Sunday, April 28, 2024

దార్శనికుడు వాల్మీకి మహర్షి

సామాన్య ధర్మాలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ సమాజంలో మానవతా విలువలు పెంపొందటానికి దోహదం చేసిన మహోన్నతుడు శ్రీ వాల్మీకి మహర్షి. శ్రీరామాయణాన్ని లోకానికి పరిచయం చేసిన ఆది కవియే కా కుండా వేదాంతి, తపస్వి, దార్శనికుడు. సంస్కృత కవితారీతుల వైభవాన్ని లోకా నికి చాటాడు. సమస్త శాస్త్రముల అవగాహన కలిగినవాడు. వాల్మీకి మహర్షి ప్రచేతనుని కుమారుడు. క్షత్రియ వంశంలో జన్మించాడు. శ్లోకమనే ప్రక్రియ ఈయన ద్వారానే లోకానికి తెలిసింది. మహర్షి ద్వారా సంక్షిప్తంగా రామాయణ మును గ్రహంచి, తదుపరి బ్రహ్మ దేవుని వరప్రభావంతో భూత, భవిష్యత్‌, వర్తమానాలను కనులముందర సాక్షాత్కరింపచేసుకుని వాల్మీకి రామాయణా న్ని సుందరంగా 24000 శ్లోకాలతోమనకు అందించారు.
మొదట రత్నాకరుడు అనే నామం కలిగి తన కుటుంబ పోషణ కోసం దారి దోపిడీలు చేసేవారు. ఒకసారి అత్రిమహర్షిని అడ్డగించినపుడు వారిద్వారా జ్ఞానో పదేశం పొంది తీవ్రమైన తపస్సుచేసి వాల్మీకి మహర్షిగా మారుతారు. తదనం తర కాలంలో ”కుశస్థలి” అనే ప్రాంతంలో పరమశివుని గురించి ఘోర తపస్సు చేసి శివుని అనుగ్రహం పొందారు. వాల్మీకి శిష్యులతో ఆశ్రమ వాసం చేస్తుండగా నారద మహర్షి అక్కడికి వచ్చినప్పుడు వారిని వాల్మీకి ఈ విధంగా ప్రశ్నిస్తారు.
‘ఈ లోకంలో ఇప్పుడే, ఇక్కడే వున్న గుణవంతుడు, వీర్యవంతుడు, ధర్మా త్ముడు, కృతజ్ఞత భావం కలిగినవాడు, సత్యం పలికేవాడు, దృఢమైన సంకల్పం కలిగినవాడు, అన్ని ప్రాణుల మంచి కోరేవాడు, విద్యావంతుడు, సమర్ధుడు, ఎన్నిసార్లు చూసినా ఇంకా చూడాలనిపించేంత సౌందర్యము కలిగినవాడు, ధైర్యవంతుడు, క్రోధాన్ని జయించినవాడు, తేజస్సు కలిగినవాడు, ఎదుటి వారి లో మంచిని చూసేవాడు, అవసరమైనప్పుడు కోపాన్ని తెచ్చుకోగలగినవాడు మున్నగు గుణములు కలిగిన వ్యక్తి ఎవరైనా వున్నారా?”
దానికి సమాధానంగా నారదుడు చెబుతాడు. మీరు అడిగిన అన్ని లక్షణా లు ఒకే వ్యక్తిలో కలిగివుండటం కష్టం అయిన, ఒక వ్యక్తి మాత్రం ఈ విధమైన లక్షణాలతో అలరారుతున్నాడు అని శ్రీరాముని గూర్చి క్లుప్తంగా వివరిస్తా డు.
తరువాత వాల్మీకి స్నానం చేయటానికి తమసానది తీరానికి వెళ్ళినపుడు అక్కడ బోయవాడు ఒకడు చెట్టుపై సంభోగం చేసుకుంటున్న క్రౌంచపక్షులను గురిచూసి బాణం వేయగా అది వాటిలోని మగ పక్షికి తగులగా అది నేలకూలి మరణిస్తుంది. చనిపోయిన మగ పక్షిని చూసి ఆడ పక్షి విలపించటాన్ని చూసిన వాల్మీకి నోట అప్రయత్నంగా ఈ క్రింది శ్లోకం వెలువడుతుంది.
మా నిషాద ప్రతిష్ఠాం త్వ మగమ: శాశ్వతీ: సమా:!
యత్‌ క్రౌంచమిథునాదేకమ్‌ అవధీ: కామమోహతమ్‌!!
