Sunday, May 5, 2024

ఆద్యంతరహిత శక్తి స్వరూపిణి

దేవతలకు ఎన్నో నామాలు ఉంటాయి. కారణం వారిని ఒక నామంతో వర్ణిం చడం సాధ్యం కాదు. కొంతమంది దేవ తల సహస్ర నామాలు కూడా ప్రసిద్ధం. ఒక దేవ తకు సంబంధించిన ఒక్కో నామాన్ని సునిశితం గా పరిశీలిస్తే ఎన్నో విషయాలు తెలుస్తాయి.
ఆద్యంత శక్తి స్వరూపిణి సరస్వతీదేవి నామాలనే తీసుకుంటే వాటి ఆంతర్యాన్ని, పర మార్థాన్ని తెలుసుకోవచ్చు.
సరస్వతీ దేవికి ఉన్న నామాలలో శాస్త్రమ యి ఒకటి. సరస్వతీ దేవియే శాస్త్త్రము. ఆ దేవిని గురించి తెలుసుకునేందుకు శాస్త్రాలే మనకు ఆధారం. గ్రంథకర్త గురించి తెలుసుకోవాలంటే గ్రంథాలే మనకు ఆధారం. శ్రుతులు, స్మృతులు, శాస్త్రాలు, అన్నీ వర్ణ మయాలు. పరమేశ్వరి మాతృకావర్ణ స్వరూపిణి. కాబట్టి చతుర్వేదాలు, శిక్ష, వ్యాకరణం, ఛందస్సు, నిరుక్తం, జ్యోతిషం, కల్పంవంటి వేదాంగాలు, మీమాంస, న్యా యం, పురాణం, ధర్మశాస్త్త్రం వంటి శాస్త్రాలు అవన్నీ సరస్వతీ స్వరూపమే.
ఏదైనా విషయాన్ని నిర్ధారణ చేయాలంటే అది శాస్త్రాల ఆధారంగానే జరుగుతుంది. ఆ శాస్త్రాలన్నీ సరస్వతీ రూపాలే. అందుకే బ్రహ్మ పురాణంలో పరమేశ్వరి శరీరావయవాలే శాస్త్రా లు, ఆమె ఉచ్ఛ్వాస నిశ్వాసాలే వేదాలు అని ఉంది. అంతేకాదు ఆమె అభిమానంతో మహా మంత్రాలు, మధురాలాపనతో కావ్యాలు, నాట కాలు, అలంకారాలు, జిహ్వ నుంచి సరస్వతి, చుబుకం నుంచి వేదాంగాలు, కంఠం ఊర్ధ్వ రేఖ నుంచి మీమాంస, న్యాయశాస్త్రం, కంఠం మధ్య రేఖ నుంచి ఆయుర్వేదం, కంఠం మొటి రేఖ నుంచి చతుషష్టి తంత్రాలు, బాహువుల నుంచి కామ శాస్త్రము, ఈ రకంగా అన్ని శాస్త్రాలు పరమేశ్వరి నుంచే ఆవిర్భవించాయి. అందుకే ఆమె శాస్త్త్రమయి అయింది.
సరస్వతీదేవి రాతిమీద ఎందుకు కూర్చుంటుంది?

బ్రహ్మపత్ని, చదువుల తల్లి సరస్వతీదేవి తెల్లని వస్త్రాలు ధరించి శ్వేత పద్మంలో కూర్చుని మాణిక్యవీణను మీటుతూ ఉంటుంది. ఆమెకు శరదృతువు అంటే ఇష్టం. మూలానక్షత్రం సరస్వతి నక్షత్రంగా భావిస్తారు. అందుకే శర దృతువులో వచ్చే అశ్వీయుజ మాసంలో వచ్చే శుక్లపక్షంలో పంచమినాడు వచ్చే మూలా నక్షత్రం రోజు దుర్గాదేవిని సరస్వతీమాత అలం కరణలో పూజిస్తారు. ముత్యాల సరాలు ధరించే సరస్వతీదేవికి హంస వాహనం, నెమలి పింఛం అంటే అత్యంత ఇష్టం. సరస్వతీదేవి రాతి మీద కూర్చుని ఉండటానికి ఒక సంకేతం వుందని చెబుతారు శాస్త్ర పండితులు. సరస్వతి సర్వ విద్యలకు అధిదేవత! శక్తి సంపదలు స్థిరం కావు. ఎప్పటికైనా హరించుకుపోతాయి. కాని విద్య బండరాయిలా సుస్థిరమైనది అనే విష యాన్ని తెలియపర్చటానికే సరస్వతీదేవి రాతి మీద కూర్చుని ఉంటుంది.
అలాగే సరస్వతి మాత హంసనే వాహ నంగా ఎంచుకోవడానికి కూడా కారణముందని చెబుతారు. హంస జ్ఞాన పక్షి. పాలలో నీటిని పోసి వేరు చేయడం సాధ్యమా! కాదుకదా! కాని హంస ముందు పాలలో నీటిని పోసి ఉంచితే పాలను మాత్రమే తాగుతుందట. అంటే విద్య వల్ల వివేకం, విజ్ఞానం లభిస్తాయని తెలియ పర్చానికే ఆమె హంసవాహిని అయింది.
ఇక నెమలి ఆమె వద్ద ఎందుకు ఉంటుందం టే… సమస్త ప్రాణులు ఆడ మగ కలుస్తాయి. కాని నెమలికి సంభోగం ఉండదు. పవిత్ర పక్షి ఇది. మగ నెమలి కంటి నీటిని త్రాగి గుడ్లు పెడు తుంది. విద్య పవిత్రమైనదని, విద్య నేర్చు కొనేప్పుడు పవిత్రంగా ఉండాలని తెలియ పర్చటానికే నెమలిని సరస్వతీదేవి వద్ద చిత్రిస్తారు.
అధిదేవత సరస్వతి

‘ఆద్యంత రహిత శక్తి స్వరూపిణి’ సరస్వతీ దేవి గురించి ఋగ్వేదంలోనూ, దేవీ భాగవ తంలోనూ, బ్రహ్మ వైవర్త పురాణం లోనూ, పద్మ పురాణంలోనూ వివిధ గాథలు వున్నాయి. సృష్టి కర్త బ్రహ్మ సరస్వతిని సృష్టించి, సృష్టి కార్యంలో తనకు తోడుగా ఉండటానికి తన జిహ్వపై ధరిం చాడని ఒక కథ. సృష్టి కార్యాన్ని నిర్వహించడా నికి బ్రహ్మకు శక్తి స్వరూపిణిగా సరస్వతిని శ్రీమాతాదేవి ప్రసాదించిందని దేవీభాగవతం చెబుతుంది. సరస్వతిని బ్రహ్మకు విష్ణుమూర్తి ఇచ్చాడని మరొక కథ. వాక్‌, బుద్ధి, వివేకం, విద్య, కళలు, విజ్ఞానం వీటన్నింటికి అధిదేవతగా సర స్వతిని పూజిస్తారు.

– డాక్టర్‌ చదలవాడు హరిబాబు
98495 00354

Advertisement

తాజా వార్తలు

Advertisement