Thursday, May 2, 2024

ధర్మం మర్మం (ఆడియోతో..)

3. నారద మహర్షి
నారద మహర్షి మొదటి జన్మలో దాసీపుత్రునిగా పుట్టి మహర్షుల సాంగత్యంతో మంత్ర, మంత్రార్థములను పొంది ఆమంత్రమునే ధ్యానిస్తూ పెద్దల దర్శన, స్పర్శన, సంభాషణ కటాక్షముల ప్రభావముతో పరమాత్మను మానసికంగా సాక్షాత్కరింపచేసుకొనెను. అతని ఆజ్ఞ మేరకు అదే రూపాన్ని నిరంతరం ధ్యానిస్తూ తనువు చాలించి
బ్రాహ్మణునిగా పుట్టాడు. పరమాత్మ ధ్యానంతోనే ఆజ న్మను చాలించి గంధర్వునిగా పుట్టి చేసిన పుణ ్య ఫలితాన్ని భోగరూపంలో వ్యయం చేసి పరమాత్మ మంత్రానుష్టానంతో, రూప ధ్యానంతో బ్రహ్మమానస పుత్రుడై పరమాత్మ అంశగా నారద మహర్షిగా జన్మించాడు. పాంచరాత్ర ఆగమాన్ని ఋషులకు ఉద్బోధించిన ఆయన కుబ్జ పుత్రుడైన కల్పకునికి కూడా పాంచరాత్ర ఆగమాన్ని చెప్పి ”కల్పకసంహితం” అందించాడు. వాల్మీకికి రామకథను చెప్పి అన్ని లోకాలకు రామాయణాన్ని అందించాడు. వ్యాస భగవానునికి భాగవత, గుణతర్పణాన్ని అందించి భాగవతాన్ని లోకానికి అందించాడు. భారతంలో తత్త్వాన్ని, ధర్మాన్ని, మర్మాన్ని వ్యాసుని ద్వారా లోకానికి అందించిన వాడు నారదమహర్షి. సనకాదులతోభాగవత సప్తాహాన్ని విని సప్తాహ ప్రచారాన్ని చేసినవాడు, ప్రహ్లాదునికి, ధ్రువునికి మంత్రోపదేశము చేసి, తన బోధలతో హిరణ్యకశిప – హిరణ్యాక్ష, రావణ – కుంభకర్ణ, శిశుపాల – దంతవక్రుల దుష్టత్వాన్ని పెంచి వారి పాపాలను పండించి వారిని పరమాత్మచేత సంహరింపచేసినవాడు నారదుడు. భారతీయ వాఙ్మయంలో నారద పాత్రతో ప్రమేయం లేని ఏ గాధ లేదు అనేది అతిశయోక్తి కాదు. మంచికి, చెడుకి కలహం పెట్టి కలహభోజనుడు అనిపించుకున్నా మంచిని గెలిపించి లోకకళ్యాణాన్ని ఆచరించిన అవతారం నారద అవతారం.
శ్రీమాన్‌ డాక్టర్‌ కండాడై రామానుజాచార్యులు…
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement