Thursday, May 9, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 2, శ్లోకం 24
24
అచ్ఛేద్యో యమదాహ్యో యమ్‌
అక్లేద్యో శోష్య ఏవ చ |
నిత్య: సర్వగత: స్థాణు:
అచలో యం సనాతన: ||

తాత్పర్యము : ఆత్మ ఛేదింపబడనటువంటిది మరియు కరుగనటువంటిది. దహింపజేయుటకు గాని, ఎండింపజేయుటకు గాని అది వీలుకానటువంటిది. అది నిత్యమును, సర్వత్రా వ్యాపితమును, మార్పురహితమును, అచలమును, సనాతనమును అయియున్నది.

భాష్యము : ఇక్కడ వివరిస్తున్న వేర్వేరు లక్షణాలను బట్టి ఆత్మ శాశ్వతముగా పూర్ణములో అముమాత్రపు కణమేనని, అలాగే కొనసాగునని నిరూపింపబడుచున్నది. అద్వైత వాదుల సిద్ధాంతము ప్రకారము ఆత్మపూర్ణములో లీనమగుట లేదా కలసిపోవుట అనేది ఇక్కడ వర్తించుట లేదు. ఆత్మభౌతిక కల్మషము తొలగిన తర్వాత బ్రహ్మజ్యోతిలో ఉండుటకు ఇష్టపడవచ్చునేమో గాని, తెలివిగల ఆత్మలు వైకుంఠ లోకాలలో భగవంతుని సాన్నిధ్యాన్ని కోరుకొనును.

ఇక్కడ ‘సర్వ గత:’ అను పదము విశేషమైనది. అనగా అన్ని చోట్లా ఆత్మ ఉండును. దీనిని బట్టి జీవుడు భగవంతుని సృష్టి అంతటా ఉండగలడని అనగా నేలమీద, నీటిలోను, అగ్నిలోనూ, సూర్యలోకమున సైతమూ తగిన శరీరములను కలిగి ఉండి జీవించగలడని అర్థమగుచున్నది.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement