Sunday, April 28, 2024

అన్నమయ్య కీర్తనలు : ఇలయును నభమును

రాగం : నాట

ప|| ఇలయును నభమును నేక రూపమై
జల జగోళ్ళు జళిపించితివి || ఇలయును ||

చ|| ఎడసిన నలముక హిరణ్య కశిపుని
దొడికి పట్టి చేతుల బిగిసి
కెడపి తొడలపై గిరి గొన నదుముక
కడుపు చించి కహ కహ నవ్వితివి || ఇలయును ||

చ|| రొప్పుల నూర్పుల రొచ్చుల కసరులు
గుప్పుచు లాలలు గురియుచును
కప్పిన బెబ్బులి కసరుహుంకృతుల
దెప్పల వ సురల ధృతి యణచితివి || ఇలయును ||

చ|| పెళ పెళ నార్చుచు బెడ బొబ్బలిడుచు
థళ థళ మెఱువగ దంతములు
ఫళ ఫళ వీర విభవ రస రుధిరమ
గుళ గుళ దిక్కుల గురియించితివి || ఇలయును ||

- Advertisement -

చ|| అహోబలమున అతిరౌధ్రముతో
మహా మహిమల మలయుచును
తహ తహ మెదుపుచు తగు వేంకటపతి
యిహము పరము మాకిపుడొగితివి

Advertisement

తాజా వార్తలు

Advertisement