(బాలకాండ, సర్గ 2, శ్లో. 15)
”క్రౌంచపిట్టను చూసి శోకార్తుణ్ణి అయి నేను ఏవిధముగా మాటలు అన్నా ను?” అని తలపోస్తూ, తనద్వారా వెలువడిన శ్లోకాన్ని మననం చేసుకుంటూ అన్యమనస్కంగానే గడుపుతున్న సమయంలో బ్రహ్మదేవుడు వచ్చి, ఈ శ్లోకము తన ప్రోద్భలంతో సరస్వతీదేవి ద్వారా పలికింపబడినదని తెలిపి సంపూర్ణ రామా యణాన్ని రచించమని చెబుతాడు. అందుకు వలసిన భూత, భవిష్యత్‌, వర్తమా నాలు గోచరించే విధంగా దివ్య దృష్టిని ప్రసాదిస్తాడు. వాల్మీకి రామాయణాన్ని రచించే సమయానికి రావణ సంహారం కూడా పూర్తయిపోయింది. శ్రీరాముడు తిరిగి రాజ్యపాలన చేస్తున్నాడు. వాల్మీకి వాక్యవిశారదుడు. సమాక్షర పాదబద్ధ ము అయిన శ్లోకాలుగా రచించాడు. గంభీరార్థములతో, మనో#హర శబ్దములతో, సుసంగత వాక్యాలతో, ఉత్తమోత్తమ శ్లోకాలతో రామాయణ మహాకావ్యాన్ని మనకు అందించాడు. క్రౌంచపక్షి వధను చూసి వాల్మీకి నోటివెంట అప్రయత్న ముగా వెలు వడిన శ్లోకమునకు పండితులు అనేక అర్థాలు చెబుతారు. ఈ శ్లోకము రామాయణములోని ఏడు కాండలను సూచిస్తున్నదని చెబుతారు,
రామాయణ కథాగమనంలో ఉత్తరకాండ వరకు వాల్మీకి పాత్ర పెద్దగా కన బడదు. శ్రీరాముడు అరణ్యంలో ప్రవేశించి చిత్రకూటమందు ఆశ్రమము నిర్మిం చుకునేందుకు పయనిస్తాడు. ఆ సమయమున వాల్మీకి అక్కడే తన శిష్యులతో వుంటాడు. శ్రీరాముడు ఆయనను కలసి అభివాదం చేసి, తన అభీష్టాన్ని తెలియ చేసినపుడు వాల్మీకి తన సమ్మతిని, ఆశీర్వాదాన్ని తెలియచేస్తాడు. ఆయనకు మార్గనిర్దేశనం చేస్తాడు. తిరిగి వాల్మీకి పాత్ర గర్భవతిగా వున్న సీతాదేవిని అర ణ్యంలో శ్రీరాముడు విడచినపుడు మొదలవుతుంది. సకలము నెరిగిన ఆయన సీతాదేవికి తన ఆశ్రమంలో ఆశ్రయం కల్పిస్తాడు. అక్కడే లవకుశుల జననం జరు గుతుంది. తాను సంపూర్ణంగా గాన యుక్తంగా వ్రాసిన రామాయణాన్ని లవకుశు లకు నేర్పుతాడు. ఎందుకంటే రామ అవతార సమాప్తి కావలసివుంది. లవకుశు లను రాముని వద్దకు చేర్చి వారిని రాజ్యాభిషిక్తులుగా చేయాలి. శ్రీరాముడు అశ్వ మేథయాగము చేస్తున్న సందర్భములో లవకుశులను తీసుకుని అయోధ్యకు వెళతాడు. లవకుశులను రామకథాగానం చేయుటకు మేము వాల్మీకి మహర్షి శిష్యులమని మాత్రమే తెలుపుడు అని ఉపదేశిస్తాడు. ఇదే విషయాన్ని శ్రీరా ముడు లవకుశలను అడిగినపుడు అదే సమాధానం చెబుతారు. కాని శ్రీరాముడు వారి గుణగణాలు, రూపలావణ్యాలు, కంఠస్వరములను బట్టి వారు సీతాపుత్రు లుగా గుర్తిస్తాడు. ”సీతాదేవి పవిత్ర చరిత్రయైనచో, ఆమె యెడ ఎట్టి దోషములు లేనిచో ఆమె వాల్మీకి అనుమతిని పొంది, సభలో తన సచ్ఛీలత విషయమై ప్రమా ణ పూర్వకముగా నిరూపించుకోవలెను” అనే సందేశాన్ని శ్రీరాముడు వాల్మీకి మహర్షికి పంపుతాడు. వాల్మీకి అందులకు అంగీకరించి, సీతాదేవిని స్వయము గా తెచ్చి సభలో ప్రవేశపెడతాడు. నిండు సభలో వాల్మీకి ఈ విధంగా చెబుతాడు ……”శ్రీరామచంద్ర ప్రభూ! ఈ సీతాదేవి వ్రతనిష్టాగరిష్టురాలు, ధర్మనిరతు రాలు, లోకోపవాదానికి వెరచి నీవు ఈమెను నా అశ్రమ సమీపమున విడచి పెట్టి తివి. కవలలైన ఈ కుశలవులు సీతాదేవి కుమారులు. ఇది ముమ్మూటికీ నిజము. నేను వరుణదేవుని కుమారులలో పదియవవాడును. రఘునందనా! నా నోట అబద్ధము రాదు. నేను పెక్కు వేల సంవత్సరాలు తపస్సు చేసినవాడను. ఈ సీతా దేవియందు ఏమాత్రమైన దోషమున్నచో నా తప:ఫలము అంతయు నాకు చెంద కుండుగాక. నేను ఇంతవరకు మనసా, వాచా, కర్మణా ఎట్టి పాపము చేసియుం డలేదు. సీతాదేవి పరమ పవిత్రురాలు. ”
తదనంతరం సీతాదేవి తన పాతివ్రత్యమును నిరూపించుకొనుటకై భూదేవిని స్మరించి ధరణి గర్భములో కలసిపోతుంది. అప్పుడు శ్రీరాముడు వ్యధచెంది భూమండలము నాశనము చేయ సంకల్పింప, బ్రహ్మదేవుడు ప్రత్య క్షమై శ్రీరాముని ఓదారుస్తాడు. అంతేకాక నీవే శ్రీమన్నారాయణుడవు, సీతాదేవి శ్రీమహాలక్ష్మి అని తెలియచేస్తూ నా అనుగ్రహమువలన త్రికాలజ్ఞుడైన వాల్మీకి మహర్షి రామాయణ కావ్యాన్ని రచించెను అని చెబుతాడు. మొత్తం కావ్యం రచించటంలో వాల్మీకి మహర్షి అత్యంత శ్రద్ధ వహంచి ప్రతీ పదాన్ని జాగరూక తతో ప్రయోగించాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement