Thursday, May 16, 2024

బ్రహ్మాకుమారీస్‌ అమృతగుళికలు (ఆడియోతో)…

మీరు ఇతరులతో మిమ్ములను పోల్చి చూసుకుంటే..
ఇతరులకు కన్నా మిమ్ములను మీరు తక్కువగా భావిస్తారు, ఇతరుల క న్నా మిమ్ములను మీరు ఉన్నతంగా భావిస్తారు, ఇతరుల ఆకర్షణకు లొంగిపోతారు. ఇలా మీరు ప్రకారాలైన అవాస్తవికతకు లోనవుతారు. మన స్వమానమనే ముఖ్యమైన మూల సూత్రాన్ని మరచి అవాస్తవిక సంబంధాలలో ఉండడం ప్రమాదకరమైనది, హానికారకమైనది కూడా. పరస్పరంలో ప్రేమ కలిగి ఉండడం, గౌరవం ఇవ్వడంలోనే సర్వోత్తతమైన సంబంధాలు ఆధారపడి ఉన్నాయని, స్వమానం అనే అనుభవం ఆధారంగా మనం గ్రహించినప్పుడు, ఇతరులతో మనలను మనం పోల్చి చూసుకోము. ఈ రోజు స్వచ్ఛమైన స్వమానం అనే అనుభవంలోకి మన దృష్టిని మళ్ళించడం ద్వారా ఈ విధమైన దుర్బలత్వం నుంచి మలను మనం రక్షించుకుందాము.

– బ్రహ్మాకుమారీస్‌
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement