Saturday, April 27, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 2, శ్లోకం 66
66
నాస్తి బుద్ధిరయుక్తస్య
న చాయుక్తస్య భావనా |
న చాభావయత: శాంతి:
అశాంతస్య కుత: సుఖమ్‌ ||

తాత్పర్యము : (కృష్ణభక్తిభావన యందు) భగవానునితో సంబంధమును పొందనివాడు విశుద్ధబుద్ధిని గాని, స్థిరమైన మనస్సును గాని కలిగియుండజాలడు. అవి లేనిదే శాంతిని పొందుటకు ఆస్కారము లేదు. ఇక శాంతి లేనిదే సుఖమెట్లు కలుగును?

భాష్యము : కృష్ణచైతన్య వంతులు కానిదే శాంతి అనేది ఉండదు. భగవద్గీత అయిదవ అధ్యాయము 29వ శ్లోకమున తెలిపిన విధముగా భగవంతుడే సమస్త యజ్ఞాలకు, తపస్సులకు భోక్త అని, ఈ ప్రపంచమున ఉన్న ప్రతి దానికి యజమానియని, అన్ని జీవరాశుల శ్రేయోభిలాషి అని తెలుసుకున్నవాడు మాత్రమే శాంతిని పొందగలడు. కాబట్టి కృష్ణచైతన్యము లేని వ్యక్తికి ఒక లక్ష్యముపై మనస్సును నిలుపలేడు. లక్ష్యము లేనప్పుడు మనస్సు పరిపరి విధాలా ఆలోచించి శాంతి లేకుండా చేస్తుంది. అదే కృష్ణుడు, ప్రభువు, యజమాని, అందరి స్నేహితుడు అని తెలుసుకున్న వ్యక్తి స్థిర మనస్సుతో కృష్ణుడితో సంబంధముగా అన్ని కార్యాలను చేస్తూ ఉంటాడు. ఇదే శాంతికి సూత్రము. కృష్ణుడితో సంబంధము లేకుండా ప్రశాంతత, ఆధ్యాత్మిక పురోగతి సాధ్యము కాదు.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …

Advertisement

తాజా వార్తలు

Advertisement