Thursday, March 23, 2023

అన్నమయ్య కీర్తనలు : ఇందిరారమణుదెచ్చి

ఇందిరారమణు దెచ్చి యియ్యరో మా కిటువలె
పొంది యీతని పూజించ పొద్దాయ నిపుడు

- Advertisement -
   

ధారుణి మైరావణు దండించి రాముదెచ్చి
నేరుపున మించిన అంజనీతనయా
ఘోర నాగపాశముల కొట్టివేసి యీతని
కారుణ్య మందినట్టి ఖగరాజ గరుడా

నానా దేవతలకు నరసింహు కంభములో
పానిపట్టి చూపినట్టి ప్రహ్లాదుడా
మానవుడై కృష్ణమహిమల విశ్వరూపు
పూని బండి నుంచుకొన్న పోటుబంట అర్జునా

శ్రీవల్లభునకు అశేషకైంకర్యముల
శ్రీవేంకటాద్రివైన శేషమూరితీ
కైవసమైనయట్టి కార్తవీర్యార్జునుడా
దేవుని నీవేళ నిట్టె తెచ్చి మాకు నియ్యరే

Advertisement

తాజా వార్తలు

Advertisement