Tuesday, May 21, 2024

మండోదరి-అంత:సౌందర్యం

రామాయణ, మహాభారతాలు హందూపురాణాల్లో మహాకావ్యాలుగా కీర్తించబడుతున్నాయి. వీటిని జీవితసారాన్ని తెలిపే గ్రంథాలుగా భావిస్తారు హం దువులు. ఈ రెండు గ్రంథాల్లోనూ కనిపించే పాత్రల విశిష్ట తను తరచి చూస్తే, మనిషి దైనందిన జీవితంలో దర్శనమి స్తాయని పెద్దలు చెబుతుంటారు. అందుకనే కాలాలు గడుస్తు న్నా నేటికీ మనం వాటిని స్మరిస్తున్నాం…
మహాపతివ్రతగా ఖ్యాతిగాంచి, నేటికీ కీర్తించబడుతోం ది. ఇంద్రాది దేవతల్ని జయించిన ఇంద్రజిత్తుకు తల్లి. సుగు ణాలు పోసిన అందాలరాశి. మంచిచెడులు ఎరిగిన మహా సాధ్వి. రాక్షసరాజు భర్త అయినా, ఆమెకు అతని పట్ల ఉన్న అంకిత భావం వలన, మంచి భార్యగా, లంకా సార్వభౌముని పట్టమహషిగా స్తుతించబడుతున్నది. ఆమే రావణ బ్ర#హ్మ భార్య మండోదరి.
మండోదరి అంటే- కప్పపొట్ట్ట వంటి… పొట్ట కలిగినది అని అర్ధము. కప్ప పొట్ట వంటి పొట్టను కలిగి ఉండడము మహారాజ్జీ లక్షణమని సాముద్రిక శాస్త్రములో చెప్పబడిన ది. తదనుగుణముగానే మండోదరి త్రిలోక విజేత అయిన రావణాసునికి పట్టమహషి అయింది. పంచకన్యలలో నాల్గవ ఆమె మండోదరి. చిత్రం ఏమిటంటే రామాయణ కథానా యికగా సీత పంచకన్యలలో ఒకరిగా ఏవిధంగా స్థానం సంపాదించుకుందో, ప్రతి నాయకుడైన రావణాసురుడి ఇల్లాలైన మండోదరి కూడా పంచకన్యలలో ఒకరిగా ప్రఖ్యాతి పొందడం విశేషం.
మయాసురుడనే రాక్షసుడు గొప్ప శిల్పి. అతడికి మయబ్రహ్మ అని కూడా పేరు. ఆయన భార్య హమ. ఆమె గంధర్వకాంత. వారి సంతానమే మండోదరి. అత్యంత సౌందర్యవతి. తనకు ఒక అందమైన భవనం నిర్మించి ఇమ్మని అడగడం కోసం మయుడి వద్దకు వెళ్లిన రావణుడికి అనుకోకుండా మండోదరి కంటపడుతుంది. మొదటిచూపు లోనే ఆమెను మోహంచేస్తాడు. అతని బుద్ధి తెలిసిన మయుడు అతనికి తన కుమార్తెను ఇవ్వనంటాడు. అయితే, ఆ దంపతులను నయానా భయానా ఒప్పించి, ఆమెను వివా హం చేసుకుంటాడు రావణుడు. వలచి మరీ ఆమెను పెళ్లాడిన రావణుడు మొదట్లో బాగానే ఉన్నాడు కానీ, కొద్ది కాలానికే తిరిగి పరకాంతల పొందుకోసం వెంపర్లాడ సాగాడు. ఎంత గొప్ప శివభక్తుడయినా, వేదాలు చదివినా, పరాక్రమవంతుడయినా, అతనికి పరస్త్రీ వ్యామోహమనే అవలక్షణం ఉందని గ్రహంచిన మండోదరి, అతన్ని సరిదిద్దేందుకు ప్రయత్నించి విఫలం అవుతుంది. చేసేదేమీలేక ఓరిమితో సహస్తుంది. భర్తతో కలిసి తాను కూడా శివపూజ చేస్తుంటుంది. రావణుడు సీతను అపహరించుకుని పోయి… బంధించినప్పుడు కూడా మండోదరి వ్యతిరేకించింది. చివరికి రాముడు రావ ణుడిపై యుద్ధం ప్రకటించినప్పుడు రాముడితో యుద్ధం జరగబోయే ముందురోజు కూడా మండోదరి రావణాసురుడికి తన ఆలోచనను మానుకోమని బోధ చేసింది. కాని ఆమె ప్రయత్నాలన్నీ చెవిటివాని ముందు ఊదిన శంఖంలా మారాయి.
యుద్ధంలో రావణుడిని చంపేసిన తర్వాత యుద్ధ ప్రాంగణాన్ని మండోదరి సంద ర్శించింది. మహావీరుడైన తన భర్త విగత శరీరుడై రణరంగాన పడి ఉన్న దృశ్యం ఆమెను ఎంతో కలచివేసింది.
