Sunday, May 5, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 1, శ్లోకం 39
39
కులక్షయే ప్రణశ్యంతి
కులధర్మా: సనాతనా: |
ధర్మే నష్టే కులం కృత్స్నమ్‌
అధర్మో భిభవత్యుత ||

తాత్పర్యము : కులక్షయము వలన శాశ్వతమైన వంశాచారము నశించిపోవును. ఆ విధంగా వంశమున మిగిలినవారు అధర్మవర్తనులగుదురు.

భాష్యము : వర్ణాశ్రమ వ్యవస్థలో కుటుంబ సభ్యులకు అనేక ధర్మాలు ఇవ్వబడినవి. వాటిని చక్కగా పాటించినచో వారు క్రమేపి ఆధ్యాత్మిక చైతన్యమును పెంపొందించుకొనవచ్చును. పుట్టుక నుండి మరణము వరకు పెక్కు సంస్కారాలు చేయవలసి ఉంటుంది. వాటిని జరిపించుట పెద్దల బాధ్యత. అయితే అటువంటి పెద్దలు కురుక్షేత్ర యుద్ధంలో సంహరింపబడినట్లయితే పిల్లలు ఆ సంస్కారాలను నిర్లక్ష్యం చేసే అవకాశం ఉన్నది. తద్వారా అవలక్షణాలను పెంపొందించుకుని, మానవ జీవితాన్ని దుర్వినియోగము చేసుకుని మోక్ష పథాన్ని కోల్పోగలరు. కాబట్టి, పెద్దలను ఎట్టి పరిస్థితులలో సంహరింపరాదు.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement