Friday, April 26, 2024

ఈడీ కార్యాల‌యానికి ర్యాలీగా విప‌క్షాలు – అడ్డుకున్న పోలీసులు

కొత్త ఢిల్లీ – అదాని వ్య‌వ‌హారంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కార్యాలయానికి ర్యాలీగా వెళ్లేందుకు య‌త్నించిన విప‌క్షాల‌ను పోలీసులు అడ్డుకున్నారు..పార్లమెంట్‌ నుంచి బయటకు వచ్చిన నేతలను విజయ్‌ చౌక్‌లోనే నిలువరించారు. దీంతో ఈడి కార్యాల‌యానికి వెళ్ల‌కుండానే నేత‌లు వెను తిరిగారు.. దీనిపై కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు మ‌ల్లిఖార్జున ఖార్గే మాట్లాడుతూ,’అదానీ అంశంపై ఈడీ డైరెక్టర్‌ను కలిసేందుకు మేం బయలుదేరాం. కానీ మేం వెళ్లేందుకు ప్రభుత్వం అనుమతించలేదు. ఇది ఎంతో పెద్ద కుంభకోణం. ఆ గ్రూప్‌లో ఎల్‌ఐసీ, ఎస్‌బీఐ, ఇతర బ్యాంకుల పెట్టుబడులు ఉన్నాయి. ప్రభుత్వ ఆస్తుల కొనుగోలుకు ప్రభుత్వం ఒక వ్యక్తికి డబ్బు ఇస్తోంది. గతంలో కొద్దిపాటి వ్యాపారాలు ఉన్న వ్యక్తి అనూహ్యంగా రూ.13 లక్షల కోట్లకు ఎలా ఎగబాకాడు..? ఇది ఎలా సాధ్యం..? ఎవరు డబ్బు ఇస్తున్నారు..? మోడీకి, అదానీకి మధ్య ఉన్న సంబంధం ఏంటి..? ఈ విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నించిన ప్రతిపక్ష నేతల గళాన్నిఅణచివేస్తున్నారు’ అంటూ విరుచుకుప‌డ్డారు..కాగా, కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీడ‌ చేసిన వ్యాఖ్యలు, షేర్ మార్కెట్‌లో అదానీ గ్రూప్‌డ సృష్టించిన ఒడుదొడుకులు పార్లమెంట్‌ కార్యకలాపాలు స్తంభిస్తున్నాయి. రాహుల్ వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలని అధికార పక్షం బిజెపి,.. షేర్ల పతనంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేయాలనే విపక్షాల డిమాండ్లతో ఉభయ సభలు దద్దరిల్లుతున్నాయి. దాంతో రాజ్యసభ, లోక్‌సభలో వాయిదాల పర్వం కొనసాగుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement