Friday, April 26, 2024

అన్నమయ్య కీర్తనలు : అప్పులేని సంసారము

రాగం : మిశ్రమలహరి

అప్పులేని సంసారము
అప్పులేని సంసారము పాటేచాలు ||అప్పులేని సంసారము||

కంతలేని గుడిశొక్క గంపంతయినచాలు
చింతలేని అంబలొక్క చేరెడుచాలు
జంతగాని తరుణి యేజాతైననదెచాలు
వింతలేని సంపదొక్క వీసమైన చాలు ||అప్పులేని సంసారము||

తిట్టులేని బతుకొక్క దినమైనన దెచాలు
ముట్టలేని కూడొక్క ముద్దేచాలు
గట్టుచెడి మనకంటే కొంచెము మేలైన చాలు
వట్టిజాలి బడకుంటే వచ్చినంత చాలు ||అప్పులేని సంసారము||

లంపటపడని మేలు లవలేశమేచాలు
రొంపికంబ మోకంటే రోయుటే చాలు
రంపపు కోరిక కంటే రతి శ్రీవేంకటపతి
పంపుననాతని కంటే భవమేచాలు ||అప్పులేని సంసారము||

Advertisement

తాజా వార్తలు

Advertisement