Friday, May 3, 2024

శివాలయ ధ్వజస్తంభ ప్రతిష్ఠలో అపశ్రుతి

హనుమాన్‌ జంక్షన్‌ (కృష్ణా) ప్రభన్యూస్‌:శివాలయ ధ్వజస్తంభ ప్రతిష్ఠలో అపశ్రుతి చోటుచేసుకుంది. రాతి ధ్వజస్తంభం విరిగి పడటంతో ఏడుగురికి తీవ్ర గాయాలైన సంఘటన కృష్ణా జిల్లా మల్లవల్లిలో బుధవారం భయభ్రాం తులకు గురిచేసింది. ఈ దుర్ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మల్లవల్లిలోని అన్నపూర్ణా సమేత కాశీ విశ్వేశ్వరా లయంలో ధ్వజస్తంభ ప్రతిష్ఠించాలని అలయ కమిటీ- నిర్ణయిం చింది. ఆ మేరకు బుధవారం పూజాదికాలు పూర్తి చేశారు. తరు వాత క్రేన్‌ సాయంతో ప్రతిష్ఠాపనకు పైకి ఎత్తుతుండగా 12 టన్నుల బరువైన 26 అడుగుల ఎత్తుగల రాతి ధ్వజస్థంభం మూడు ముక్కలుగా విరిగిపోయింది. అడుగునున్న శిలాభాగం గోతిలో నిలబడిపోగా పై భాగం క్రేన్‌కు వేళ్లాడుతూ ఉండిపోయింది. మధ్య భాగానికి చెందిన శిల భక్తులపై పడింది. దీంతో ఏడుగురు భక్తులకు గాయాలయ్యాయి. వారిలో చాకిరి తిరుపతయ్యకు తల, కంటి భాగం దెబ్బతిన్నా యి. ఒత్తుమిల్లి సుబ్రమణ్యం అనే వ్యక్తికి నడుం భాగంలో గాయమైందని, ఏర్రుశెట్టి అనసూయమ్మ అనే మహిళకు కాలు తెగి అక్కడే పడిపోయిందని, నలుగురు భక్తులకు స్వల్ప గాయాలయ్యాయని స్థానికులు తెలిపారు. క్షతగాత్రులను విజయవాడ అసుపత్రికి తరలించారు. ధ్వజస్తంభం కోసం రాయిని నల్లగొండలో కొనుగోలు చేసి మైలవరంలో చెక్కించామని, మైలవరం నుండి 3 రోజుల క్రితం ఇక్కడికి తీసువచ్చి ఇదే క్రేన్‌ సాయంతో దించామని ఆలయ కమిటీ- వారు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement