Wednesday, May 15, 2024

తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం

కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునేందుకు తిరుమలకు భక్తులు పోటెత్తారు. శనివారం స్వామి వారికి ఇష్టమైన రోజు కావడంతో భక్తులకు అధిక సంఖ్యలో తిరుమలకు వస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మొత్తం 31 కంపార్టుమెంట్లలో శ్రీవారి సర్వదర్శనానికి భక్తులు వేచి ఉన్నారు. వీరికి 12 గంటల్లో దర్శనం కలుగుతుందని టీ-టీ-డీ అధికారులు తెలిపారు. నిన్న స్వామివారిని 78,299 మంది భక్తులు దర్శించుకోగా 34,625 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా రూ. 3.93 కోట్లు- వచ్చిందని తెలిపారు. రేపు (సోమవారం) శ్రీవారి ఆలయంలో బంగారం వాకిలి ముందు గల ఘంటా మండలిలో దీపావళి ఆస్థానం నిర్వహిస్తున్నట్లు- వెల్లడించారు. ఈ సందర్భంగా ఆర్జిత సేవలు రద్దు చేశామని పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement