Friday, April 26, 2024

అన్నమయ్య కీర్తనలు : తొల్లింటి వలెగావు తుమ్మెదా

రాగం : శ్రీరాగం

తొల్లింటి వలెగావు తుమ్మెదా ఇంక
వొల్లవుగా మమ్మునో తుమ్మెదా || ||తొల్లింటి వలెగావు తుమ్మెదా ||

తోరంపు రచనల తుమ్మెదా కడు
దూరేవు గోవిందులే తుమ్మెదా
దూరినా నెరగవు తుమ్మెదా మమ్ము
వోరగా చూడకు వో తుమ్మెదా || ||తొల్లింటి వలెగావు తుమ్మెదా ||

తొలి ప్రాయపు మిండ తుమ్మెదా కడు
తొలిచేవు చేగలే తుమ్మెదా
తొలకరి మెరుగునే తుమ్మెదా ఇంక
ఉలికేవు మముగని వో తుమ్మెదా || ||తొల్లింటి వలెగావు తుమ్మెదా ||

దొరపు వేంకటగిరి తుమ్మెదా మా
తురుమేల చెనకేవు తుమ్మెదా
దొరకే నీ చనవులు తుమ్మెదా ఇంక
ఒకులెరింగిరిగద వో తుమ్మెదా || ||తొల్లింటి వలెగావు తుమ్మెదా ||

Advertisement

తాజా వార్తలు

Advertisement