Sunday, April 28, 2024

బ్రహ్మాకుమారీస్‌ — ప్రేమ (ఆడియోతో…)

బ్రహ్మాకుమారీస్‌ — ప్రేమ (ఆడియోతో…)

ప్రేమ నిజంగా అన్నింటికంటే గొప్పశక్తి. ప్రేమ మనలను చాలా గొప్ప మహనీయులుగా తయారు చేయగలుగుతుంది. అది మనసును తేలికగా ప్రపుల్లితంగా చేస్తుంది. కానీ ఈ శక్తిని అన్నింటి కంటే అధికంగా దురుపయోగం చేస్తున్నారు. ( అనేక నిమ్నజాతి స్థితులను కూడా ప్రేమ పేరుతో స్వీకరిస్తున్నారు. ) వాస్తవానికి ఈనాటి ప్రపంచానికి ప్రేమ యొక్క నిజమైన, యధార్థమైన అర్థాన్ని గ్రహించవలసిన అవసరం చాలా వున్నది. సత్యమైన ప్రేమ కేవలం ఒట్టి భావాలపైన కాదు, ఒక వివేకవంతమైన పరస్పర విశ్వాసం పై, గౌరవంపై ఆధారమైనట్టిది.

ప్రేమ యొక్క అర్థం సంతులనత్వం అనగా స్వయం పై మరియు పరమాత్మ పట్ల, తనతోటి వారితో పరస్పరం సామరస్యం కలిగియుండుట. ప్రేమ నిస్వార్థమైనది. ప్రేమ
కేవలం కల్పన, భావనాస్థితి కాదు. ఇది శారీరికాకర్షణకు అతీతమైన చైతన్యమైన ఉత్కృష్టస్థితి . ప్రేమ శరీరానికి సంబంధించినది కాదు. ప్రేమకు ఆత్మతో సంబంధమున్నది. మనం ఈ ప్రేమను నలుమూలలా ప్రవహింపజేయాలి. ఈ ప్రేమ ప్రవాహం చేత మనం వినయం కలిగి సదా తాజాగా, ఆకర్షణీయంగా, ఆరోగ్యంగా వుంటాము . ప్రేమ లేని జీవితం యొక్క మొత్తం ఖజానా మన దృష్టిని అనుభవాలకు దూరంగా మసకబారేట్లు చేస్తుంది. దానిని పొందుటకు ప్రేమయే ఒక తాళం చెవి.

-బ్ర హ్మాకుమారీస్‌..
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement