Thursday, May 9, 2024

ఏపీ పొదుపు సంఘాలు దేశానికే రోల్ మోడల్ .. జగన్

ఏపీ పొదుపు సంఘాలు దేశానికే రోల్ మోడల్ అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఏలూరు జిల్లా దెందులూరులో నిర్వ‌హించిన బ‌హిరంగ స‌భ‌లో సీఎం జ‌గ‌న్ మాట్లాడుతూ… రూ. 6,419.89 కోట్ల ఆర్థిక సాయాన్ని నేటి నుంచి ఏప్రిల్‌ 5 వరకు 10 రోజుల పాటు పండగ వాతావారణంలో 7,98,395 స్వయం సహాయక పొదుపు సంఘాల్లోని 78,94,169 మంది అక్కచెల్లెమ్మల ఖాతాల్లో జమ చేస్తున్నామన్నారు. నేడు అందిస్తున్న రూ. 6,419.89 కోట్లతో కలిపి వైయ‌స్ఆర్ ఆసరా ప‌థ‌కం కింద ఇప్పటివరకు వైయ‌స్‌ జగన్‌ ప్రభుత్వం అందించిన మొత్తం సాయం రూ. 19,178 కోట్లు అన్నారు. మూడున్నరేళ్లలోనే 98.5 శాతం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చిన ఏకైక ప్రభుత్వం తమదేనన్నారు.

చంద్రబాబు మాదిరిగా తమది మాటల ప్రభుత్వం కాదని, చెప్పింది చేసి చూపించే చేతల ప్రభుత్వమన్నారు. 2019 ఎన్నికల నాటికి అక్కచెల్లెమ్మలకు పొదుపు సంఘాల పేరిట ఉండే రుణాల మొత్తాన్ని నాలుగు దఫాల్లో నేరుగా వారి చేతికే అందిస్తానని మాట ఇచ్చి అమలు చేస్తున్నామని గుర్తుచేశారు. వైఎస్సార్‌ ఆసరా పథకం ద్వారా మూడో సంవత్సరం కూడా పొదుపు సంఘాల మహిళల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నామని ఎంతో సంతోషంగా తెలియజేస్తున్నానన్నారు. మేనిఫెస్టో అంటే అంకెల గారడీ కాదు. మేనిఫెస్టోను పవిత్రమైన భగవద్గీత, బైబిల్, ఖురాన్‌లా భావించి హామీల అమలుకు క్యాలెండర్‌ను ముందే ప్రకటించి 98.5 శాతం నెరవేర్చిన ఏకైక ప్రభుత్వం మనదన్నారు. ప్ర‌సంగం అనంత‌రం వ‌రుస‌గా మూడో ఏడాది వైయ‌స్ఆర్ ఆస‌రా ప‌థ‌కం సాయాన్ని సీఎం జగన్ బటన్ నొక్కి విడుదల చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement