Sunday, May 5, 2024

మానవాళికి ఆదర్శం..రాధాకష్ణుల ప్రేమతత్వం

భాద్రపద శుద్ధ అష్టమి శ్రీకృష్ణ పరమాత్మ పూజకు ఉత్కృష్ట మైన రోజు. ఈరోజు పవిత్ర ప్రేమకు చి#హ్నంగా చెప్ప బడుతూ ఉన్న రాధాకృష్ణులను పూజించడం సాంప్రదాయం. అందుకే ఈ రోజుకు ‘రాధాష్టమి’ అని పేరు వచ్చింది. ఈ రోజు రాధాకృష్ణులను పూజించడం వల్ల సంసార సుఖం లభిస్తుందని, భార్యాభర్తల మధ్య అనురాగం పెరుగుతుందని చెబుతారు. ‘రాధా య నమ:’ అనే మంత్రాన్ని శ్రీకృష్ణుడు ఆ దేవి నుంచి రాస మండ లంలో ఉపదేశ రూపంలో పరిగ్ర#హంచాడని, అదే మంత్రా న్ని గురు పరంపర నుంచి నారదుడు గ్రహించాడని ‘పద్మ పురాణం’ చెబు తున్నది. రాధ జన్మ వృత్తాంతం గురించి భిన్నగాథలు వ్యాప్తిలో ఉన్నాయి. ఆమె కేదారుడు అనే రాజుకు యజ్ఞ కుండంలో పుట్టిన కుమార్తె అని చెబుతారు. పేరు బృంద అని, కృష్ణుణ్ని భర్తగా పొందా లని కోరి తపం ఆచరిస్తే ఆయన ప్రత్యక్షమయ్యాడని విశ్వసిస్తారు.
ద్వాపర యుగంలో రాధ తనను సేవించడం వల్ల ఆ ప్రదేశం ‘బృందావనం’గా మారుతుందని వరమిచ్చాడనీ ఆ గాథ సారాం శం. వృషభానుడు, కళావతి దంపతులకు పుట్టిన తనయకు గర్గ మహాముని ‘రాధ’ అని నామకరణం చేశాడు. బ్రహ్మవైవర్తం ప్రకా రం, దూర్వాస ముని ‘రసరశ్మి’ అని పేరు పెట్టాడు. శ్రీకృష్ణుణ్ని రాధా దేవి తన మనసులో లయం చేసి విజయం సాధించిన రోజు- భాద్ర పద శుద్ధ అష్టమి. అందుకే ‘రాధాష్టమి’గా వ్యవహరిస్తారు.
శ్రీకృష్ణుణ్ని ప్రాణాధారంగా చేసుకొన్న రాధ ఆయన వామ పార్శ్వం నుంచి పుట్టిందని చెబుతారు. ఆమె పుట్టగానే రాస మండ లంలో కృష్ణుడి సేవ కోసం ధావనం (పరుగు) సాగించడం వల్ల రాధగా మారిందని బ్రహ్మవైవర్త పురాణం వివరిస్తోంది.
గోలోకాన్ని మహారాస మండలి అంటారు. నిత్య బృందావనం, శ్వేత మండలి అని కూడా వ్యవహరిస్తారు. అది ఒక మహా రస జగత్తు. ఆ జగత్తుకు ప్రభువు గోపాలుడు. ఆయనే రాధామాధవుడు. ఆ రస సమ్రాట్‌ శక్తినే రాసేశ్వరిగా భావిస్తారు. ‘రాసము’ అంటే గోకు లంలోని ఒక క్రీడావిశేషం, సల్లాపం అని అర్థాలున్నాయి. ధావనం అంటే పరుగు. రాధాకృష్ణులు- ద్వంద్వ సమాసం. ఆ మాట విన గానే అద్వైత ప్రణయం గోచరిస్తుంది. అప్రాకృతమైన జగత్తులో- ముక్త ధామం, వైకుంఠం, గోలోకం అనే మూడు ప్రధాన లోకాలు ఉన్నాయని నారాయణోపనిషత్తు వర్ణిస్తుంది. రాధ అంటే భగవం తుని విశేషముగ ఆరాధించునది అని (భక్తి అని) అర్ధము. అనగా అత్యంత భక్తురాలు. కుండలి నుండి మూలాధార వరకు జాలు వారుతున్న అమృత బిందువులను (విశ్వశక్తిని) ధారలా భూలోక ము నుండి (మూలాధారా) వైకుంఠము (సహస్రారం)నకు తీసు కుని వెళ్ళగలిగే ఒక శక్తి… ధార… రాధ… ఇదో నిరంతర వాహని… ఇదే ధ్యానం… భక్తీ… ప్రేమ… కృష్ణుడనగా ఆకర్షించువాడని అర్ధ ము. నిరంతరం ఆత్మ అంతర్ముఖం కమ్మంటుంది. కాని మనం అత్మరాత్మ మాట వినం. ఇంద్రియాలు చెప్పినది చేస్తూ ఉంటాము. రాధ యనగా సిద్ధింప చేయునది అని అర్ధము (మోక్షం). కృష్ణ (సాధ కుడు) ఎక్కడ ఉంటే (నిరంతర) ధార (రాధ) అక్కడ ఉంటుంది. శ్రీకృష్ణుడికి రాధ ప్రాణాధికురాలైన ప్రియురాలు. మహా ప్రకాశవంతమై న గోలోక రాస మండలంలో రాధా కృష్ణులే ఆది దంపతులు. నాలుక కొన నుంచి పుట్టిన కన్య ‘రాధ’ కాలాంత రంలో రెండు రూపాలు ధరించిం దని పురాణ కథనం. అందులో ఒకటి లక్ష్మి రూపమని, రెండోది రాధ ప్రతి రూపమని భావిస్తారు. భౌతిక భావా లకు, ప్రేమకు ఎటువంటి సంబంధం లేదని రుజువు చేసిన ప్రేమ రాధా కృష్ణులది. వారి ప్రేమ మీరాభాయి దగ్గర నుండి కబీర్‌దాస్‌ వరకు ప్రతి ఒక్కరికీ ప్రేరణనిచ్చి రచనలు చేసేలా ఉసిగొల్పింది. ఈనాటికీ ప్రేమికులను లేదా పెళ్ళైన ముచ్చటైన జం టను పోల్చాలి అంటే రాధాకృష్ణుల వలెనే ఉండమని దీవిస్తున్నారు అంటేనే అర్ధం చేసుకోవచ్చు. ఈ విశ్వమే అంతమైనా వీరి ప్రేమ మాత్రం మధుర కావ్యంలా ఎప్పటికీ నిలిచి ఉంటుంది. రాధాకృష్ణు లు ప్రేమ కు స్వచ్ఛమైన రూపం, వారి ప్రేమ హృదయంలో వికసించే పూలతోట వంటిది. ఇంద్రియాలకు చెందిన సాధారణమైన సంబం ధం కాదు, అనిర్వచనీయమైనది. ఇప్పటికీ, ఎప్పటికీ చెక్కు చెదరని ప్రేమ అంటే రాధాకృష్ణులే మొదట స్ఫురణకు వచ్చేది. జీవితంలో అన్నిటినీ పొందగలిగిన కృష్ణుడు, ఏదైనా కోల్పోయాడు అంటే అది రాధ ప్రేమనే. అంతగా కృష్ణుని మనసునే కలచి వేసిన అంశంగా రాధ మిగిలిపోయింది.
రాధామాధవం ఎంత రమణీయం! రెండు పవిత్ర హృదయాల దివ్య సంగమం, స్వచ్ఛమైన ప్రేమకు అచ్చమైన ప్రతిరూపం. తనను తాను ప్రేమించుకుందుకు, తన నుండి తాను వేరుపడి మాధవుడు రాధగా జన్మించాడు. రాధ లోకోత్తర సౌందర్యమూర్తి. అరవిందం లాంటి అందం. మకరందం లాంటి మనస్సు. ఇలకు దిగిన ఇంద్ర ధనుస్సు. ప్రణయ మాధురి, రాధాసుందరి. కోటి మన్మధ లావణ్య కోమలాంగుడు. త్రిజగన్మో హన నీలవర్ణ శోభితుడు. సకల సద్గుణ భూషితుడు. నిర్మల హృదయుడు. నిర్గుణుడు. బృందావనంలో, పాల నురగతో సరిగంచులు దిద్దించిన కొత్త చీర ధరించి, విశేషమైన అలంకారాలతో, చందనం పూసిన కుందనపు బొమ్మలా వినూత్న శోభను రాధ విరజిమ్ముతుంటే, ఆమె ఎదురుగా కృష్ణుడు, సహజా లంకార సుందరుడు, రాగరంజితుడు, అనురాగ బంధితుడు రాధ సన్నిధిలో ఏకాంతంలో తన్మయుడై ఉంటాడు. శ్రీకృష్ణుని ప్రియురా లు రాధ జన్మదిన వేడుకలను రాధాష్టమి సందర్భంగా, రాధాకృష్ణు ల విగ్రహాలకు పెరుగు, పాలు, పండ్ల రసాలు, పాలు, కొబ్బరినీరు తదితరాలతో అభిషేకాలు నిర్వహించి అనంతరం స్వామి వారిని సర్వాంగ సుందరంగా అలంకరించి భక్తితో గీతాలు ఆలపిస్తారు. ప్రత్యేక పూజ, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహస్తారు. రాధా కృష్ణుల విగ్రహాలను అభరణాలు, నూతన వస్త్రాలతో విశేషంగా అలంకరిస్తారు. బృందా వనంలో ముఖ్యమైన ప్రదేశాలను భక్తులకు తెలియజేస్తూ వాటి విశిష్టతతో కూడిన వీడియోను ప్రదర్శిస్తారు. రాధను కీర్తిస్తూ వైష్ణవ ఆచార్యులు స్వరపరిచిన అద్భుత పాటలు ఆలపిస్తారు. అమ్మవారికి విశేష హారతి తర్వాత పవళింపు సేవ నిర్వ#హస్తారు. పవిత్ర ప్రేమకు చిహ్నంగా భావించి రాధాకృష్ణులను పూజిస్తారు. రాధాకృష్ణులు ఏకైక రూపులు. రాధాకృష్ణులను ఆరా ధించడం వల్ల భార్యాభర్తల మధ్య అను రాగం పెరుగుతుందని విశ్వాసం.

– రామకిష్టయ్య సంగనభట్ల
9440595494

Advertisement

తాజా వార్తలు

Advertisement