రావణాసుడు చనిపోయిన తరువాత అక్కడికి మేలి ముసుగు తీసేసి పరిగెత్తుకుం టూ రావణుడి పట్టమహషి అయిన మండోదరి వచ్చి, రావణుడిని కౌగలించుకొని ”ఇవ్వాళ నేను మేలి ముసుగులేకుండా పరిగెత్తుకొచ్చానని కోపం తెచ్చుకోకు, నువ్వు దేవతలందరినీ ఓడించావు, ఎందరినో తరిమికొట్టావు, దుర్భేద్యమైన కాంచన లంకని నిర్మించావు, 10 తలలతో 20 చేతులతో ప్రకాశించావు. ఆ రోజు హనుమంతుడు ఈ సముద్రాన్ని దాటి నీ పది తలకాయలు ఇప్పుడేగిల్లేస్తాను. కాని రాముడు నిన్ను చంపు తానని ప్రతిజ్ఞ చేశాడు కనుక వదిలేస్తున్నాను అని, లంకని కాల్చి వెళ్ళిపోయాడు. నీ జీవి తానికి ప్రమాదం వస్తుందని నువ్వు ఆలోచించలేదు. కొన్ని కోట్ల కోతుల్ని రాముడు వెంటపెట్టుకుని సముద్రానికి సేతువు కట్టించి దాటి వచ్చాడు, నీకు అప్పుడైనా అను మానం రాలేదా. గొప్ప తపస్సు చేసి చివరికి ఒక మనుష్యుడి చేతిలో మరణించావు.” అని పక్కకి తిరిగి రాముడిని చూసింది.
రాముడిని చూడగానే ”ఈయన మనుష్యుడు కాదు, సనాతనమైన పరమాత్మ. నిన్ను నిగ్రహంచడానికి వచ్చిన శ్రీమహావిష్ణువు, రాముడిని ఇన్నిసార్లు చూసినా వచ్చిం ది విష్ణువు అని నీకు ఎందుకు అర్ధంకాలేదు? రావణా! నువ్వు రాముడి చేత సంహరింప బడ్డావని లోకము అనుకుంటుంది. నువ్వు ఎందువలన చనిపోయావో నాకు తెలుసు. ఒకప్పుడు నువ్వు తపస్సు చెయ్యాలనుకొని నీ ఇంద్రియాలని బలవంతంగా తొక్కిపెట్టా వు. అప్పుడు నీ ఇంద్రియాలు నీ మీద పగబట్టాయి. అందుకని నిన్ను చంపింది రాముడు కాదు, నీ ఇంద్రియాలే నిన్ను చంపాయి.” ఎంత మర్యాదగా మాట్లాడిందో చూడండి. అంత శోకంలో కూడా అలా మాట్లడడం భార్యగా ఒక్క మండోదరికే సాధ్యపడింది. ఎటువంటి నిష్పక్షపాత తీర్పు చెప్పిందో చూడండి! అదీ ఈ జాతి వైభవం.
మహాసౌందర్యరాసులైన భార్యలు నీకు కొన్ని వేలమంది ఉన్నారు. ఎక్కడో అర ణ్యంలో ఉన్న సీతమ్మ మీద కామం పుట్టి ఆవిడని నువ్వు అనుభవించడం కాదు, నువ్వు, నీ రాజ్యము, నీ వారు భ్రష్టమవ్వడం కోసం నీకు ఆ కోరిక పుట్టింది. అయ్యో! నీకు సీతమ్మ ఎవరో అర్ధంకాలేదు, తన భర్తని అనుగమించి వచ్చిన ఇల్లాలిని ఒంటరిగా ఉన్నప్పుడు ఎత్తుకొచ్చావు. ఆ తల్లి తేజస్సు నిన్ను కాల్చింది. విభీషణుడు సీతమ్మ ఎవరో తెలుసుకు న్నాడు, ఆ పుణ్యఫలం ఇవ్వాళ విభీషణుడికి అనుభవంలోకి వచ్చింది, బతికిపోయాడు. రావణా! సీత నాకన్నా గొప్ప కులంలో పుట్టిందా, నాకన్నా గొప్ప రూపవతా, నాకన్నా గొప్ప దాక్షిణ్యం ఉన్నదా, సీత నాకన్నా ఎందులో గొప్పది? ఇవ్వాళ నాకు కొడుకు లేడు, భర్త లేడు, రాజ్యంలేదు, బంధువులులేరు, నీకు తలకొరివి పెట్టడానికి ఒక్క కొడుకూ లేడు. మహాపతివ్రత అయిన స్త్రీ ఏ ఇంటికన్నా వచ్చి కన్నీరు పెడితే, ఆ కన్నీరు కిందపడి తే, ఆ ఇల్లు నాశనమయిపోతుంది” అని బాధపడింది.
రాముణ్ణి శపిద్దామని బయలుదేరుతుంది. అయితే, శాంతమూర్తిలా ఉన్న రాము డిని చూసి ఆమె తన మనసు మార్చుకుంటుంది. తన పతి శరీరానికి అంత్యక్రియలు నిర్వర్తించుకునేందుకు అనుమతి ఇమ్మని అర్థించింది. రాముడామె మాటను మన్నిం చాడు. విభీషణుని పిలిచి, రావణుని శరీరానికి అంతిమ సంస్కారాలు జరపవలసిందిగా సూచిస్తాడు. అంతేకాదు, మహాపతివ్రత అయిన మండోదరికి వితంతువు అయే దుస్థితి పట్టకూడదని ఆమెకు నిత్యసుమంగళి యోగం కలుగుతుందని, ఆమె పేరు విన్నంతనే పాపాలన్నీ తొలగిపోతాయనీ వరం ఇస్తాడు.
ఏ స్త్రీ అయినా భర్త హత్య చేయబడితే… తన ఆవేదనను, ఆక్రోశాన్ని తన భర్త చావు కు కారణమైన వారిపై ఆగ్రహాన్ని వెల్లడిస్తుంది. అయితే ధర్మం తెలిసిన మండోదరి. భర్త మరణించినా కూడా ధర్మమే మాట్లాడింది. అందుకనే మహాపతివ్రతగా కీర్తించ బడుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement