Saturday, April 27, 2024

అన్నమయ్య కీర్తనలు : ఉయ్యాల బాలునూచెదరు

రాగం : మధ్యమావతి
ఉయ్యాల బాలునూచెదరు కడు
నొయ్య నొయ్య నొయ్యనుచు

బాల యవ్వనలు పసిడి ఉయ్యాల
బాలుని వద్దపాడేరు
లాలి లాలి లాలి లాలెమ్మ
లాలి లాలి లాలనుచు

తమ్మిరేకు కను ద మ్ముల నువ్వుల
పమ్ముజూపులబాడేరు
కొమ్మల మట్టెల గునుకుల నడపుల
ధిమ్మి ధిమ్మి ధిమ్మినుచు

చల్లుచూపుల జవరాండ్లురే
పల్లె బాలుని పాడేరు
బల్లిదు వేంకటపతి జేరందెలు
ఘల్లు ఘల్లు ఘల్లనుచు

Advertisement

తాజా వార్తలు

Advertisement