్శనుడు (పుంసాం మోహన రూపాయ) ఆజానుబాహుడు, ఆత్మవాన్‌ (ధైర్యవంతు డు), క్రోధాన్ని జయించినవాడు, అసూయాద్వేషాలు లేనివాడు, అపార కాంతితో వెలుగేవాడు, కోపాన్ని జయించినా అవసరమైనప్పుడు ఉన్నట్లు నటించేవాడు శ్రీరా ముడు. గుణాలలో మేటి. శీలవంతుడు. ఏకపత్నీవ్రతుడు. వీరత్వంలో అసహాయ శూరుడు. దండకారణ్యాన్ని రాక్షసుల నుంచి విముక్తి కలిగించినవాడు. ధర్మం తప్ప ని, ధర్మమే ఊపిరిగా జీవించిన చక్రవర్తి. స్నేహధర్మం పాటించినవాడు. తల్లిదండ్రు లు, గురువుల పట్ల కృతజ్ఞుడు. సత్యవాక్యాన్ని అనుష్టించినవాడు. అనుకొన్నది సాధించేవరకూ విశ్రమించని దృఢవ్రతుడు. ప్రవర్తనలో ధర్మమూర్తి. కష్టంలో ఉన్న సర్వ ప్రాణుల పట్ల దయ చూపినవాడు. సర్వ శాస్త్ర పారంగతుడు. అన్ని కార్యాలలో సర్వ సమర్ధుడు. పురుషులకే ఈర్ష్య కలిగే అందం కలవాడు. ఆజానుబాహుడు తలెత్తి చూసేంత ఎత్తు కలవాడు. ధైర్యంలో ఆయనకు సాటి లేరు. క్రోధాన్ని జయిం చినవాడు, అసూయ, కోపాలను జయించినవాడు, అపారమైన తేజస్సు కలిగినవా డు. వేదం ధర్మాన్ని ప్రతిపాదిస్తుంది. వేద ప్రమాణంగా ధర్మాన్ని అనుష్టింప చేసినవా డు శ్రీరాముడు. శ్రీరాముడు, రావణుడు ఇద్దరూ ధర్మం తెలిసినవారు. తెలుసుకో వడం వేరు, అనుష్టించడం వేరు. రాముడు ధర్మాన్ని అనుష్టించాడు. రావణుడు ధర్మాన్ని తనకు అనుగుణంగా మార్చుకున్నాడు. అనుష్టించని ధర్మం ఉపయోగం లేదు. అందుకే రాముడి ముందు రావణుడు నిలబడలేకపోయాడు. గురు ముఖ: తా నేర్చుకున్న ధర్మాన్ని ఆచరించిన ధర్మమూర్తి రాముడు. ధర్మాన్ని తెలుసుకుని ఆచరిస్తే అది రక్షిస్తుందనేది వేదవాక్యం. వెంటనే ఇవ్వకపోయినా ఫలితం ఇచ్చి తీరుతుందనేది స్మృతి మాట.
రామాయణం మానవత్వాన్ని బోధిస్తుంది. భార్యాభర్తలు, సోదరులు, తండ్రీ కొడుకులు, యజమాని, ఉద్యోగి ఎలా బతకాలో రామాయణం నేర్పుతుంది. అం దుకే రామాయణాన్ని మనస్తత్వ శాస్త్రమంటారు. కాని రామాయణం సమస్త శాస్త్రా ల సమ్మిళితం. మనం చూసే కోణంలో ఆ శాస్త్రం కనిపిస్తుంది. వాల్మీకి మహర్షి రామాయణంలో ఏ పాత్రకు కితాబు ఇవ్వరు. అలాగని రావణుడు దుర్మార్గుడని చెప్పడు. రావణుడి లక్షణాలు, బలహనతలు మాత్రం చెబుతాడు. రామాయణం నరుడి చరిత్రగా వాల్మీకి రచించాడు. నరుడు ఎలా బతకాలో, ఎలా బతకరాదో సూ చించే లక్షణాలు అన్ని ఉన్నాయి. రామాయణంలో మానవ జీవనానికి ఉపయో గపడే అన్ని నియమాలు ఉండడం వల్ల యుగాలు మారినా ఇప్పటికీ ఆదర్శంగా నిలిచింది. నిలుస్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement