Friday, April 26, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 2, శ్లోకం 68
68
తస్మాద్యస్య మహాబాహో !
నిగృహీతాని సర్వశ: |
ఇంద్రియాణీంద్రియార్థేభ్య:
తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా ||

తాత్పర్యము : అందుచే ఓ మహాబాహో ! ఎవ్వని ఇంద్రియములు వాని ఇంద్రియార్థముల నుండి నిగ్రహింపబడి యుండునో అతడు నిశ్చయముగా స్థితప్రజ్ఞుడనబడును.

భాష్యము : ఇంద్రియ భోగవాంచల వేగాన్ని కృష్ణ చైతన్యము ద్వారానే అరికట్టగలము. అనగా ఇంద్రియములను కృష్ణుని సేవలో వినియోగించుట వలన మాత్రమే ఇది సాధ్యము కాగలదు. శత్రునును జయించుటకు అతనికి మించిన శక్తి కావలెను. అలాగే ఇంద్రియములను అదుపులోకినికి తెచ్చుట మానవ సాధ్యము కాదు. దానికి భగవంతుని సేవ ఒక్కటే మార్గము. ఎవరైతే గురువు మార్గదర్శకత్వములో కృష్ణ చైతన్యములో ఇంద్రియములను నియోగించు కళను నేర్చుకున్నప్పుడే స్థిరమైన బుద్ధిని కలిగి ఉండగలను అని తెలుసుకుంటాడో, అతడే సాధకుడు. ముక్తిని పొందుటకు తగిన వ్యక్తి.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement