Saturday, May 4, 2024

అజ్ఞానాన్ని తొలగించేదిఆత్మచింతన

మానవులకు జీవితపు విలువలు, ముక్తికి మార్గం చూపే దీపపు స్థంభాలు మహర్షులు. వారు మానవులుగా పుట్టి పూర్వజన్మ పుణ్యం ద్వారా కర్మచేత మహ ర్షులుగా పూజలు అందుకుంటారు. అలాం టివారిలో భగవాన్‌ రమణమహర్షి ఒకరు. ఆయన ఎల్లవేళలా తన దగ్గరకు వచ్చే భక్తులకు మానసిక అజ్ఞానాన్ని తొలగించు కోవడానికి ఆత్మ చింతనే ప్రధాన మార్గ మని సందేహవిచ్చేవారు.
భారతదేశ చరిత్రలో 20వ శతాబ్దం లో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వారిలో రమణమహర్షి ఒకరు. ఆయన బోధనల్లో ముఖ్యమైంది ‘మౌనం’ లేదా ‘మౌనము ద్ర’. రమణ మహర్షి తక్కువగా ప్రసంగిం చేవారు. ఆయన చుట్టూ భక్తులు మౌనం గా కూర్చుంటారు. తన మౌనంతో సందే శం పొందలేని వారికి మాత్రమే మాటల ద్వారా మార్గం చూపేవారు. రమణ మహ ర్షి ఆత్మజ్ఞానం గురించి ప్రధానంగా బోధించేవారు. ఎవరైనా ఉపదేశించమని కోరితే, అజ్ఞానాన్ని తొలగించేందుకు, ఆత్మచింతనకు స్వీయ విచారణ ముఖ్యమైనదని, అందుకే ‘స్వీయ శోధన’ సూటి మార్గమని, తద్వారా మోక్షం సులభ సాధ్యమని బోధించేవారు. ఆయన బోధనలలో విశ్వజనీయమైన ఆత్మజ్ఞానం ప్రధా నాంశంగా బోధించేవారు. అతని అనుభవం అద్వైతం, జ్ఞానయోగాలతో ముడిపడి ఉన్నా కూడా అడిగినవారి మనస్థితిని బట్టి వారికి భక్తి మార్గాలని బోధించేవారు.
ఒకసారి రమణ మహర్షి వద్దకు ఒక పెద్దమనిషి వచ్చాడు. ఆయనకు నమస్కరించాడు. భగవాన్‌ని నిందిస్తున్నట్లుగా ఇలా పలికాడు.
”భగవాన్‌! మీరు పశుపక్షుల మీద, పిల్లుల మీద, దిక్కులేని దరిద్రుల మీద ఎంతో ఆదరణ చూపిస్తారు. కావాలని వాళ్ళని పలకరిస్తారు. లాలిస్తారు. మీ చేతులతో వారికి తినిపిస్తారు. మేము మీ చూపు కోసం, మాట కోసం, మీ చేతి నుండి ప్రసాదం తీసుకోవాలని ఎంతో తపించిపోతుంటాము. ఎంత ప్రాధేయపడినా, ప్రార్థించినా మమ్మల్ని పట్టించుకోరు. మా వంకే చూడరు. ఇది మీకు న్యాయ మా? ఇలా చేయడం మీ సమత్వానికి భంగం చేయడం కాదా? అని నిష్టూరంగా అడిగాడు.
అంతావిన్న రమణ మహర్షి పెదవులపై చిరునవ్వు తొణికిసలాడింది. కొంతసమయం మౌనం వహించారు. తర్వాత ఎంతో శాంతంగా… మృదువుగా ”మీ సందేహం అదా! ఆ పశువులు, పక్షులు, పిల్లులు అత్యంత సహజంగా, ఏ కోరికలు కోరకుండా నా దగ్గరకు వస్తారు. ఏ కాంక్షలు, కోరికలు వారికి ఉండవు. అందువల్లే నేను వాటిని అత్యంత సహజంగా ప్రేమిస్తాను. అట్లా సహజంగా ప్రవర్తించడం నాకు ఇష్టం. ఇంకా పెద్దలు ఎన్నో కోరికలతో, కాపీనాలతో ఇక్కడ నుండి ఏదో పట్టుకుపోవాలనే కాంక్ష తో వస్తారు. దానికోసం కావాలని భక్తిని తెచ్చి పెట్టుకుంటారు. నటిస్తారు. ఇవన్నీ వేషాలు మాత్రమే. ఇవి భగవంతుణ్ణి ఏమార్చలేవు” అని సందేహ నివృత్తి చేశారు.
”నా అంతటి భక్తుడు లేడని పెద్ద దండో, పూలో, ఫలాలో బుట్టలనిండా తెస్తారు. ఇవి అవసర మా? నిర్మలమైన భక్తి ఒక్కటి వుంటే చాలు. నీ గూర్చి తెలిసిన భగవంతునికి, నీ మనసులో ఏముందో తెలియదా… ఇలా నటించే భక్తుల భక్తికి భగవంతుడు ఎలా దాసుడవుతాడు. భక్తుడు ఎప్పుడూ నిర్మల మైన మనసుతో ఉండాలి. అంటే భగవంతుడికి ఎవరు అంటే ఇష్టం. భగవంతుడు ఎవరికి దాసుడు అవుతాడు. ఆయన ఎవరిని ఇష్టపడాలి? భగవంతుడు అనంత దయాసాగరుడు. మానవులను ఎన్నడూ వదిలిపెట్టడు. అన్ని దశల్లో కాపాడడానికి ప్రయత్నిస్తాడు. వారిని సరైన మార్గంలో నడిపించడానికి వారికి గురువులనూ, శాస్త్రాలను ఇస్తాడు. వారి ద్వారా కొత్త అవకాశాలను కల్పిస్తాడు. సరైన మార్గం చూపిస్తాడు. తన తప్పులను తెలుసుకొనేలా చేస్తాడు. చివరకు శాశ్వతా నందాన్ని ప్రసాదిస్తాడు ” అని భగవాన్‌ శ్రీ రమణ మహర్షి ఆ పెద్ద మనిషికి సందేహ నివృత్తి చేస్తూనే అందరికీ ఉద్బోధించేవారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement