Wednesday, March 29, 2023

Breaking: తెలుగు రాష్ట్రాల్లో ఐటీ దాడులు..

తెలుగు రాష్ట్రాల్లో ఐటీ అధికారుల దాడులు కలకలం రేపుతున్నాయి. ఏపీ, తెలంగాణలో వంశీరామ్ బిల్డర్స్ టార్గెట్ గా ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ తో పాటు హైటెక్ సిటీలో అధికారులు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. వంశీరామ్ బిల్డర్స్ ఛైర్మన్ సుబ్బారెడ్డి కార్యాలయం, సుబ్బారెడ్డి బావమరిది జనార్థన్ రెడ్డి నివాసాల్లో ఐటీ సోదాలు నిర్వహిస్తోంది.

- Advertisement -
   

అటు ఏపీలోని విజయవాడలోనూ ఐటీ దాడులు నిర్వహిస్తోంది. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, వైసీపీ యువనేత దేవినేని అవినాశ్ ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ నుంచి వచ్చిన ప్రత్యేక బృందాలు తనిఖీలను నిర్వహిస్తున్నాయి. ఉదయం 6 గంటల నుంచి దాడులు కొనసాగుతున్నాయి. సాయంత్రం వరకు ఈ దాడులు కొనసాగే అవకాశమున్న‌ట్టు సమాచారం. ఈ ఐటీ దాడులతో చర్చనీయాంశంగా మారాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement