Wednesday, May 1, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 2, శ్లోకం 53
53
శ్రుతివిప్రతిపన్నా తే
యదా స్థాస్యతి నిశ్చలా |
సమాధావచలా బుద్ధి:
తదా యోగమవాప్స్యసి ||

తాత్పర్యము : ఎప్పుడు నీ మనస్సు వేదముల మధురవాక్కులచే కలతనొందక ఆత్మానుభూతి యనెడి సమాధియందు స్థితమగునో అప్పుడు నీవు దివ్య చైతన్యమును పొందిన వాడవగుదువు.

భాష్యము : సమాధి అనగా కృష్ణచైతన్యములో పూర్తిగా మగ్నుడగుట. సమాధిలో ఉండుట అనగా బ్రహ్మము, పరమాత్మ మరియు భగవంతుణ్ని అర్ధము చేసుకొన్న వారని అర్ధము. అనగా అత్యున్నక సాక్షాత్కారమేమనగా జీవుడు భగవంతుని సేవకుడని, భగవంతుని సేవే జీవిత పరమార్ధమని, భగవంతుడు ఇచ్చిన బాధ్యతలను నెరవేర్చుటే తన ఏకైక కర్తవ్యమని అర్ధము చేసుకొనుట. కాబట్టి అటువంటి భక్తుడు వేదాలలోని వ్రత ఫలాలకుస యజ్ఞాలు చేసి స్వర్గానికి వెళ్ళుటకు ఆసక్తి చూపించరాదు. కృష్ణ చైతన్యములో కృష్ణుని నుండి ప్రత్యేక సూచనలను గ్రహించిన పాటించినట్లయితే సంపూర్ణ జ్ఞానమును పొందుట తథ్యము. జీవుడు చేయవలసినదల్లా భగవంతుని లేదా ఆయన ప్రతినిధియైన గురువు యొక్క ఆజ్ఞలను శిరసావహించుటయే.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …

Advertisement

తాజా వార్తలు

Advertisement