Tuesday, May 14, 2024

భక్తికి…వెూక్షానికి దారి… వైరాగ్యం!

మనిషికి అనుకున్నది సాధిస్తే తన ప్రతిభేననే భ్రమలో ఉండి, సంతోషంగా, ఆనం దంగా ఉంటాడు. అదే ప్రతికూల పరిస్థితుల్లో నింద దైవం మీద వేసేసి, ”నీకు అర్చనలు, కళ్యాణాలు చేయించి భక్తితో కొలుస్తున్నా దయ చూపలేకపోయావా? స్వామి?” అంటూ విచారంతో ఉంటాం. ఇక్కడ భక్తి వైరాగ్యం అని రెండు అంశాలు మనకు గోచరిస్తున్నాయి. అయితే భక్తికి వైరాగ్యంనకు సంబంధం ఏమి టి? అనే ప్రశ్న రావచ్చు. నాణానికి బొమ్మ- బొరుసు ఉన్నట్లే, మన జీవితం అనే నాణానికి భక్తి- వైరా గ్యం చోటు చేసుకున్నాయి. ముందుగా భక్తి అంటే ఏమిటి? తెలుసుకుందాం.
భక్తి అంటే ఏమిటి?

హందీలో ఒక సామెత ఉంది. ”దు:ఖ్‌ సే సబ్‌ హరిభజే, సు:ఖ్‌ సే భజే కోల్‌

సు:ఖ్‌ సే అగర్‌ హరి భజే -దు:ఖ్‌ సే హూయే” అని, అంటే ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు భగవంతుని గుర్తు పెట్టుకొంటారు. ఇదే ఆనందంలో భగవంతుని మర చిపోతారు అని. కావున మనం ఎల్లప్పుడూ భగవంతుని గుర్తుపెట్టుకొంటే ఆపదలనే వే ఉండవు కదా! భక్తికి కొన్ని లక్షణాలు అవసరం. ముఖ్యంగా భగవంతునిపై పరి పూర్ణమైన నమ్మకం, విశ్వాసం కలిగి ఉండాలి. మన దైనందిన జీవితంలో క్రమం తప్పకుండా ఆర్తితో దైవాన్ని ఆరాధించాలి. ప్రేమించాలి. యజమాని తిండి పెట్టినా, పెట్టకపోయి నా, కొట్టినా, లాలించినా కుక్క యజమానిని ఎలా వదలివెళ్ళదో, ఎంత విశ్వాసంతో ఉం టుందో, అదేవిధంగా భక్తుడు తనకు ఎదురైన సుఖదు:ఖాలు పరమాత్మ ప్రేరణ అనే భావనలో ఉండాలి. భగవంతుని అనుగ్రహం కోసం వ్యాకు లత పడాలి. బాగా విల పించాలి. విలపించగా, విలపించగా మనలోని మాలిన్యాలు మాయమైపోతాయి. రామకృష్ణ పరమహంస, రామదాసు, తుకారాం, గోదాదేవి, ఇలా ఎందరో మనకు గోచరిస్తారు. భాగవతంలో —
”చిక్కడు వ్రతములు క్రతువుల/ చిక్కడు దానముల శౌచశీల తపములన్‌
చిక్కడు యుక్తిని, భక్తిని/ చిక్కిన క్రియ నచ్యుతుండు సిద్ధము నుండీ!”
అని కేవలం వ్రతాలు, క్రతువులు, దానాలు, చేసినంత మాత్రాన చిక్కడు. భక్తితో మాత్రమే అచ్యుతుడు దొరుకుతాడు. గోపికలకు శ్రీ కృష్ణుడుపై అమూల్యమైన ప్రేమ, భక్తి ఉండబట్టే చిక్కాడు. అందుకే పెద్దలు చెబుతారు ఏమనంటే ”సంసారం పెట్టు కోండి. కాని అదే సుఖమయం అనుకోవద్దు. భగవంతుని పట్టుకోండి- ఇహపర సౌ ఖ్యాలు పొందండి” అని. భగవద్గీత సప్తమ అధ్యాయంలో పరమాత్మ దు:ఖ పీడితు లై విపత్తులలో నన్ను సేవించేవారిని ‘ఆర్త భక్తుడు’ అంటారు. నన్ను, నా తత్త్వాన్ని తెలుసుకొనే భక్తులు జిజ్ఞాసువులు. ధనం, లేదా సంతానం, లేదా మరేదైనా కోరికలతో ఆరాధించేవారు ‘కామ్యక’ భక్తులు. ఇక ఆఖరుగా విలక్షణంగా అవసరమైతే కాళ్ళు, లేకపోతే జుట్టు అన్నట్లు వ్యవహరిస్తారు. అని మానవులలోని భక్తి తత్త్వం గురించి తెలియచేసాడు. ఒకసారి ప్రముఖ తత్త్వవేత్త సోక్రటీస్‌ వద్దకు ఒక భక్తుడు వెళ్ళి, అ య్యా! నేను దేవుడు ఎక్కడ ఉన్నాడో తెలుసుకోవడానికి విశ్వమంతా దుర్భిణీతో పరీ క్షించినా ఎక్కడా ఆయన కనపడలేదు. అసలు దేవుడు ఉన్నాడా? అని అడిగాడు. అపు డు సోక్రటీస్‌ జవాబు ఇస్తూ ”నువ్వు ‘భక్తి- వైరాగ్యం’ అనే యంత్రాన్ని నీ ఆత్మలో ప్రతిష్టించి వెదికి తే తప్పకుండా కనపడతాడు!” అని చెప్పారు.

వైరాగ్యం అంటే ఏమిటి?—

వైరాగ్యం అంటే నిర్వేదం. విముఖత. విరక్తి. నిరాశ కలిగినప్పుడు వైరాగ్యం వస్తుంది. ఈ వైరాగ్యం మూడు రకాలుగా ఉంటుంది. తాత్కాలిక వైరాగ్యం. అంటే అనుకొన్న కార్యం ఎన్నిసార్లు ప్రయత్నించినా, సఫలం కాకపోతే వైరాగ్యం వస్తుంది. మహళలకు ప్రసవ సమయంలో వైరాగ్యం వస్తుంది. పోటీలో విజయం సాధించన ప్పుడు, పదేపదే విద్యార్థి పరీక్షలో అపజయం పాలవుతున్న సందర్భంలో వైరాగ్యం వస్తుంది. ఇది తాత్కాలికమే. కొద్దిసేపు ఉండి, ఎవరినుంచైనా ఓదార్పు మాటలు విం టే పోతుంది. ఇక రెండవ రకం మధ్యమ వైరాగ్యం. బంధువులతో, ఆత్మీయులతో, స్థిరాస్తి తగవులు, వ్యాపార భాగస్వాములు మధ్య వచ్చే సన్నివేశాలు వల్ల వైరాగ్యం కలుగుతుంది. ఇది ఎక్కువ కాలం సం.రాల తరబడి ఉంటుంది. తరువాత కొన్ని పరి స్థితుల్లో సర్దుబాటు అయిపోతుంది. ఇక మూడవ రకం తీవ్రమైన వైరాగ్యం. ఇది శాశ్వతంగా జీవి ఉన్నంతకాలం ఉంటుంది. ఈ వైరాగ్యం వల్లనే ఆత్మ సాక్షాత్కారం లభిస్తుంది. అవసరమైన, అనవసరమైన, వాటి మధ్య తేడా గుర్తించి, జ్ఞానం ద్వారా ప్రవర్తించడం ద్వారా వైరాగ్యంను దూరం చేసుకోవచ్చు. దీనికి మంచి చెడుల అన్వే షణ అవసరం. దక్షిణామూర్తి ఉపనిషత్తులో —
”వైరాగ్య తైల సంపూర్ణే భక్తీ వర్తి సమన్వితే
ప్రబోధపూర్ణ పాత్రేయ జ్ఞాన దీపం విలోనయేత్‌”!
అంటే అంధకారాన్ని పోగొట్టుటకు దీపం వెలిగించడానికి ప్రమిద, తైలం, ఒత్తి ఎలా అవసరమో, అలాగే మనలోని అజ్ఞానాంధకారాన్ని పోగొట్టుకోవడానికి వైరా గ్యం అనే తైలం భక్తి అనే ఒత్తి, గురువు అనే ఆధారం (ప్రమిద) ఉన్నప్పుడే మనలో జ్ఞానజ్యోతి ప్రకాశిస్తుంది. ఒక సందర్భంలో అవతార పురుషుడు శ్రీరాముడుకు ”ఈ సంసారం, రాజ్యపాలన, ఐహక సుఖాల పట్ల వైరాగ్యం కలిగి తన గురువు గారైన విశ్వామిత్రుల వారిని ఇలా ప్రశ్నించాడు.” ఈ సంసార వ్యవహారాలలో సుఖం అం టూ ఏదైనా ఉందా? మానవులు అంతా సంపద, ధనం, చూసుకొనే సుఖం అనుకొం టున్నారు. ప్రతీ ప్రాణి మరణించడానికే జన్మిస్తుందన్నట్లుగా ఉంది. ఈ సంసారంలో మనకు కనిపిస్తున్న బంధాలు, స్నేహాలు, అనుబంధాలు, వాటిని పరిశీలించినప్పుడు నాకు ఒకటి అనిపిస్తోంది ”నేను ఎవరిని? ఈ రాజ్యంతో, బంధాలతో నాకు పనేముం ది? ఈ భోగాలలో నేనెందుకు చిక్కుకోవాలి?” అని వైరాగ్యంతో ప్రశ్నల వర్షం కురి పించారు. అంతటి ధర్మాత్ముడుకే సందేహం కలిగితే, మానవమాత్రులం మనమెం త? (యోగావాశిష్ఠంలోని అంశం)
కురుక్షేత్ర సంగ్రామం ముగిసిన తర్వాత, బంధువులను, ఆత్మీయులను, మిత్రు లను కోల్పోయిన తరువాత ధర్మరాజు అయిన వారందరిని దూరం చేసుకొని, ఎందు కు ఈ రాజ్య సంపద? అంటూ వైరాగ్యంలో పడిపోయాడు. అదే కురుక్షేత్ర సంగ్రా మంలో తన నూరుగురు కుమారులు మరణించినందువల్ల గాంధారి ఆ బిడ్డల శవా లను చూస్తూ వైరాగ్యంలోకి వెళ్ళిపోయింది. అందుకనే శ్రీకృష్ణ పరమాత్మకు యాద వుల వంశం సర్వనాశనం అవుతుందని శాపం ఇచ్చింది. లంకలో సీతాదేవి శోకిస్తూ, హనుమతో ”నాకు ఇక రెండు నెలలు కాలమే మిగిలి ఉంది. ఈలోగా రావణ సంహా రం జరిగి, శ్రీ రాముడు నన్ను తీసుకెళ్ళకపోతే ఇంకా ఈ సీత దక్కదనుము.” అని వైరాగ్యంతోనే పలికింది. సంపద, ధనంతో సుఖాలు, భోగాలు అనుభవిస్తున్నప్పుడు మనం అనేక రుగ్మతలకు గురవుతాము. అన్నీ ఉండి అనుభవించలేని వారు, పట్టెడు అన్నం కడుపునిండా తినలేని వారెందరో ఉన్నారు. అటువంటి వారిలో వైరాగ్యం ఏర్పడి దృష్టి భక్తి మార్గంలోకి వెళ్ళాలి. వైరాగ్యం మహాఫలితం ఆత్మజ్ఞానం పొందట మే. వైరాగ్యం భక్తి తత్త్వానికి, తద్వారా మోక్షానికి దారి తెలుస్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement