Saturday, May 4, 2024

సకల శుభాలనిచ్చే ఆది కామాక్షి

కంచి అనగానే మనకు కామాక్షిదేవి గుర్తువస్తుంది. ఆ నగరాన్ని స్మరిస్తేనే మోక్షం లభిస్తుంది. కామాక్షీదేవి ఆలయానికి వెనుక వైపు ఒక ఆలయం ఉంది. అదే ఆదికామాక్షీదేవి ఆలయం. ఈ ఆలయాన్ని కాళీకొట్టమ్‌ (కాళీ కోష్టమ్‌) అనే పేరుతో కూడా పిలుస్తారు.

ఒకానొక సమయంలో పార్వతీదేవి ఇక్కడ కాళీరూపంలో వెల సిందట. నాటినుండి ఆమెకు ఆ పేరు ప్రసిద్ధమైంది. కంచి కామా క్షిదేవి ఆలయం కంటే ఇది ప్రాచీనమైనదని చెబుతారు. కామాక్షీదేవికి ముందు భాగంలో శక్తి లింగం ఒకటుంది. అమ్మవారి ముఖం లింగంపై ఉంటుంది. ఇది అర్ధనారీశ్వర లింగంగా పూజలందుకుంటోంది. వివాహం కానివారు ఈ శక్తి లింగాన్ని పూజిస్తే తప్పక వివాహం జరుగుతుందని నమ్ముతారు. ఈ ఆలయంలో ఆదిశంకరులు శ్రీచక్ర ప్రతిష్ఠ చేసి అమ్మవారి ఉగ్రత్వాన్ని శాంతింప చేశారట. గర్భగుడిలో ఆదికామాక్షీదేవి పద్మాసనంలో కూర్చుని అభయముద్రను, పానపాత్రను, పాశాంకు శాలనూనాలుగు చేతులతో ధరించి దర్శనమిస్తుంది. అమ్మవారి పీఠానికి కింది భాగంలో మూడు శిరస్సులు దర్శనమి స్తాయి. వాటి వెనుక ఒక పౌరాణిక గాథ ఉంది. శిల్పకుశలురైన ధర్మపాలుడు, ఇంద్రసేనుడు, భద్రసేనుడు అనే ముగ్గురు కాంచీపురంలో తమ శిల్పాలను ప్రదర్శించడానికి వస్తారు. వారి శిల్పకళకు అచ్చెరువొందిన కంచి రాజు వారికి ఒక మాట ఇచ్చి తప్పుతాడు. దాంతో రాజుకు శిల్ప సోదరులకు యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధాన్ని నివారించేందుకు కామాక్షీదేవి ప్రత్యక్షమై వారి సంధి చేస్తుంది. శిల్పులకు తన పాదసన్నిధిలో స్థానం కల్పించి అనుగ్రహస్తుంది. సకల శుభాలనూ, సకల సిద్ధులనూ అనుగ్రహంచే చల్లని తల్లి ఆది కామాక్షీదేవి – దైతా నాగపద్మలత

Advertisement

తాజా వార్తలు

Advertisement