Friday, May 3, 2024

ధర్మం – మర్మం : ఋషిప్రబోధములు – దానము(2) (ఆడియోతో…)

స్కాంద పురాణంలోని వివరించిన దాన ఫలం గూర్చి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి వి శ్లేషణ…

దానం బంధుర్మనుష్యాణాం దానం కోశోహ్యనుత్తమమ్‌
దానం కామ ఫలావృక్షా: దానం చింతా మణిర్నృణాం
దానం పుత్ర కలత్రాద్యమ్‌ దానం మాతా పితా తధా

మానవులకు దానమే బంధువు, దానమే సాటి లేని నిధి, కోరికల ఫలములనిచ్చు వృక్షము అనగా దానము చేసినపుడు మనము కోరిన కోరికలు నెరవేరును అనుకున్నవి అన్నీ సిద్ధుంచును. నరులకు దానమే చింతామణి. దానమే భార్య, పుత్రుడు, తల్లి, తండ్రి, మిత్రుడు. పుత్రుడు ధర్మబద్ధంగా వృద్ధాప్యమున కావాల్సిన సేవలు చేయునట్లు దానము కూడా మనకు శక్తి లేనప్పుడు శక్తి గలవారిని సేవకులుగా ప్రసాదించును. అనగా దానమును తీసుకున్నవారు కృతజ్ఞతతో అవసరమున్నప్పుడు తనకు తానుగా వచ్చి సేవ చేయనని భావము. దానము భార్య వలే ప్రియమును, హితమును కలిగిం చి తల్లి వలే లాలించి తండ్రి వలే పోషించును.

శ్రీమాన్‌ డాక్టర్‌ కండాడై రామానుజాచార్యులు…
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement