Wednesday, May 1, 2024

తిరుమ‌ల‌లో భ‌క్తుల ర‌ద్దీ… శ్రీవారి హుండీకి రూ.5.05 కోట్లు ఆదాయం

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఆలయ పరిసరాల్లో ఉన్న 31 కంపార్టుమెంట్లు భక్తులతో నిండాయి. వీరికి దర్శనం 10 గంటల సమయం పడుతుందని టీటీడీ వర్గాలు వెల్లడించాయి . నిన్న 74,212 మంది భక్తులు స్వామివారి దర్శించుకోగా, హుండీ ఆదాయం రూ.5.05 కోట్లు వచ్చిందని తెలిపారు. తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో మూడు రోజుల పాటు జరిగిన పవిత్రోత్సవాలు మహాపూర్ణాహుతి తో వైభవంగా ముగిశాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement