Monday, May 6, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 4, శ్లోకం 36

36
అపి చేదసి పాపేభ్య:
సర్వేభ్య: పాపకృత్తమ: |
సర్వం జ్ఞానప్లవేనైవ
వృజినం సంతరిష్యసి ||

తాత్పర్యము : ఒక వేళ నీవు పాపులందరిలోను పరమపాపిగా భావింప బడినను దివ్య జ్ఞానమనెడి నౌక యందు స్థితుడవైనచో దు:ఖసముద్రమును దాటగలవు.

భాష్యము : ఈ భవ సాగరములో ఉన్న వ్యక్తిని రక్షించెడి నౌక వంటిది భగవ ంతునితో మనకు గల సంబంధమును తెలియజేసే జ్ఞానము. శాస్త్రాలలో ఈ భౌతిక ప్రపంచాన్ని సాగరముతో పోల్చారు. గజ ఈతగాడు సైతము సముద్రాన్ని దాటలేడు. కాబట్టి సముద్రములో ఈత వచ్చినా రాకున్నా వ ్యక్తి మునిగిపోతాడు. అట్టి పరిస్థితిలో ఆ వ్యక్తికి సహాయము చేసిన వ్యక్తి నిజమైన శ్రేయోభిలాషి అవుతాడు. అదేవిధముగా కృష్ణ చైతన్యమనే నౌక జీవిని భవసాగరము నుండి కాపాడి కష్టాల నుండి విముక్తుడ్ని చేస్తుంది.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement