Monday, April 29, 2024

గీతాసారం (ఆడియోతో…)

అధ్యాయం 6, శ్లోకం 20,21,22,23

20.
యత్రోపరమతే చిత్తం
నిరుద్ధం యోగసేవయా |
యత్ర చైవాత్మనాత్మానం
పశ్యన్నాత్మని తుష్యతి ||

21.
సుఖమాత్యంతికం యత్తత్‌
బుద్ధిగ్రాహ్యమతీంద్రియమ్‌ |
వేత్తి యత్ర న చైవాయం
స్థితశ్చలతి తత్త్వత: ||

22.
యం లబ్ధ్వా చాపరం లాభం
మన్యతే నాధికం తత: |
యస్మిన్‌ స్థితో న దు:ఖేన
గురుణాపి విచాల్యతే ||

23.
తం విద్యాద్దు:ఖసంయోగ –
వియోగం యోగసంజ్ఞితమ్‌ |
స నిశ్చయేన యోక్తవ్యో
యోగో నిర్వణ్ణచేతసా ||

- Advertisement -

20-23 తాత్పర్యము : సమాధి యనుబడు పూర్ణస్థితిలో మనుజుని మనస్సు సమస్త మానసిక కలాపముల నుండి యోగాభ్యాసము చేత నిరోధింపబడి యుండునున. శుద్ధమైన మనస్సుతో ఆత్మను చూడగలుగుట మరియు ఆత్మ యందే ఆనందమును, సుఖమును అననుభవింపగలుగుట యను విషయమున మనుజుని సమర్ధతను బట్టి అట్టి పూర్ణత్వస్థితిని నిర్ధారింపవచ్చును. అట్టి ఆనందమయ స్థితిలో పవిత్రమైన ఇంద్రియముల ద్వారా అనుభవమునకు వచ్చు అపరిమిత దివ్యానందములో మనుజుడు స్థితిని పొందియుండును. ఆ విధముగా స్థితుడైన అతడు సత్యము నుండి వైదొలగక, దానికి మించిన వేరొక అధిక లాభము లేదని భావించును. అట్టి స్థితిలో నిలిచినవాడు గొప్ప కృష్ణమునందైనను చలింపక యుండును. భౌతిక సంపర్కముచే ఉత్పన్నమగు సమస్‌ దు:ఖముల నుండి వాస్తవమైన ముక్తి ఇదియే.

భాష్యము : పతంజలి యోగ సిద్ధాంతము ప్రకారము కూడా సమాధి అనగా జీవి పరమాత్మతో గల సేవా సంబంధాన్ని తెలిసికొని దివ్యానందాన్ని పొందుటయే. ఇదే జీవి యొక్క సహజ జీవనము, యోగాభ్యాసము యొక్క లక్ష్యము. ఇది భక్తియోగ ద్వారా సులభ సాధ్యము. యోగసిద్ధులకు ఆకర్షింపబడే యోగులే ఈ ఉన్నతస్థితికి చేరుకోలేకపోతే ఇక ఇంద్రియ లోలురైన మిగిలిన యోగాభ్యాసకుల గురించి చెప్పేదేముంది. అయితే కృష్ణ చైతన్య భక్తుడు తన శరీరానికి కావలసిన కనీస అవసరాలను మాత్రమే స్వీకరింస్తూ ఇంద్రియాలను అదపు తప్పకుండా భగవంతుడు ఇచ్చిన ధర్మాలను నెరవేరుస్తూ, ఆకస్మిక సంఘటనలు, రోగాలు, కరువు కాటకాలు, హఠాన్మరణాలకు సైతము తల్లడిల్లక నిశ్చలముగా ముందుకు కొనసాగుతాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement