Friday, April 26, 2024

ధ‌ర్మం మ‌ర్మం (ఆడియోతో..)

గంగాజలము మర్త్యలోకమునకు చేరు విధానం వామన ఆవిర్భావం గూర్చి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామనుజాచార్యుల వారి వివరణ..

దేవతలకు ఇచ్చిన మాట ప్రకారం శ్రీమహా విష్ణువు వామన రూపంలో అదితి గర్భంలో జన్మించెను. వామనుడే యజ్ఞేశుడు, యజ్ఞపురుషుడిగా అవతరించెను. అదే సమయమున బలిచక్రవర్తి అశ్వమేధ యాగము ఋషిముఖ్యులతో సామగానంగా చేయ సంకల్పించెను. వేదవేదాంగాలు తెలిసిన శుక్రాచార్యుల పౌరహిత్యంలో ఋషిముఖ్యులు ఋత్వికులుగా యజ్ఞ ం ప్రారంభించబడినది. అక్కడకి విచ్చేసిన వారికి కావాల్సిన సకల ఏర్పాట్లు అంగరంగ వైభవంగా చేయబడినవి. ఆ యజ్ఞ ప్రాంతమున పూజించండి, తృప్తి కలిగే వరకు భుజించండి, లేదన్నది లేకుండా వచ్చిన వారికి ధనకనకవస్తువాహన సంపదలను కురిపించాలంటూ యజ్ఞప్రాంగణం మారుమ్రోగింది.

శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు…
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement