Sunday, May 5, 2024

ధర్మం – మర్మం :

గంగా జలం మర్త్యలోకం చేరు విధానంలో భాగంగా గౌతముని ఆశ్రమంలో వినాయకుని ఉపాయాన్ని అమలు చేసిన విధానం గూర్చి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ…

విఘ్నేశ్వరుడు ఆజ్ఞానుసారం జయ గోరూపమున గౌతముని ఆశ్రమంలోని పైరును తిని ధ్వంసం చేయుచుండగా అది చూసిన గౌతమ మహర్షి గడ్డిపరకతో వారించగా
గోవు ఆర్తనాదము చేసి పడిపోయెను. అది చూసిన మునులు, ఋషులు హాహాకారాలు చేస్తూ కలత చెంది బ్రాహ్మణుని వేషంలో ఉన్న వినాయకునితో ఈ ఆశ్రమము నుండి తామువెళ్ళిపోయెదమని పలికిరి. ఇంతకాలం తమని పుత్రులు వలె పోషించినావని తాము ఇంక నిష్క్రమించెదమని ఋషులు గౌతమునితో పలుకగా వజ్రాయుధముతో దెబ్బతగిలినట్టు బాధపడిన గౌతముడు నేలమీద పడిపోయెను. రుద్రులకు మాత, సకలపావని, జగత్‌పావని, తీర్థస్వరూపిణి, దేవస్వరూపిణి అయిన గోవు నేలవాలినది కావున తాము ఇచట ఉండజాలమని ఇంకా ఈ ఆశ్రమమునే ఉంటే ఇంతకాలం ఆచరించిన వ్రతములన్నీ వ్యర్థములవుతాయని ఋషులు గౌతమునితో పలికిరి.

-శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు..
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement